Saturday, July 18, 2026

Why Humans Can't Sit Alone — Blaise Pascal #subscribe #supercell #share #philosophy #viral #yt

Why Humans Can't Sit Alone — Blaise Pascal #subscribe #supercell #share #philosophy #viral #yt

Author Name:PhiloVi

Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=dBhxIE8au-w



Transcript:
(00:07) బ్లేస్ పాస్కాల్ ఒక గొప్ప మాట చెప్పాడు. మనుషులందరి కష్టాలకు ఒకే ఒక్క కారణం ఉంది అన్నాడు. అదేమిటంటే మనిషి ఒక్క గదిలో ఒంటరిగా ప్రశాంతంగా కొంతసేపు కూర్చోలేకపోవడం [సంగీతం] ఒక్కసారి మీ జీవితాన్ని గమనించండి. ఖాళీ సమయం దొరికిన వెంటనే మనం ఏం [సంగీతం] చేస్తాం. ఫోన్ చేతిలోకి తీసుకుంటాం. టీవీ ఆన్ చేస్తాం.
(00:29) ఎవరితోనైనా మాట్లాడాలని ప్రయత్నిస్తాం. ఎలాగైనా ఆ నిశ్శబ్దం [సంగీతం] నుంచి తప్పించుకోవాలనుకుంటాం. ఎందుకంటే ఆ నిశ్శబ్దంలో ఒక అసౌకర్యమైన నిజం మన ఎదుట నిలబడుతుంది. అదే మన ఒంటరితనం. బ్లేజ్ పాస్కాల్ దీనికి ఒక పేరు పెట్టాడు. దాని పేరు డైవర్టిస్మెంట్. తెలుగులో చెప్పాలంటే పరధ్యానం. మనిషి [సంగీతం] తన నిజమైన స్థితిని ఎదుర్కోకుండా ఉండటానికి పరధ్యానాన్ని ఆశ్రయిస్తాడని బ్లేస్ పాస్కాల్ [సంగీతం] చెప్పాడు.
(00:53) జూదం ఆడేవాడు కేవలం డబ్బు కోసం ఆడటం లేదు. తన మనసును ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోవడానికి ఆడుతున్నాడు. వేటకు వెళ్లేవాడు కేవలం జంతువును పట్టుకోవడానికి వెళ్లడం లేదు. తనలోని ఖాళీతనం నుండి తప్పించుకోవడానికి వెళ్తున్నాడు. బ్లేస్ పాస్కాల్ కాలంలో అవి వేట జూదం [సంగీతం] ఈరోజు అవి ఫోన్ స్క్రోలింగ్ సినిమాలు వెబ్ సిరీస్ లు ఆగకుండా పని చేస్తూ ఉండడం పేర్లు మారాయి.
(01:16) కానీ కారణం మాత్రం మారలేదు. ఇప్పటికీ మనిషి తనను తాను ఎదుర్కోవడానికి భయపడుతున్నాడు. [సంగీతం] బ్లేజ్ పాస్కాల్ ఒక ఆసక్తికరమైన ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక రాజుకి అన్ని ఉన్నాయి. అపారమైన సంపద ఉంది, అధికారం ఉంది, సేవకులు [సంగీతం] ఉన్నారు. అయినా అతనికి ఒంటరిగా నిశ్శబ్దంలో కూర్చొని ఆలోచించే సమయం వస్తే [సంగీతం] అతను బాధపడతాడు.
(01:37) ఎందుకంటే ఆ నిశ్శబ్దం అతనికి కూడా ఒక నిజాన్ని చూపిస్తుంది. తాను చివరికి ఒక సాధారణ మనిషేనని తెలుస్తుంది. తనకు మరణం తప్పదని అర్థమవుతుంది. అందుకే రాజుల చుట్టూ ఎప్పుడూ సంగీతం వేడుకలు జనం [సంగీతం] గుంపు వినోదం ఉండేలా చూసేవారని బ్లేజ్ పాస్కల్ చెప్పాడు. ఎందుకంటే నిశ్శబ్దం కంటే డిస్ట్రాక్షన్ సులభంగా అనిపిస్తుంది. [సంగీతం] కానీ ఇది కేవలం రాజుల కథ కాదు ఇది ప్రతి మనిషి కథ.
(02:01) బ్లేస్ [సంగీతం] పాస్కాల్ మనిషి గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మనిషి ప్రకృతిలో అత్యంత బలహీనమైన జీవి అని [సంగీతం] అన్నాడు. ఒక చిన్న రెల్లు గడ్డి లాంటివాడు. గాలి బలంగా వీచిన విరిగిపోవచ్చు. ఒక నీటి బిందువు కూడా అతని ప్రాణాన్ని తీసేయగలదు. కానీ [సంగీతం] మనిషికి ఒక శక్తి ఉంది. అది ఆలోచించగల శక్తి ఆలోచించగలగడమే మనిషి గౌరవం.
(02:22) కానీ [సంగీతం] విచిత్రం ఏమిటంటే మనుషులు ఆ ఆలోచనకే భయపడుతున్నారు. అందుకే తమ మనసును పరధ్యానంతో [సంగీతం] నింపేస్తున్నారు. ఆలోచన నుండి తప్పించుకుంటున్నారు. తమ నుండి తామే పారిపోతున్నారు. [సంగీతం] పారిపోవడం ఆపేయాలి అని బ్లేజ్ పాస్కాల్ చెప్పాడు. ఒంటరిగా నిశ్శబ్దంలో కూర్చోవడం నేర్చుకోవాలి అన్నాడు. మొదట్లో అది చాలా కష్టంగా ఉంటుంది.
(02:43) మనసులో వచ్చే ఆలోచనలు మనల్ని భయపెడతాయి. [సంగీతం] గతం గుర్తుకొస్తుంది. భవిష్యత్తు గురించి ఆందోళన మొదలవుతుంది. కానీ నెమ్మదిగా అదే నిశ్శబ్దం ఒక అద్దంలా మారుతుంది. అందులో [సంగీతం] మన నిజమైన రూపం కనిపించడం ప్రారంభం అవుతుంది అని చెప్పాడు. నేను ఎవరు? నాకు నిజంగా ఏమి కావాలి [సంగీతం] నేను ఎందుకు అసంతృప్తిగా ఉన్నాను ఈ ప్రశ్నలకు సమాధానాలు పరధ్యానంలో ఎప్పటికీ దొరకవు.
(03:05) [సంగీతం] అవి నిశ్శబ్దంలోనే పుడతాయి. అందుకే బ్లేజ్ పాస్కాల్ చెప్పింది ఇది. గదిలో ఒంటరిగా కూర్చోవడం. మన సమస్యలను నిజాయితీగా ఎదుర్కొనే మొదటి అడుగు. బ్లేస్ పస్కాల్ మనకు నేర్పింది ఒక్కటే మీరు ఎంత దూరం పరిగెత్తినా మీ నుండి మీరు తప్పించుకోలేరు. [సంగీతం] ఒక్కసారి నిశ్శబ్దంలో ఒంటరిగా కూర్చోండి. మొదట్లో అది భయంగా అనిపించవచ్చు. కానీ ఆ భయాన్ని దాటితే [సంగీతం] మీకు మీరు కనిపిస్తారు.
(03:28) మనిషి బలహీనుడే కానీ ఆలోచించగలిగే బలహీనుడు. అదే అతని గొప్పతనం. ఆ గొప్పతనాన్ని [సంగీతం] పరధ్యానంతో చంపేయకండి. ఒంటరితనం మీ శత్రువు కాదు. అది మీకు మీరు కలుసుకునే చోటు. ఓం

No comments:

Post a Comment