ఈ 7 పద్ధతులతో ఎవరి మనసునైనా చదవండి || కేవలం 1 నిమిషంలో - Chankya Niti🔥
Author Name:Telugu Vastu Tips
Youtube Channel Url:https://www.youtube.com/@teluguvaastutips
Youtube Video URL:https://www.youtube.com/watch?v=GU0kVKutkaY
Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ మనం ఒక్క క్షణంలో ఎదుటివారి మనసును చదవగలమా అసలు అవతలి వ్యక్తి మన గురించి ఏమనుకుంటున్నారు వారి మనసులో ఏం నడుస్తోంది ఇలాంటి విషయాలు మనం తెలుసుకోగలమా దీనికి సమాధానం అవును ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈరోజు నేను మీకు చెప్పబోయేది అదే మీరు చాలా సులభంగా ఎవరి మనసునైనా చదవవచ్చు. కానీ ఇలా చేయాలంటే మీరు కొన్ని నియమాలను కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి.
(00:28) ఎవరి మనసునైనా చదివే శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ దాన్ని సరైన పద్ధతిలో నేర్చుకొని నిరంతరం సాధన చేయాల్సి ఉంటుంది. ఈరోజు మనం ఆచార్య చాణక్యుని నీతి సూత్రాలు మరియు ఆయన జ్ఞానం ఆధారంగా ఈ అద్భుతమైన విద్యను అర్థం చేసుకుందాం. ఒకసారి చాణక్యుడు తన కుటీరం బయట ఉన్న చిన్న తోటలోకి వెళ్లి ఒక అందమైన గులాబీ పువ్వును కోసుకొని వచ్చాడు.
(00:51) ఆ పువ్వును చంద్రగుప్తునికి చూపిస్తూ ఈ పువ్వును చూడు చంద్రగుప్త ఎంత అందంగా ఉందో కదా అన్నాడు చంద్రగుప్తుడు ఏదో ఆలోచిస్తూనే తలుపాడు. కానీ అతని మనసు మాత్రం అక్కడ లేదు ఎక్కడో ఉంది. చాణక్యుడు మళ్ళీ అడిగాడు నీకు ఈ గులాబీ సువాసన నచ్చిందా చంద్రగుప్తుడు వెంటనే తేరుకొని అవును ఆచార్య చాలా అద్భుతంగా ఉంది అని బదులిచ్చాడు.
(01:14) అప్పుడు చాణక్యుడు చిరునవ్వుతో నువ్వు అసలు ఆ పువ్వును దగ్గరకు తీసుకొని వాసనే చూడలేదు. మరి దాని సువాసన అంత బాగుందని నీకు ఎలా తెలిసింది అని అడిగాడు ఆ ప్రశ్నకు చంద్రగుప్తుడు ఒక్కసారిగా తెల్లబోయాడు చాణక్యుడు కొనసాగిస్తూ నీ మనసు ఇక్కడ లేదు నువ్వు మగధ సింహాసనం గురించి ఆలోచిస్తున్నావు. ధననందుని ఎలా ఓడించాలా అని మతన పడుతున్నావు.
(01:36) కానీ నీ వ్యూహం ఎక్కడ విఫలం అవుతుందో అన్న భయం నిన్ను వెంటాడుతుంది. అవునా అన్నాడు చంద్రగుప్తుని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆచార్య ఇది ఎలా సాధ్యం నేను నా నోటితో ఒక్క ముక్క కూడా చెప్పలేదు కదా నా మనసులోని మాటను మీరు ఎలా గ్రహించారు అని ఆశ్చర్యంగా అడిగాడు. చాణక్యుడు చంద్రగుప్తుడిని కూర్చోమని సైగ చేసి చంద్రగుప్త ఎదుటివారి మనసును చదవడం అనేది ఏమీ మాయో మంత్రమో కాదు.
(01:59) అది నిరంతర సాధన. ప్రశాంతతో అలవడే ఒక గొప్ప విద్య. ఒక యోధుడికి ఉండే ఆ పట్టుదల కసి నీ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీ నుదిటిపై ఉన్న గీతలు నువ్వు ఏదో పెద్ద లక్ష్యం కోసం ఆతృతగా ఉన్నావని చెబుతున్నాయి. అలాగే నీ వేళ్ళు పదే పదే ఒకదానితో ఒకటి రాసుకుంటున్నాయి. అది నీలోని ఆందోళనను సంకోచాన్ని సూచిస్తోంది. ఇక నేను నిన్ను ఆ పువ్వు గురించి అడిగినప్పుడు నీ ఆలోచనలు ఎక్కడో ఉండటం వల్లే నువ్వు అసలు వాసన చూడకుండానే త్వరగా తప్పించుకోవడానికి అవును అని సమాధానం చెప్పావు అని వివరించాడు.
(02:32) అప్పుడు చంద్రగుప్తుడు ఎంతో కుతూహలంతో ఆచార్య ఇదంతా మీరు ఎలా గ్రహించగలిగారు? దీని వెనుక ఏదైనా తంత్ర విద్య ఉందా అని అడిగాడు. చాణక్యుడు నవ్వుతూ లేదు చంద్రగుప్త ఇది తంత్రం కాదు కేవలం మనశశాంతి మరియు ఎదుటివారి హావభావాలను జాగ్రత్తగా గమనించే ఒక కళ నేను నా మనసుని ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటానంటే ఎదుటివారి మనసులో జరిగే చిన్న అలజడిని కూడా నేను సులువుగా గ్రహించగలను అని చెప్పాడు.
(02:59) ఆ తర్వాత చాణక్యుడు చంద్రగుప్తుడితో ఒక చిన్న ప్రయోగం చేయించాడు. అతడిని ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోబెట్టి ఈ రోజు నుండి రోజు కొంత సమయం నువ్వు మౌనంగా ఉండు ఏమి మాట్లాడకు దేని గురించి ఆలోచించకు కేవలం నీ శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండు నీ మనసు ఎప్పుడైతే సంపూర్ణంగా ప్రశాంతం అవుతుందో అప్పుడు నువ్వు కూడా ఇతరుల మనసులను సులభంగా చదవగలుగుతావు అని చెప్పాడు.
(03:23) చంద్రగుప్తుడు ఈ సాధనను కొన్ని నెలల పాటు శ్రద్ధగా అభ్యసించాడు. మెల్లమెల్లగా అతనికి మనుషుల హావభావాలు వారి కళ్ళలోని కదలికలు వారు మాట్లాడే మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు అర్థం కావడం మొదలయింది. అప్పుడు చాణక్యుడు సంతృప్తిగా చూస్తూ ఇప్పుడు నేను నీకు ఒక కథ చెబుతాను శ్రద్ధగా విను ఆ కథ ముగిసిన తర్వాత ఎదుటివారి మనసును చదవడానికి ఉపయోగపడే ఏడు అద్భుతమైన మార్గాలను నీకు వివరిస్తాను అని అన్నాడు.
(03:52) చాలా సంవత్సరాల క్రితం కోసల దేశంలోని పచ్చని మైదానాల మధ్య ప్రవహించే సరియు నది ఒడ్డున ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అన్న చెల్లెలు నివసించేవారు. అన్నయ్య పేరు రామయ్య. అతనికి పుట్టుకతోనే కంటి చూపు లేదు. చెల్లెలు పద్మ గ్రామంలో ఒక చిన్న తోటను సాగు చేస్తూ ఆ పంటపైనే జీవించేది. పద్మ పెంచుతున్న తోట చాలా అందంగా ఉండేది.
(04:16) కానీ అడవి జంతువులు తరచు ఆ తోటపై పడి పంటను నాశనం చేస్తుండేవి. దీనివల్ల పద్మ తీవ్రంగా నష్టపోయేది. ఒకరోజు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. కంటి చూపు లేకపోయినా తన అన్నయ్య రామయ్యకు వినికిడి శక్తి చాలా ఎక్కువ. ఆ పదునైన వినికిడి శక్తి సహాయంతో తను అడవి జంతువుల ఉనికిని ఎందుకు పసిగట్టకూడదు అని అనుకుంది. వెంటనే పద్మ తన తోట మధ్యలో ఎత్తైన ఒక మంచను కట్టి అన్నయ్య రామయ్యను అక్కడ కూర్చోబెట్టింది.
(04:43) అన్నయ్య [గురకలు] నీకు తోటలో ఏదైనా అరుపు గాని వినబడితే వెంటనే నీ చేతిలోని కర్రతో ఈ మంచపై గట్టిగా కొట్టు ఆ శబ్దానికి జంతువులు భయపడి పారిపోతాయి అని చెప్పింది. చెల్లెలి మాట ప్రకారం రామయ్య ప్రతిరోజు ఆ మంచపై కూర్చొని తోటకు కాపలా కాయడం ప్రారంభించాడు. ఏ చిన్న శబ్దం వినబడినా అతను కర్రతో గట్టిగా కొట్టేవాడు. ఆ శబ్దానికి జంతువులు పారిపోయేవి.
(05:05) అలా వారి తోట సురక్షితంగా సాగసాగింది. ఒకరోజు అడవి పందిని వేటాడుతూ దాన్ని వెంటాడుతున్న ఒక రాజ సైనికుడు ఆ తోట దగ్గరకు వచ్చాడు. మంచపై కూర్చున్న రామయ్యను చూసి ఇటువైపు ఏదైనా అడవి పంది వెళ్ళడం చూశవా అని అడిగాడు. దానికి రామయ్య అయ్యా నేను కంటి చూపు లేని గుడ్డివాడిని నేనెలా చూడగలను కానీ ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. నువ్వు వెంటాడుతున్న ఆ జంతువు నీలాంటి సైనికుడు తన సమయాన్ని వృధా చేసుకొని మరీ వేటాడేంత విలువైనది కాదు అని సమాధానం ఇచ్చాడు.
(05:38) ఆ మాటలకు సైనికుడు ఆశ్చర్యపోయి నువ్వు కళ్ళు లేని వాడివి కదా మరి అంత నమ్మకంగా ఆ పంది వేటాడటానికి పనికి రాదని ఎలా చెబుతున్నావు అని ప్రశ్నించాడు. రామయ్య చాలా ప్రశాంతంగా నేను ఆ జంతువు అడుగుల చప్పుడు విన్నాను. దాని నడక చాలా బరువుగా నెమ్మదిగా సాగింది. గర్భవతిగా ఉన్న ఆడజంతువు మాత్రమే అలా నడుస్తుంది. ధర్మశాస్త్రం ప్రకారం ఒక సైనికుడు గర్భంతో ఉన్న మూగజీవాన్ని వేటాడకూడదు కదా అని వివరించాడు.
(06:02) సైనికుడి ఆశ్చర్యం రెట్టింపయింది. నిజమో కాదో తేల్చుకోవడానికి తన తోటి సైనికులను ఆ జంతువును వెతకమని పంపాడు. వారు వెళ్లి చూసి వచ్చి అవును ప్రభు రామయ్య చెప్పింది అక్షరాలా నిజం అది గర్భవతి అయిన ఆడపందే అని చెప్పారు. సైనికుడు రామయ్య దగ్గరికి వచ్చి నువ్వు చూడలేవు కదా ఇదంతా కేవలం శబ్దంతోనే ఎలా గ్రహించగలిగావు అని అడిగాడు రామయ్య వినయంగా అయ్యా నేను చూడలేకపోవచ్చు కానీ శబ్దాల వెనుక ఉన్న కదలికలను సరిగ్గా అర్థం చేసుకోగలను.
(06:32) ఆ జంతువు వేసిన బరువైన నెమ్మదైన అడుగులే అది గర్భవతి అని నాకు తెలియజేశయి అన్నాడు. రామయ్య అసాధారణ తెలివితేటలకు ముగ్దుడైన సైనికుడి మనసులో ఒక సందేహం మొదలైంది. వెంటనే తన వ్యక్తిగత ప్రశ్నను అడుగుతూ నువ్వు ఇంత సూక్ష్మ గ్రాహివి కదా మరి నా భార్య నాకు నమ్మకమైనదేనా కాదా చెప్పగలవా అని అడిగాడు. రామయ్య కాసేపు ఆలోచించి నీ మనసులో ఆ అనుమానం ఎందుకు కలిగిందో నాకు తెలుసు సరే నేను చెబుతాను కానీ నేను ఈ విషయం చెప్పాలంటే నీ భార్యను ఒకసారి ఒంటరిగా కలవాలి అన్నాడు.
(07:04) సైనికుడికి మొదట తీవ్రమైన కోపం వచ్చినప్పటికీ నిజం తెలుసుకోవాలనే ఆరాటంతో సరేనని ఒప్పుకున్నాడు. తన భార్య సావిత్రిని రామయ్య ఉన్న గదిలోకి పంపాడు. ఆ నిశశబ్ద గదిలో రామయ్య సావిత్రితో నిన్ను ఒక్కసారి తాకాలనిపిస్తోంది అన్నాడు. ఆ మాట వినడమే ఆలస్యం సావిత్రికి తీవ్రమైన కోపం వచ్చింది. వెంటనే రామయ్యను పిడికిళ్లతో చేతులతో దారుణంగా కొట్టడం ప్రారంభించింది.
(07:27) రామయ్య ఎలాగోలా ఆమె దెబ్బల నుంచి తప్పించుకొని గది బయటక వచ్చి సైనికుడి దగ్గరకు చేరాడు. నీ భార్య నీకు నమ్మకస్తురాలు కాదు అని రామయ్య తేల్చి చెప్పాడు. ఆ మాట వినగానే సైనికుడికి రక్తం ఉడికిపోయింది. కత్తి దూసి గదిలోకి వెళ్లి సావిత్రిని గద్దించాడు. నిజం చెప్పు నువ్వు నాకు నమ్మకంగానే ఉంటున్నావా అని అడిగాడు.
(07:50) భయపడిపోయిన సావిత్రి ఏడుస్తూ నేను నమ్మక ద్రోహం చేశాను నన్ను క్షమించండి అని నిజం ఒప్పుకుంది. ఆశ్చర్యపోయిన సైనికుడు రామయ్య దగ్గరికి వచ్చి ఈ రహస్యాన్ని నువ్వు ఎలా కనిపెట్టావు అని అడిగాడు. రామయ్య నెమ్మదిగా ఊపిరి పీల్చుకొని అయ్యా నేను ఆమెను తాకుతానని అనగానే ఆమెకు కోపం వచ్చింది. అది సహజం ఒక పతివ్రత అయిన స్త్రీ పరాయి మగాడు తనను తాకుతానంటే తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
(08:14) దూరం జరుగుతుంది. కానీ నీ భార్య నన్ను కొట్టే నెపంతో నా శరీరాన్ని మొత్తాన్ని తాకింది. కోపంలో కూడా పరాయి పురుషుడి స్పర్శను నివారించకుండా తాకడానికి వెనుకాడని స్త్రీ నమ్మకస్తురాలు ఎలా అవుతుంది? కేవలం ఆమె శారీరక ప్రవర్తన ఆధారంగానే నేను ఆ విషయాన్ని గ్రహించాను అని వివరించాడు. సైనికుడికి రామయ్య జ్ఞానంపై మరింత గురి కుదిరింది.
(08:37) తన మనసును తొలిచేస్తున్న మరో ప్రశ్నను అడిగాడు రామయ్య. నేను నా తండ్రికి పుట్టిన నిజమైన కొడుకునేనా లేక వేరే ఎవరికైనా పుట్టానా అని అడిగాడు. రామయ్య నవ్వి నువ్వు ఈ దేశాన్ని రక్షించే సైనికుడివి నీకు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది సరే నేను సమాధానం చెబుతాను. కానీ నువ్వు నాపై కోపగించుకోనని మాట ఇవ్వాలి అన్నాడు. సైనికుడు సరేనని మాట ఇచ్చాడు. అప్పుడు రామయ్య నువ్వు నీ తండ్రి రక్తానికే జన్మించావు కానీ నీపై ఒక పరమ పిసినారి జమీందారు నీడపడింది అన్నాడు.
(09:05) సైనికుడు ఆరాటంగా నేరుగా తన తల్లి దగ్గరికు వెళ్లి ఆ ప్రస్తావన తెచ్చాడు. అప్పుడు ఆమె నిజం చెబుతూ నాయనా నువ్వు నీ తండ్రి కొడుకువే కానీ నేను స్నానం చేస్తుండగా ఒక పిసినారి జమీందారు నీడ నాపై పడింది అని చెప్పింది. సైనికుడు పరుగు పరుగున రామయ్య దగ్గరికి వచ్చి రామయ్య ఈ వింత నిజాన్ని నువ్వు ఎలా తెలుసుకోగలిగావు అని అడిగాడు.
(09:27) రామయ్య చిరునవ్వుతో చాలా సులభమయ్యా నేను నీకు ఇంతటి నిజాలను చెప్తున్నా నువ్వు సంతోషపడ్డావే తప్ప నాకు కనీసం ఒక్క చిన్న బహుమతి కూడా ఇవ్వలేదు. సాధారణంగా రాజులు లేదా సైనికులు ఇలాంటి సమయాల్లో సంతోషంతో విలువైన బహుమతులు ఇస్తారు. కానీ నువ్వు మాత్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. దీన్ని బట్టే నీలో ఆ పిసినారి జమీందారు బుద్ధులు ఉన్నాయని నేను గ్రహించాను అన్నాడు.
(09:51) సైనికుడు తన తప్పు తెలుసుకొని సిగ్గుపడుతూ నవ్వి రామయ్య నువ్వు ఏమ అడిగినా ఇస్తాను. కానీ చెప్పు అసలు కళ్ళు లేకపోయినా ఇంత ఖచ్చితమైన సమాధానాలు నువ్వు ఎలా ఇవ్వగలుగుతున్నావ్ అని అడిగాడు. అప్పుడు రామయ్య అయ్యా నేను చూడలేకపోవచ్చు కానీ మనుషుల ప్రవర్తన వారి మాటల తీరు చేష్టలు మరియు వారి శారీరక భాషను జాగ్రత్తగా గమనించడం ద్వారా వారి మనసుల్లో ఏముందో సులభంగా చదివేయగలను అని చెప్పాడు.
(10:19) కథ పూర్తి చేసిన ఆచార్య చాణక్యుడు చంద్రగుప్తుని వైపు చూస్తూ ఇలా అన్నాడు. చూసావా చంద్రగుప్త ఎదుటివారి ఆలోచనలను మనసును అర్థం చేసుకోవడం ఎలాగో ఇప్పుడు నీకు అర్థమైందా ఇప్పుడు నేను నీకు ఇతరుల మనసును చదవడానికి ఉపయోగపడే ఆ ఏడు అద్భుతమైన మార్గాలను వివరిస్తాను. శ్రద్ధగా విను మొదటి సూత్రం ఎదుటివారి కళ్ళలోకి చూస్తూ వారి శరీర భాషను గమనించడం కళ్ళు మనసుకు అద్దం లాంటివి.
(10:47) మీరు ఎవరి కళ్ళలోకైనా లోతుగా చూసినప్పుడు వారి ముఖంలో వచ్చే చిన్న చిన్న మార్పులు అంటే కనుబొమ్మలు కొద్దిగా పైకి లేవడం పెదవుల అంచున విరిసే చిన్న నవ్వు లేదా కళ్ళు అటు ఇటు తిప్పడం వంటి చేష్టలు వారి మనసులో ఏం జరుగుతుందో స్పష్టంగా తెలియజేస్తాయి. ఉదాహరణకు ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు కళ్ళు కలపకుండా చూపులు దాటేస్తున్నారంటే వారు మీ దగ్గర ఏదో దాచడానికి ప్రయత్నిస్తున్నారని లేదా అబద్ధం చెబుతున్నారని అర్థం.
(11:15) అదే సమయంలో కళ్ళలోకి నేరుగా చూస్తూ మాట్లాడే ఆత్మవిశ్వాసంతో కూడిన చూపు వారిలోని నిజాయితీని దృఢత్వాన్ని సూచిస్తుంది. కళ్ళతో పాటు శరీర భాష కూడా అంతే ముఖ్యం. ఎదుటి వ్యక్తి కూర్చునే విధానం మాట్లాడేటప్పుడు చేతులు కదిపే తీరు ముఖ కవళికలు వారి అంతర్గత భావోద్వేగాలను పూర్తిగా బయట పెడతాయి. ఈ కలను మీరు నేర్చుకోవాలంటే ఒక డిటెక్టివ్లా నిశితమైన పరిశీలనా శక్తిని అలవర్చుకోవాలి.
(11:40) ఆకాశంలో ఎగురుతూ కింద ఉన్న ప్రతి చిన్న కదలికను గమనించే గద్దల మీ చూపు ఉండాలి. మీ రోజువారి జీవితంలో మీరు ఎవరిని కలిసినా అది మార్కెట్ లో ఉండే ఒక సాదా సీదా వ్యాపారి అయినా కావచ్చు లేదా ఆఫీస్ లో మీతో పని చేసే సహోద్యోగి అయినా కావచ్చు వారి ముఖ కవలికలను జాగ్రత్తగా గమనించడం అలవాటు చేసుకోండి. వారు నవ్వే నవ్వు నిజమైనదేనా లేక కేవలం మర్యాద కోసం నవ్వుతున్నారా వారి కళ్ళలో అసలైన ఉత్సాహం ఉందా లేక నిగూడమైన బాధ దాగి ఉందా అని గమనించండి.
(12:12) మొదట్లో ఇది కొంచెం కష్టంగా అనిపించినా క్రమంగా మీరు ప్రతి చిన్న విషయాన్ని సులభంగా పట్టుకోగలుగుతారు. దీనికోసం రోజుకు కేవలం ఐదు నిమిషాలు కేటాయించండి. ఏదైనా ఒక వ్యక్తి యొక్క శరీర భాషను జాగ్రత్తగా గమనించండి. వారి కళ్ళు ముఖం మరియు శరీర భంగిమలపై దృష్టి పెట్టండి. మీరు గమనించిన ఆ సంకేతాలను ఒక డైరీలో రాసి ఉంచుకోండి. కాలక్రమేణ ఈ సాధన మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకెళ్తుందంటే అవతలి వారు నోరువిప్పి ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా వారి మనసులోని భావాలను తక్షణమే పసిగట్టే ఒక నిపుణుడైన మనస్తత్వవేత్తగా మీరు మారిపోతారు.
(12:47) రెండవ సూత్రం ఎదుటి వారిని మనస్ఫూర్తిగా మాట్లాడనివ్వండి. ఎదుటివారు ఎంత ఎక్కువగా మాట్లాడితే వారిని అర్థం చేసుకోవడం మనకు అంత తేలికవుతుంది. ఎవరి మనసైనా చదవడానికి ఉన్న అత్యంత సులువైన మార్గం వారిని ఎలాంటి అడ్డుదోవలు లేకుండా స్వేచ్ఛగా మాట్లాడనివ్వడమే ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వారి మాటలు వారి గొంతుతీరు మాట్లాడే పద్ధతి వారి మనసులోని అసలు విషయాలను బయట పెట్టేస్తాయి.
(13:12) చాలాసార్లు మనుషులు పైకి చెప్పే మాటల కంటే వారు మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో ఎందుకు ఆగిపోతున్నారు? గొంతులో ఎందుకు హెచ్చు తగ్గులు వస్తున్నాయి ఏ పదాలను మళ్ళీ మళ్ళీ వాడుతున్నారు అనే విషయాలే వారి మనసు లోతుల్లో ఏముందో స్పష్టంగా చూపిస్తాయి. ఈ కలను మీరు నేర్చుకోవాలంటే మొదట ఓపికగా వినే మంచి శ్రోతగా మారాలి. మాటల్లో అస్సలు తొందర పడకండి.
(13:35) ఎదుటి వారిని వారి మాట పూర్తిగా పూర్తి చేయనివ్వండి. వారు చెప్పే విషయాల మీద ఎంత దృష్టి పెట్టాలో అంతకంటే ఎక్కువగా వారు ఎలా మాట్లాడుతున్నారు అనే దాని మీద దృష్టి పెట్టాలి. వారు ఆగి [గురకలు] ఆగి మాట్లాడుతున్నారా? వారి గొంతులో నమ్మకం కనిపిస్తోందా లేదా ఏదైనా భయం సంకోచం ఉన్నాయా కొన్ని పదాలను ప్రత్యేకంగా నొక్కి చెప్తున్నారా ఇలాంటివన్నీ గమనించాలి.
(13:56) తర్వాతిసారి మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కనీసం ఒక ఐదు నిమిషాల పాటు వారి మాటలకు అడ్డు చెప్పకుండా పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. వారు వాడే పదాలు, వారి గొంతులో మార్పులు ఎక్కడెక్కడ ఆగుతున్నారు అనే విషయాలను బాగా గమనించండి. ఆ తర్వాత ఒక్కసారి ఆలోచించండి వారి మాట తీరును బట్టి వారి మనసులో ఏం ఉండి ఉంటుందో ఊహించండి.
(14:21) ఈ చిన్న సాధన మిమ్మల్ని ఒక మంచి శ్రోతగా మార్చడమే కాకుండా ఎదుటివారి మనసును చాలా తేలికగా అర్థం చేసుకునేలా చేస్తుంది. మూడవ సూత్రం మొదట మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఎదుటివారి మనసును చదవడానికి ఉన్న అతి పెద్ద నియమం ఏంటంటే మొదట మీ సొంత మనసు ప్రశాంతంగా ఉండాలి. మీ మనసులోనే ఎన్నో ఆలోచనలు ఆందోళనలు లేనిపోని ఊహలు నిండి ఉంటే అవతలి వ్యక్తి మనసులో ఏం నడుస్తుందో మీరు అస్సలు కనిపెట్టలేరు.
(14:48) నిశశబ్దంగా ప్రశాంతంగా ఉండే మనసు మాత్రమే ఇతరుల భావాలను లోతుగా అర్థం చేసుకోగలదు. మనసు ప్రశాంతంగా ఉండటం అంటే అనవసరమైన ఆలోచనలను మనసులోని గందరగోళాన్ని ఆపేయడం గతం గురించి ఆలోచిస్తూ బాధపడకుండా భవిష్యత్తు గురించి ఊహిస్తూ భయపడకుండా కేవలం ఈ క్షణంలో బతకడమే నిజమైన ప్రశాంతత అలా ఉన్నప్పుడే మీ మనసు ఎటువంటి అలలు లేని ఒక నిశశబ్దమైన సరస్సులా మారుతుంది.
(15:15) ఈ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మీరు అవతలి వ్యక్తిలోని హావభావాలను వారి భావోద్వేగాలను చాలా స్పష్టంగా గ్రహించగలుగుతారు. ఇలాంటి ప్రశాంతతను సాధించడానికి ధ్యానం ఒక అద్భుతమైన మార్గం. దీనికోసం ప్రతిరోజు ఒక 10 నుండి 15 నిమిషాల పాటు ప్రశాంతమైన చోట కూర్చోండి. కళ్ళు మూసుకుని కేవలం మీ శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టండి. మధ్యలో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి.
(15:38) కానీ వాటితో కొట్టుకుపోకండి. ఆ ఆలోచనలను ఆకాశంలో తేలిపోయే మేఘాల్లా చూస్తూ వదిలేయండి. మొదట్లో మీ మనసు అటూ ఇటు పరిగెడుతుంది. కానీ రోజు రోజుకు సాధన చేస్తుంటే మెల్లగా అది ప్రశాంతంగా మారిపోతుంది. రోజులో ఏదో ఒక సమయాన్ని ఎంచుకొని కాసేపు పూర్తిగా మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆ సమయంలో ఎవరితోనూ మాట్లాడకండి. దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి.
(16:02) కేవలం మీ శ్వాసను మాత్రమే గమనించండి. ఈ చిన్న సాధన మీ మనసును నిశశబ్దంగా మార్చడమే కాకుండా ఎదుటివారి మనసును చదివే మీ శక్తిని రెట్టింపు చేస్తుంది. నాలుగవ సూత్రం ఎదుటివారి శరీర భాషను పరిశీలించండి. శరీర భాష అనేది మనసు రాసుకున్న ఒక బహిరంగ లేఖ లాంటిది. ఒక వ్యక్తి కూర్చునే విధానం మాట్లాడేటప్పుడు చేతులు కదిపే తీరు నిలబడే పద్ధతి.
(16:26) ఇవన్నీ వారి మనసులో ఏముందో స్పష్టంగా బయట పెట్టేస్తాయి. ఉదాహరణకు ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు తమ చేతులు మడుచుకొని ఉన్నారంటే వారు మిమ్మల్ని పూర్తిగా నమ్మట్లేదని లేదా తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం అదే వారు నిటారుగా కూర్చుని చేతులు స్వేచ్ఛగా వదిలేసి మాట్లాడుతున్నారంటే వారు పూర్తి ఆత్మవిశ్వాసంతో మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారని అర్థం.
(16:51) ఈ శరీర భాషను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మీరు ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించడం నేర్చుకోవాలి. [గురకలు] మిమ్మల్ని మీరు ఒక చిత్రకారుడిగా అనుకోండి ఎదుటి వ్యక్తి మీకు ఒక తెల్లని క్యాన్వాస్ లాంటివాడు. వారి శరీరంలోని ప్రతి కదలిక ఆ కాయాన్వాస్ మీద గీసిన ఒక గీత లాంటిది. వారి చేతుల కదలికలు కాళ్ళు పెట్టుకున్న తీరు భుజాలు వాల్చిన విధానం ఇవన్నీ కలిసి వారి మనసులోని అసలు కథను మీకు చెప్తాయి.
(17:15) తర్వాతిసారి మీరు ఏదైనా పెళ్లిళ్లకు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు లేదా నలుగురితో కలిసి కూర్చున్నప్పుడు అక్కడ ఉండే మనుషుల శరీర భాషను గమనించండి. వారు నిలబడే తీరు వారి కదలికలు ఏం చెబుతున్నాయో మనసులోనే ఊహించండి. ఇలా చేస్తూ పోతే రాను రాను మనుషుల శరీర భాషలో ఉండే చిన్న చిన్న రహస్యాలను కూడా మీరు చాలా సులభంగా చదివేయగలరు.
(17:39) ఐదవ సూత్రం ఎదుటి వారిలోని ఎనర్జీని వారి భావోద్వేగాలను అనుభూతి చెందండి. ప్రతి మనిషి తన చుట్టూ ఒక రకమైన వైబ్రేషన్స్ ను ఆలోచనా తరంగాలను కలిగి ఉంటాడు. మన మనసు గనుక ప్రశాంతంగా ఉంటే ఎదుటి వారిలో ఉండే ఆ వైబ్రేషన్స్ ను మనం చాలా సులభంగా పసిగట్టవచ్చు. అవతలి వ్యక్తి సంతోషంగా ఉన్నాడా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడా లేక లోలోపల ఏడుస్తున్నాడా అనేది ఆ వైబ్స్ ద్వారా మనకు తెలిసిపోతుంది.
(18:04) ఈ ఎనర్జీని మనం పట్టుకోవాలంటే మన మనసు చెప్పే మాటను నమ్మడం అలవాటు చేసుకోవాలి. మనకు తెలియకుండానే ఏది సరైనదో ఏది తప్పో మన మనసు ముందుగానే మనకు చెప్తుంటుంది. ఉదాహరణకు మీరు ఎవరినైనా కలిసినప్పుడు వారు పైకి చాలా గట్టిగా నవ్వుతూ మాట్లాడవచ్చు. కానీ మీ మనసులో మాత్రం ఏదో తేడాగా ఉందే ఏదో తప్పు జరిగింది అని అనిపిస్తుంది.
(18:27) అలా అనిపించిందంటే ఎదుటివారి లోపల ఉన్న నిజమైన ఎనర్జీని మీ మనసు పసిగట్టేసిందని అర్థం. దీనికోసం నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి నేను ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి అందరితో చాలా నవ్వుతూ హుషారుగా మాట్లాడుతున్నాడు కానీ నేను అతని పక్కన కూర్చుని మాట్లాడినప్పుడు అతని మాటల్లో ఏదో తెలియని శూన్యత బాధ నా మనసుకు తగిలాయి.
(18:52) నేను అతని భుజం మీద చెయి వేసి లోతుగా మాట్లాడేసరికి అతను తన కెరీర్ లో వచ్చిన వరుస ఓటములతో ఎంతగానో సతమతం అవుతున్నానని చెప్పాడు. తర్వాతిసారి మీరు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు వారి మూడ్ ను జాగ్రత్తగా గమనించండి. వారి ప్రవర్తన పాజిటివ్ గా ఉందా లేక మనసంతా ఏదైనా భారంతో నిండి ఉందా అని అనుభూతి చెందడానికి ప్రయత్నించండి. మీ మనసు చెప్పే మొదటి అభిప్రాయాన్ని నమ్మండి.
(19:16) ఈ చిన్న సాధన మిమ్మల్ని ఎదుటివారి మనసులోని అసలు భావాలను క్షణాల్లో పసిగట్టేలా చేస్తుంది. ఆరవ సూత్రం సరైన ప్రశ్నలు అడుగుతూ వారి మనసు లోతుల్లోకి వెళ్ళండి. ఎదుటి వారి మనసును చదవడానికి అన్నిటికంటే పెద్ద ట్రిక్ ఏంటంటే సరైన ప్రశ్నలు అడగడం. మనం అడిగే ప్రశ్నలే అవతలి వ్యక్తి మనసు విప్పి మాట్లాడేలా చేస్తాయి. వారి మనసు లోతుల్లో దాగున్న విషయాలను బయటకు తీస్తాయి.
(19:42) అయితే ప్రశ్నలు అడిగేటప్పుడు ఎప్పుడూ అవును లేదా కాదు అని తేల్చేసేలా అడగకూడదు. అవతలి వ్యక్తి కాస్త వివరంగా చెప్పేలా ఉండే ప్రశ్నలను అడగాలి. అలాగే వారిని తప్పుపడుతున్నట్లు కాకుండా చాలా క్యాజువల్ గా అడగాలి. ఉదాహరణకు దీని గురించి నీ అభిప్రాయం ఏంటి లేదా ఆ సమయంలో నీకు ఎలా అనిపించింది అని అడగాలి. వారు చెప్పే సమాధానాల్లోని చిన్న చిన్న క్లూస్ ను గమనించాలి.
(20:07) ఎవరైనా మనం అడిగిన ప్రశ్నకు నేరుగా జవాబు చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారంటే లేదా తప్పించుకోవాలని చూస్తున్నారంటే వారు ఖచ్చితంగా ఏదో దాస్తున్నారని అర్థం. దీనికోసం నా జీవితంలో జరిగిన ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒకసారి నేను నా స్నేహితుడిని కలిసి నీ కొత్త ప్రాజెక్ట్ పనులు ఎలా సాగుతున్నాయి అని అడిగాను. అతను చాలా సాదా సీదాగా అతను చాలా సాదా సీదాగా ఏదో సాగుతోందిలే అని ఊరుకున్నాడు కానీ నేను అంతటితో వదలకుండా కొంచెం లోతుగా ఏంటి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నావా అని అడిగాను.
(20:41) అంతే అప్పటివరకు దాచుకున్న వాడల్లా తనకు అసలు సమయమే సరిపోవట్లేదని ఎంత ఒత్తిడి ఫీల్ అవుతున్నాడో అంతా నా దగ్గర బయట పెట్టేసాడు. కాబట్టి తరువాతిసారి మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారు కేవలం ఒక్క మాటతో ముగించేలా కాకుండా కాస్త వివరించి చెప్పేలాంటి ప్రశ్నలు వేయండి. వారు చెప్పే జవాబు వెనుక ఉన్న నిజమైన బాధను లేదా సంతోషాన్ని కనిపెట్టడానికి ప్రయత్నించండి.
(21:04) ఈ చిన్న అలవాటు మిమ్మల్ని ఎదుటివారి మనసులోని అసలు రహస్యాలను చాలా సులభంగా తెలుసుకునేలా చేస్తుంది. ఏడవ సూత్రం నిరంతర సాధన మరియు ఓపిక కలిగి ఉండటం. ఎదుటివారి మనసును చదివే ఈ కల అనేది రాత్రికి రాత్రే వచ్చేసేది కాదు దీనికి ఎంతో సాధన అంతకంటే ఎక్కువ ఓపిక అవసరం. ఈ కలను మీరు పూర్తిగా నేర్చుకోవాలంటే ప్రతిరోజు చిన్న చిన్న అడుగులు వేస్తూ ఓపికగా ముందుకు సాగాలి.
(21:32) ప్రతిరోజు మీరు కలిసే మనుషుల ప్రవర్తనను వారి మాటలను వారి హావభావాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. రోజు రోజుకు మీ పరిశీలనా శక్తి ఎంతవరకు మెరుగవుతుందో గమనించుకోండి. ఒకవేళ ఎప్పుడైనా అవతలి వారి భావాలను మీరు తప్పుగా అర్థం చేసుకుంటే అస్సలు నిరాశ పడకండి అసలు ఎక్కడ పొరపాటు జరిగిందో ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించి చూసుకోండి. నిజం చెప్పాలంటే నేను కూడా మొదట్లో చాలాసార్లు ఎదుటివారిని తప్పుగా అంచనా వేశను. ఎన్నో పొరపాట్లు చేశాను.
(22:03) కానీ ఆ చేసిన ప్రతి తప్పు నుండి ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు నేను చిన్న చిన్న విషయాలను సులభంగా పట్టుకోగలుగుతున్నాను. చూసావా చంద్రగుప్తా ఈ ఏడు సూత్రాలను గనుక నువ్వు నీ జీవితంలో సరిగ్గా పాటించి సాధన చేస్తే ఎదుటివారి మనసు నీకు తెరిచిన పుస్తకంలా మారిపోతుంది. ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో లోని టిప్స్ నచ్చినట్లయితే మాకు సపోర్ట్ గా ఈ వీడియోను లైక్ చేయండి.
(22:28) అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ లో మీరు మిస్ అయిన పాత వీడియోలను ఒకసారి చూసేయండి. జై హింద్.
No comments:
Post a Comment