కుండలిని అసలు కథ! For yoga meditation practioners, spiritual seekers, devotees.
Author Name:Swami Dhyanananda
Youtube Channel Url:https://www.youtube.com/@dhyana-pathasala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=XhEhe-Hivso
Transcript:
(00:07) ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతిహి కుండలిని శక్తి షట్ చక్రాలు అంటే ఆరు చక్రాలు ధ్యాన సాధకులకి వాళ్ళు ఆరంభంలో ఉన్నవాళ్ళైనా లేక కొంత పురోగమ ించిన వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళకి అత్యంత ఆసక్తిని కలిగించే అంశం ఏదైనా ఉంది అంటే అది కుండలిని మరియు షట్ చక్రాలే ఇంతకన్నా గొప్పది ఏదైనా ఆసక్తిని కలిగించేది ఉంది అంటే ఆ అది నమ్మడానికి లేదు.
(00:45) ఏమిటిది కుండల్ని షట్చక్రాలు అంటే ఒక శక్తి సర్పం ఒక పాము రూపంలో మన వెన్నెముకకి కింది భాగంలో చుట్టలు చుట్టుకొని నిద్రాణ స్థితిలో ఉంటుందని అది గనుక మేలుకుంటే నిద్ర లేస్తే అద్భుతాలు జరుగుతాయని తర్వాత అది నెమ్మదిగా పైకి వెళుతూ ఈ పైనున్న ఐదు చక్రాలను కూడా ఉద్దీపనం చేస్తుంది యక్టివేట్ చేస్తుందని తర్వాత ఈ శరస్సు పైన ఉన్నటువంటి సహస్రారానికి చేరుకుం ఉంటే అక్కడ ఆత్మ సాక్షాత్కారం లేకపోతే దైవ సాక్షాత్కారం కలిగి ముక్తి లభిస్తుంది అనేది సుప్రసిద్ధమైనటువంటి భావన మరి ఈ కుండల శక్తి వేలుకుంటే అద్భుతాలు జరుగుతాయి దివ్య దర్శనాలు లభిస్తాయి
(01:28) లేకపోతే సిద్ధులు లభిస్తాయి ధ్యానం గొప్ప ప్రశాంతంగా గొప్ప ఏకాగ్రతలత లభిస్తుంది. తర్వాత అది ఒక్కొక్క చక్రానికి చేరుకుంటే ఒక చక్రానికి చేరుకుంటే ఆరోగ్యం ఒక చక్రానికి చేరుకుంటే సృజనాత్మక శక్తి ఇంకో చక్రానికి చేరుకుంటే ధనము సంపద ఇలా ఒక్కొక చక్రానికి ఏరుకుంటే ఏమేమో లభిస్తాయి అనేటువంటి భావనలు కూడా ఎంతో ప్రచారంలో ఉన్నాయి.
(01:53) మరి ఇంత గొప్ప కుండల శక్తిని మనం మేలుకొలపాలిగలా ఏంటి దానికి మార్గం అంటే ఒక గురువుగారు చెప్తారు దృష్టిని భూమధ్యంలో ఈ రెండు కనుభూముల మధ్యలో ఉంచాలి అదే కుండలిని సాధనకి ఉన్న ఒకే ఒక మార్గం అంటారు. లేదు మనం ఇంకా వేరే మార్గాలు ఏమైనా చూస్తే చెప్తారు కుండల్ని శక్తిని మేలుకొలపాలంటే కొన్ని ఆసనాలు ప్రాణాయామాలు బంధాస్ బంధాలు వీటన్నిటి కలయకతో కుండలన శక్తిని మేలుకొలపొచ్చు అనేది ఇంకొక భావన మరి ఏం చేయాలి ఈ కుండల్ని శక్తిని ఎలా మనం సులభంగా మేలుకొలపాలి అది మనం ఈరోజు తెలుసుకుందాం.
(02:34) అంతకుముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాలి ఏంటంటే ధ్యానము యోగము అనే విషయాలు మనకి ఎక్కడినుంచి తెలుస్తున్నాయి అంటే పతంజలి మహర్షి రాసినటువంటి యోగ సూత్రాల ద్వారా పతంజలి యోగ సూత్రాలే మన మన ధ్యానానికి మన యోగ సాధనకు ఆధారభూతమైనటువంటి ప్రామాణికమైనటువంటి విషయం అన్నమాట అందులో ఈ మానసిక ఏకాగ్రత గురించి మనసు గురించి విపులమైన చర్చ మనస్సు సో ఎలా ఏకాగ్రం చేయాలి యోగ సాధన ఎలా చేయాలి ఇలాంటి విషయాలన్నిటిని ఆయన నాలుగు అధ్యాయాల్లో దాదాపు 200 సూత్రాల్లో ఆయన చర్చించారు.
(03:13) కానీ ఒక అత్యంత వింత అయినటువంటి విషయం ఏమిటి అంటే ఆ యోగ సూత్రాల గ్రంథంలో ఈ కుండల్ని శక్తి షట్ చక్రాల గురించిన ప్రస్తావన ఉండనే ఉండదు. కనీసం మాట వరసకు కూడా ఆయన ప్రస్తావన చేయడు అన్నమాట. మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి ఈ భావన ఇది అంటే పతంజలి మహర్షి తర్వాత రెండుమూడు ఏళ్లకి వచ్చినటువంటి తాంత్రిక విధానం ద్వారా వచ్చిందన్నమాట ఇదిఒక తాంత్రికమైనటువంటి భావన తంత్ర సాధనలో ఉండే భావన కుండల్ని శక్తి మరియు షట్ చక్రాలు అనేది తర్వాత ఇంకా కొన్ని వందల ఏళ్లకి ఒక ఐదారులంద ఏళ్లకి వచ్చినటువంటి హటయోగ ప్రదీపిక అనే గ్రంథంలో మళ్ళీ హటయోగము అంటే
(03:59) హటయోగం అంటే ఆసన ద్వారా ముక్తిని ఎలా పొందాలి యోగాన్ని ఎలా సాధన చేయాలి ఆసనాలు ముఖ్యం ప్రాణాయామం ముఖ్యం అన్నమాట అది హటయోగ ప్రదీపిక ఆ హటయోగ ప్రదీపిక అనే గ్రంథంలో మళ్ళీ ఈ కుండల్ని శక్తి షట్చక్రాల ప్రస్తావన ఉన్నది. అంతేగాన ఇది పతంజలి యోగ సూత్రాల్లో ఉన్నటువంటి యోగ యోగ పద్ధతిలో ఉన్నటువంటి విషయం కానే కాదు అది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం.
(04:30) ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఏంటంటే మనకి నాలుగు యోగాలు ఉన్నాయి అది మొట్టమొదటిది జ్ఞాన యోగము భక్తి యోగము రాజయోగము కర్మ యోగము జ్ఞాన యోగంలో ఏముంటాయఅంటే బ్రహ్మము మాయ మనం గనుక సాధన ద్వారా మన ఆత్మ విచారణ ద్వారా మాయను తిరస్కరిస్తే బ్రహ్మమే మిగులుతుంది. దాన్ని బ్రహ్మ సాక్షాత్కారం అంటారు. భక్తి యోగము భక్తి యోగంలో భగవంతుడు ఉంటాడు లేకపోతే పరమాత్ముడు ఉంటాడు ఒక జీవాత్మ ఉంటుంది ఆ జీవుడు సాధనల ద్వారా భక్తి సాధన ద్వారా ఆ దేవుణని చేరుకున్నాడు అనుకోండి జీవాత్మ పరమాత్మను చేరుకుంది అనుకోండి దాన్ని ముక్తి అంటారు బాగా భక్తి యోగంలో
(05:16) రాజయోగంలో మనస్సు ఉంటుంది ఆ మనసుని ఏకాగ్రం చేయాలి ఆ ఏకాగ్రం చేయడానికి మీరు దేవుని ఎంచుకోవచ్చు ఆత్మని ఎంచుకోవచ్చు ఏకాగ్రత అనేది ముఖ్యం మనసుని ఏకాగ్రం చేయగా చేయగా ఆ మనస్సు అనేది సమాధి స్థితిని పొందుతుంది. ఆ సమాధి స్థితిని పొందడమే ముక్తి కర్మయోగంలో ఏంటి కర్మయోగంలో ఒక అహంకారం ఉంటుంది నానా పనులు చేస్తున్నది అహంకారమే నేను చేస్తున్నాను అనే ఒక అహంకారంతో ఆ కర్తృత్వ భావన అనేది మనకు వస్తున్నది.
(05:44) కాబట్టి మనం ఆ నిస్వార్థంగా కర్మలను ఆచరించడం ద్వారా ఆ కర్మయోగ సాధన ద్వారా ఆ అహంకారాన్ని పోగొట్టుకుంటే నేను చేస్తున్నాను అనే భావన పోతుంది తర్వాత నేను భగవంతుని చేతిలో పనిముట్టునిగా మాత్రమే ఈ కర్మలు చేస్తున్నాను లేకపోతే ఆత్మను గనుక మనం నిరాకార మార్గంలో ఉంటే అసలు కర్మే లేదు అహంకారం లేదు కర్మ లేదు అనేటువంటి ఆ నైష్కర్మ సిద్ధి కలుగుతుంది కర్మయోగంలో అలాగే ఈ తాంత్రిక మార్గంలో కూడా ఏముంటుంది ఇక్కడ కుండల్ని శక్తి అది వెళ్లి పైనున్న శివుడు సహస్రారంలో శివుడు ఉంటాడు ఈ శివశక్తుల సంగమమే ముక్తి అని తాంత్రిక మార్గంలో వాళ్ళ సిద్ధాంతం
(06:22) అన్నమాట మనం గనుక ఏమాత్రం ఆలోచించినా కూడా అర్థం అవుతుంది ఏంటి ఈ బ్రహ్మము పరమాత్మ లేక ఈశ్వరుడు ఆత్మ ఈ శివుడు ఈ సహస్రాలలో ఉండే శివుడు వీళ్ళంతా వేరు కాదు కదా అలాగే ఈ నిమ్న స్థాయిలో ఉన్నటువంటి అహంకారము జీవాత్మ మాయ య మనస్సు కుండల్ని శక్తి ఇవన్నీ ఒక్కటే కాబట్టి చివరికి తేలేది ఏమిటి ఈ కుండల్ని శక్తి అని మనం చెబుతున్నది ఏమిటయ్యా అంటే మనస్సునే రాజయోగంలో ఈ యోగ సాధనలో మనం మనస్సు అని దేన్నైతే పేర్కొంటున్నామో తాంత్రికులు దాన్నే కుండల్ని శక్తి అంటున్నారు అంతేగాన అదిఒక ప్రత్యేకంగా అదిఒకటి ఉన్నది అని మనం భ్రమలో పడకూడదు
(07:08) భావన అదే అదఒక భావన మాత్రమే ఎలా అది భావన అంటే మనం దాన్ని బాగా కాస్త పరిశీలిస్తే అర్థమైపోతుంది. ఎలాగ అది భావన అంటే మనసుకి ఈ కుండల శక్తికి మంచి సమన్వయం కుదురుతుంది. ఎన్ని యోగాలు తెలుసుకున్నా ఏ విషయాలు విన్నా ఏం చదివినా కూడా మనం దాన్ని బాగా సమన్వయం చేసుకొని అర్థం చేసుకోగలగాలి లేకపోతే అది అజీర్ణం అయిపోయి సంశయాత్మక బుద్ధిని పెంచుతుంది తప్ప అదే మనకి ధ్యానంలో ఆటంకంగా సాధనలో ఆటంకంగా మారుతుంది.
(07:45) అదే మనం బాగా అర్థం చేసుకున్నాం అనుకోండి సమన్వయం చేసుకున్నాం అనుకోండి మన సంశయాలు తీరి మనక ఒక అవగాహన ఏర్పడి దానికి క్లారిటీ సందేహ నివృత్తి స్థితికి జమనం చేరతాం అది మన పురోగమనానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ కుండల్ని శక్తికి మనసుకి ఏంటి సమన్వయము అంటే కుండల్ని శక్తి మూలాధారంలో ఉన్నప్పుడు మూలాధార చక్రంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఆ అతని ప్రవర్తన ఎలా ఉంటుందంటే కేవలం మా మానవుడు తినటం తాగటం ఆహార నిద్ర భయమైధునాని అని ఆహారం నిద్ర మైధునము అంటే స్త్రీ సమాగమము కామాన్ని తీర్చుకోవడం నిద్రపోవడం అంటే బేసిక్ ఒక మామూలు ఒక జీవితాన్ని గడపడానికి ఈ జీవితాన్ని
(08:32) నిలబెట్టుకోవడానికి ఆధారభూతమైన పనులు అదే మూలాధార చక్రం ఆధారభూతమైన పనులు మాత్రం చేస్తుంటాడు. దానికి తోడు ఇంకా అది అధమస్థాయి కాబట్టి అతడు ఎలా ఉంటాడుఅంటే అవి ఎక్కువగా ఉంటాయి తాగుబోతుతనం తాగుబోతుగా తిరుగుబోతుగా దురలవాట్లు అడిక్షన్స్ తీవ్రమైన అడిక్షన్స్ అంటే అసలు మనసు అనేది అతని నిగ్రహంలో ఉండనే ఉండదు దాన్నే మనసు అధమ స్థాయిలో ఉండడం అంటాం మనం అదే మూలాధార చక్రము ఆ చక్రంలో కుండలు ఉన్నప్పుడు అతని జీవితం అంత దారుణంగా ఉంటుంది అన్నమాట తర్వాత ఉన్నది స్వాధిష్టానము స్వాధిష్టానము అంటే స్వ అధిష్టానము అంటే ఆత్మ ఉండేటువంటి ప్రదేశం ఆత్మ అంటే మామూలు మనిషికి ఆత్మ
(09:16) ఉండదు అది అహంకారం రూపంలో ఉంటుంది కాబట్టి అది అహంకారం ఉండే ప్రదేశం స్వాధిష్టానము ఎప్పుడైతే కుండలని స్వాధిష్టానానికి చేరుకోవాలన్నా చేరుకున్న మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు అంటే అతని ప్రవర్తనలో ఎలా ఉంటుందంటే కాస్త పౌరుషంతో ఆత్మవిశ్వాసం అహంకార భూయిష్టమైనటువంటి అహంకారంతో ఉన్న మనిషికి ఆత్మవిశ్వాసం కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఆ ఆత్మవిశ్వాసంతో మనసుని కొద్దిగా అదుపు చేయడం మొదలు పెడతాడు సంకల్పాన్ని ప్రదర్శిస్తాడు.
(09:41) ఎప్పుడైతే సంకల్పన ప్రదర్శిస్తాడు మరీ అధమ స్థాయిలో ఉన్నటువంటి దురలవాట్లు బానిసత్వము అడిక్షన్స్ అతి దారుణమైన జీవితంలోనుంచి కొద్దిగా ఎదుగుతాడు. కొంతగా పని చేయడం ఏదైనా సాధించడము కొంత ఉన్నతి కోసం ప్రయత్నం చేస్తుంటాడు దాన్ని మనం స్వాధిష్టాన చక్రానికి చేరుకోవడం అంటాం మనసు అదే కుండల్ని ఈ మనసు కుండల్ని కుండలిని అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన మానసిక ఏకాగ్రత ఆ మానసిక ఏకాగ్రతకు వాళ్ళు కుండల్ని అనే ఒక పేరు పెట్టారు తప్ప ఇంకా ప్రత్యేకంగా ఏమి లేదు దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో స్టేట్ ఆఫ్ కాన్షస్నెస్ అంటే మన దృష్టి ఎక్కడ ఉంది కొంతమంది దృష్టి
(10:26) నిరంతరం తిండి మీదే ఉంటుంది ఒక తాగుబోత దృష్టి నిరంతరం తాగటం మీదే ఉంటుంది తెల్లవారితే వాడికి గుర్తొచ్చేది ఏంటంటే తాగటమే ఇప్పుడు మనందరం చూస్తున్నాం ఎక్కడఉంది చాలా మంది దృష్టి సెల్ ఫోన్ మీద అంటే ఒక దురలవాటు ఒక అడిక్షన్ మీద ఉంది వాళ్ళ దృష్టి అంతా అక్కడే ఉంటుంది. కొంత ఖాళీ సమయం దొరికింది అనుకోండి వెంటనే దృష్టి అక్కడికి వెళ్ళిపోతుంది దాన్నే మనం కుండల్ని శక్తి అని పిలవచ్చు తప్పులేదు ఎందుకంటే మన దృష్టి అది ఏకాగ్రత మన ఏకాగ్రత మన దృష్టి మన జీవన మన స్థాయి ఎక్కడఉంది దాన్నే మనం కుండలిన శక్తి అని పిలిచారు వాళ్ళు తాంత్రికులకి కొద్దిగా
(11:01) కల్పనా శక్తి ఎక్కువ ఉన్న విషయాన్ని నేరుగా చెప్పకుండా వాళ్ళు కొంత అద్భుతమైన కల్పనలతో చెబుతారు దానివల్ల కొంత మానసిక ఏకాగ్రత కలగడానికి అవకాశం ఉంది అదే కల్పన ఇప్పుడు కుండల శక్తి తీశ చక్రాలు అన్నామ అనుకోండి మామూలు మానవులు మనసులన్నీ ఆకట్టుకుంటుంది కదా అది మనసులన్నీ ఏకాగ్రం అయిపోతాయి కదా అబ్బో కుండలి శక్తి అబో చక్రాలు అలా ఒక కల్పన అద్భుతమైన కల్పన అన్నమాట ఉన్న విషయాన్ని తత్వాన్ని అద్భుతమైన కల్పనతంలో చెప్పడమే ఆ తాంత్రికుల రహస్యం సో ఇప్పుడు మన స్వాధిష్టానం దగ్గర ఉంది కుండల శక్తి అంటే మన ఏకాగ్రత మన దృష్టి అక్కడ ఉన్నది కుండలన శక్తి తర్వాత ఉండేది
(11:38) మణిపూరకము మణిపూరకము అంటే మణులతో నింపడము అని దాని అని అర్థం మణులు అంటే విలువైన వస్తువులు అంటే కోరికలని తీర్చుకోవడం ఏదైనా సాధించడం జీవితంలో ఏనా సాధించాలంటే మనసుని ఏకాగ్రం చేయాలి సంకల్ప శక్తిని ఇంకా ప్రదర్శించాలి మనిషి సో ఎవరైతే మనసుని ఇంకా ఏకాగ్రం చేయడం బాగా నేర్చుకుంటాడో మనసు సంకల్ప శక్తిని ప్రదర్శిస్తాడో అతడు తన కోరికలను తీర్చుకుంటాడు జీవితంలో కొన్ని విజయాలను సాధిస్తాడు కొంత ఎత్తుకు ఎదుగుతాడు.
(12:07) అప్పుడు అతని కుండల శక్తి మణిపూరకానికి చేరింది అని అర్థం కుండల శక్తి అంటే మానసిక ఏకాగ్రత మనసు చేరింది అక్కడికి అని అర్థం ఈ ఏకాగ్రత కలగాలి మణిపూరకానికి చేరాలంటే మనం కూర్చొని అందరూ ధ్యానం చేయక్కర్లేదు ధ్యానం చేస్తేనే ఏకాగ్రత కలుగుతుంది అనుకోవద్దు పిల్లవాడు పాఠశాలక వెళ్తాడు వెళ్లి నేర్చుకుంటాడు 10 15 ఏళ్ళు చదువుకోవాలి మనసు నిరోధించాలి అభ్యాసం చేయాలి డిసిప్లిన్ క్రమ శిక్షణ అభ్యాసం చేస్తాడు ఆ రకంగా కూడా ఏకాగ్రతను సాధిస్తాడు లేదనుకోండి మనం ఏదైనా శిక్షణం తీసుకుంటాం ఏదైనా సాధించడానికి ఒక పని కోసం ఒక నైపుణ్యం కోసం ఒక స్కిల్ ని
(12:41) పెంచుకోవడానికి శిక్షణ దాంట్లో కూడా ఏకాగ్రత సాధ్యం అవుతుంది. ఆ ఏకాగ్రతను పెంచుకున్నప్పుడు ఈ మణిపూరక చక్రానికి కుండల్ని చేరుకున్నది అని అర్థం. ఈ రకంగా చూసుకుంటే ఈ మూడు చక్రాలు కూడా లౌకిక విషయాలకు సంబంధించినవి ఈ మూడు చక్రాల్లో అదే శ్రీరామకృష్ణులు చెబుతాడు మామూలు అజ్ఞాని అయినటువంటి లౌకికుడైనటువంటి మానవుడి మనసు మొదటి మూడు చక్రాల్లో పరిభ్రమిస్తూ ఉంటుంది.
(13:07) లింగము నాభి మరియు గుదమార్గం అంటే తినడము విసర్జించడము మరియు కామాన్ని తీర్చుకోవడము అది దైహికమైనటువంటి కామమైనా కావచ్చు ఇతర కోరికలు కూడా కావచ్చు ఏదైనా సాధించాలనే కోరికలు కూడా కావచ్చు. వీటిలోనే మూడు చక్రాల్లోనే పరిభ్రమిస్తూఉంటుంది మనస్సు మనసే కుండల శక్తి తర్వాత చెబుతాడు తర్వాత ఈ మూడు కాదు ఈ లౌకికత్వం కాదు కేవలం త్రడం తాగడం ఈ దరిద్రాలు వద్దు ఇందులో దుఃఖం ఉన్నది అని కొంత విచారణ చేసి ఆ మనిషి ఊర్ధ్వముఖంగా ఉన్నతి కోసం ఆశించి కొంత తత్వాభ్యాసం చేసి అప్పుడు ఆధ్యాత్మిక సాధన మొదలవుతుంది కొంత తాత్వికతను అభ్యాసం చేసి ధ్యానము జపము సాధనలు ఇలాంటివి చేసి కొంత అంతా ఎదిగాడు
(13:49) అనుకోండి అప్పుడు కుండలిని శక్తి మనస్సు అనేది అనాహతము ఈ హృదయ స్థానానికి చేరుతుంది అన్నమాట హృదయ స్థానంలో అతడికి ఇతర జీవుల పట్ల ప్రేమ దయ భగవంతుడి పట్ల ప్రేమ ప్రేమక స్థానం అది భూతదయ కావచ్చు భగవంతుడు పట్ల ప్రేమ కావచ్చు ఆత్మ పట్ల ప్రేమ ఒక నిష్ట అనేది అక్కడ కలుగుతుంది అన్నమాట ఇంకా నిజంగా గనుక అక్కడికి చేరితే శ్రీరామకృష్ణుడు చెబుతాడు అక్కడ అతనికి జ్యోతి దర్శనాలు అవుతాయి కొన్ని నాదాలు కూడా వినిపిస్తాయి ఎందుకంటే అనాహతము అంటే అర్థం ఏంటంటే ఆహతము లేనిది ఆహతం అంటే ఆఘాతం ఆఘాతం అంటే ఏదైనా శబ్దం పుట్టాలి అంటే రెండు వస్తువులు
(14:30) గుద్దుకోవాలి అంటే వాటి మధ్య ఒక ఆఘాతం ఉండాలి ఇలా గుద్దుకున్నప్పుడు గంట కొట్టామ అనుకోండి రెండు వస్తువులు అక్కడ ఆఘాతం అయితేనే గంట శబ్దం వస్తుంది. అలా ఏదైనా శబ్దం పుట్టాలంటే ఆఘాతం ఉండాలి ఆహతం ఉండాలి కానీ ఇక్కడ అనాహతము ఇక్కడ ఏ ఆఘాతము ఆహతం లేకుండా అని ఒక శబ్దం జనిస్తుంటే ఆది లేని శబ్దం అన్నమాట అది ఏమిటంటే ఓంకారము ఓంకారానికి ఆది లేదు అదే భగవంతుడి యొక్క నామం ఆ ఓంకారము అక్కడ పుట్టే శబ్దం పుట్టే చోటు కాబట్టి దాన్ని అనాహతము అన్నారు.
(15:02) ఆది లేదు కాబట్టి దానికి అంతం కూడా లేదు ఓంకారము అనేదానికి ఆద్యంతాలు లేనటువంటి శబ్దం అన్నమాట అది ఓంకారము ఎవరైనా కుండల శక్తి అక్కడికి చేరితే అంటే మానసిక ఏకాగ్రత అంత తీవ్రమైతే అనాహత చక్రానికి చేరుకుంటారు అన్నమాట వాళ్ళ మనసు చేరుతుంది లేకపోతే కుండల శక్తి చేరుతుంది. హోలీ మదర్ అంటే శారదాదేవి శ్రీరామకృష్ణులటువంటి ధర్మపత్ని ఉన్నారు కదా శారదాదేవి ఆయనక ఒక శిష్యుడు ఉండేవాడు స్వామి శాంతానంద ఆయనకి అనాహత ధ్వని వినిపించేది అన్నమాట ఆయన బేలూరు మఠంలో ఉండేవాళ్ళు కలకత్తాలో ఉంది కదా రామకృష్ణ మఠం ఒక హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉండేవాళ్ళు ఆయన ఆయనకు
(15:41) అనాహత ధ్వని వినిపించిందని ఆయన శారదామాతే చెప్పారన్నమాట ఆయన కూడా అందరికీ చెబుతుండేవాళ్ళు చాలా అమాయకులు సరళమైన ఒక సాధువు నిజంగా సాధువు ఎలా ఉంటాడో సాధు కూడా అలా అత్యంత పసిబాలుడు స్వభావంతో ఉండేవాడు అన్నమాట ఎవరైనా సాధువులు వెళ్లి మహారాజ్ స్వామీజీ అనాహత ధ్వని ఓంకారం వినిపిస్తుంది అంటే ఆ వినిపిస్తుంది మీకు కూడా వినిపించాలంటే ఓ పని చేయండి ఏంటి ఏం చేయాలి మహారాజ్ ఏం చేయాలి స్వామీజీ ఈ జగత్తు ఉంది పక్కన పాడేయండి అనేవాడుఅన్నమాట జగత్ జగత్కలేనా అంటే ఈ జగత్తు ఉంది పక్కన పడేయండి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మూడు చక్రాలు లౌకికత్వానికి సంబంధించిన
(16:19) లౌకికత్వాన్ని మనం గనక చజించి పైకి వచ్చామ అనుకోండి అక్కడ అనాహత ధ్వని వినిపిస్తుంది. అంటే ఆయన అనేవాడు ఆ లౌకికత్వాన్ని జగత్తుని తీసి పక్కన పాడేయడం ఎంతో సులభం అన్నట్టుగా చెప్పేవాడు అన్నమాట సో అది అనాహత చక్రానికి చేరితే అలాంటి ధ్వనులు నాదాలు వినిపిస్తాయి. ఈ తర్వాత మనసు ఇంకా శుద్ధం చేస్తే మనసుని ఇంకా ఏకాగ్రం చేసి ఇంకా రాగ ద్వేషాల నుంచి దాన్ని విముక్తం చేసి శుద్ధం చేస్తే విశుద్ధ చక్రము అది గొంతు దగ్గర ఉంటుందన్నమాట.
(16:49) ఆ విశుద్ధి చక్రానికి మనసు చేరుతుంది లేక కుండల్ శక్తి చేరుతుంది. అంటే మానసిక ఏకాగ్రత ఇంకా తీవ్రమైంది అన్నమాట అత్యంత తీవ్రమైన విశుద్ధి చక్రానికి చేరడం అన్నమాట శ్రీరామకృష్ణులు చెబుతారు ఎవరైనా విశుద్ధి చక్రానికి మనసు చేరుకుంటే అతడు భగవదన్య విషయాల గురించి అంటే భగవంతుడు గురించి తప్ప ఆత్మ గురించి తప్ప తత్వజ్ఞానాన్ని గురించి తప్ప ఇంకా ఇతర విషయాలను గురించి అసలు మాట్లాడడు వినడానికి కూడా ఇష్టపడ్డడు అన్నమాట రామకృష్ణు చెప్పారు ఆ స్థితిలో ఎవరైనా లౌకిక విషయాలు ప్రస్తావన తెస్తే [సంగీతం] ఒక దుడ్డు కర్ర తీసుకొని తల మీద బాదినట్టు ఉండేది అని చెప్తారు విశుద్ధి చక్రము అది
(17:28) శుద్ధి అంటే శుద్ధమైనటువంటి మనసు చేరి ఉండే స్థానము విశుద్ధి చక్రం అంతటి ఏకాగ్రత సంభవించింది కుండలిన శక్తి అంటే మానసిక ఏకాగ్రత అంతటి ఏకాగ్రమైన మనసు అక్కడికి చేరుతుందిన్నమాట ఇక్కడ ఒక వింత విషయం ఉంది అదే శ్రామ కృషి అవుతారు మనసు విశుద్ధ చక్రానికి చేరిన నా హతానికి చేరిన ఒక ప్రమాదం ఉన్నది ఏమిట ఆ ప్రమాదము అక్కడి నుంచి మళ్ళీ జారి కింద ఉన్నటువంటి మూడు చక్రాల వ్యవహారంలో పడే ప్రమాదం ఎంతైనా ఉంది ఎందుకంటే మలినాలను శుద్ధి చేశాడు కానీ పూర్తిగా నిర్మూలించలేదు కదా ఇంకా శుద్ధి చేయబడినటువంటి మలినాలకు ఇంకా శక్తి ఉంటుంది అవి మనల్ని కిందికి లాగడానికి
(18:10) ప్రయత్నం చేస్తుంటాయి ఆ ఈ రెండు చక్రాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఒక్కోసారి వచ్చి పడిపోతుంటారు మనం చూస్తుంటాం కదా మహర్షులు ఎంతో తపస్సు చేసి ఉంటారు ఎన్నో దివ్య శక్తులు ఉంటాయి భగవంతుడు దర్శనం కూడా అయి ఉంటుంది కానీ తీరా వచ్చి వాళ్ళు సంసారంలో పడిపోతుంటారు విశ్వామిత్ర మహర్షి మేనకను మోహించి సంసారంలో పడి ఎప్పటికో గుర్తుకవచ్చింది అయ్యో నేనుఏంది ఇందులో పడ్డానుని మళ్ళీ అప్పుడు లేచి మళ్ళీ అప్పుడు తపస్సుకు బయలుదేరాడు అలా ఎంత చక్రాల దగ్గరికి వెళ్ళినా కూడా ఇంకా పతనం అయ్యే అవకాశం ఉంది అందుకే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు శ్రీరామకృష్ణులు
(18:44) తర్వాత మనసుని ఇంకా ఏకాగ్రం చేస్తే ఇంకా శుద్ధి చేస్తే ఇంకా విశుద్ధం అయపోతాయి ఆజ్ఞ ఆజ్ఞ చక్రం ఇక్కడ ఉంటుంది భ్రూవ మధ్యంలో రెండు కనుమొమ్మల మధ్యలో ఉంటుంది ఆజ్ఞ చక్రం అక్కడికి చేరుతుంది మనసు అదే కుండల శక్తి అక్కడికి చేరటం ఆజ్ఞా చక్రానికి మనసు చేరితే అతనికి భగవంతుడు సాక్షాత్కారం అయిపోతుంది సాకార రూప సాక్షాత్కారం అవుతుంది భగవంతుడు రూప దర్శనం అవుతుంది అన్నమాట అతడికి గనక రూప దర్శన రూప ప్రేమ మార్గంలో ఉంటే భక్తి మార్గంలో ఉంటే అతడికి రూప దర్శనం అవుతుంది.
(19:16) ఇంకా శ్రీరామకృష్ణుడు చెబుతారు ఒక్కసారి ఆజ్ఞా చక్రానికి చేరుకుంది అనుకోండి మన ఏకాగ్రత ఇంకా అక్కడికన్నా కిందికి పతనం అయితే గనుక అత్యంత అధమ స్థాయిలో అతడు హృదయ స్థానానికి మాత్రం వస్తాడట అంతకన్నా కిందికి మాత్రం రాడు వ్యవహారంలో పడ్డడు కామ క్రోధాలకు బలికాడు అతడు హృదయస్థానం వరకు వస్తాడు హృదయం అంటే అనాహత ధ్వని అంటే భగవంతుడు గురించి మాట్లాడుతుంటాడు విశుద్ధానంగానే ఉంటాడు అది ఆజ్ఞా చక్రం యొక్క గొప్పతనం అక్కడికి చేరామంటే ఇంకా పతనం ఉండదుఅన్నమాట అక్కడినుంచి మహా అయితే అనాహత హృదయ స్థానం వరకు వస్తాడు.
(19:49) ఇంకా ఆ తర్వాత ఉండేది సహస్రారమ శామకృష్ణులు చెప్తారు ఈ ఆజ్ఞా చక్రానికి సహస్రారానికి ఒక పలుసరి పలుచని పొర మాత్రం అడ్డంగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి అతడు చేరడానికి ఎంతో కష్టము సమయము పట్టదు ఇంకా ఇది మనసుకి కుండల్ని శక్తికి ఉన్నటువంటి సమయం ఇదే కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కుండల్ని శక్తి అంటే మానసిక ఏకాగ్రత కాబట్టి కుండల్ని శక్తిని మేలుకొలపాలంటే చేయాలి సింది ఒకే ఒక పని మనసుని ఏకాగ్రం చేయండి.
(20:23) ఆ కుండల్ని శక్తిని ఇంకా ఉన్నత మార్గంలో తీసుకెళ్ళాలంటే ఒకే పని చేయాలి ఏంటంటే మనసుని శుద్ధి చేయాలి. అప్పుడు అది ఊర్ధ్వగమనం చెందటము అంటారు చక్రాలు అంటే ఏమిటంటే శుద్ధి అయినటువంటి ఉన్నత స్థాయికి చేరినటువంటి మానసిక స్థితులు వాటికే చక్రాలు అని పేరు పెట్టారు తప్ప ప్రత్యేకంగా చక్రాలు అనేవి శరీరంలోనూ లేవు మనసులోనూ లేవు మనసు పొందే స్థితులే ఆ చక్రాలు మనసు సో మనం ఆ చక్రానికి చేరాలంటే మనసును శుద్ధం చేయాలి ఏకాగ్రం చేయాలి ఏకాగ్రం చేస్తూ శుద్ధం చేస్తూ ఉండే కొద్ది ఇంకో చక్రాన్ని ఇంకో చక్రాన్ని ఇంకో చక్రానికి చేరుతూ ఉంటాము.
(20:59) ఇది కుండల్ని యొక్క రహస్యము ఇది తెలియక చాలామంది చక్రాలను శుద్ధి చేయటము చక్రాలను భావన చేయడము అనేటువంటి విషయాలు చేస్తుంటారు. ఇప్పుడు కుండలిని భావన చేయాలన్నా కూడా కుండలిని మీద ఏకాగ్రం చేయడమే కదా కాబట్టి మన సూత్రం అనేది ఎక్కడైనా వర్తిస్తుంది మీరు చూసుకోండి కుండలిని మీద ఏకాగ్రం చేస్తేనే కుండలిని శక్తి మేలుకుంటుంది.
(21:24) చక్రాల మీద ఏకాగ్రం చేస్తేనే ఆ కుండలిన శక్తి ఆ చక్రానికి చేరుతుంది. అలాగన్నమాట ఏకాగ్రత మాత్రమే కుండల్ని మేలుకొలపడానికి మార్గము ఉద్ధగమనానికి శుద్ధం చేయడం మార్గము కాబట్టి మనం ధ్యానం ఎలా చేయాలి లేక ధ్యానాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి తద్వారా మనం ధ్యానాన్ని సరిగ్గా అభ్యాసం చేస్తున్నాం అనుకోండి నెమ్మదిగా అది మేలుకుంటుంది.
(21:47) తర్వాత ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉన్నది ఏంటంటే కుండలిని శక్తి ఒక భావన దానికి ఇంకా రెండు మూడు ఉదాహరణలు ఉన్నాయి ఏంటంటే కుండలిని శక్తి పాము అనేది మూడున్నర చుట్టలకు చుట్టుకోని ఉంటుందట మూడున్నర చుట్టల రహస్యం ఏంటా అని నేను తెలుసుకోవడానికి పోతే అక్కడ రాశరు ఏంటంటే మూడు చుట్టలు ఏంటంటే తమస్సు రజస్సు మరియు సత్వం అంట అర్ధ చుట్ట ఏంట్రా అంటే అతీతస్థితి అంటే ఏంటి తమ సత్వము రజస్సు మరియు తమస్సు ఈ మూడింటిని దాటి ఉన్నతిని చెందాలి అని చెప్పడానికే కదా చెబుతున్నారు అదే చెప్పాను కదా ఏ భావనైనా వాళ్ళు అద్భుతమైన కల్పనల రూపంలో మార్చగలరు అతీత స్థితికి
(22:28) చేరాలి అదే కుండల్ శక్తి తర్వాత కుండల శక్తికి ఇంకో భావన ఉన్నది ఏంటంటే కుండల్ని శక్తి అంటే మన ప్రత్యుత్పత్తి ద్రవాలు ఆ ప్రత్యుత్పత్తి ద్రవాలను గనుక మనం 12 ఏళ్ళ అఖండ అస్కలిత బ్రహ్మచర్యంతో గనుక ఆ ప్రత్యుత్పత్తి ద్రవాలను నిల్వర్ చేస్తే వాటిని సాధన ప్రార్థనల ద్వారా మేలుకొలపొచ్చు అప్పుడు ఆ ప్రత్యుత్పత్తి ద్రవాలు ఏమవుతాయి అంటే కింది మార్గంలో మామూలుగా వికారాల్లో అధమ మార్గంలో నిమ్న మార్గంలో పోయేటువంటి ప్రత్యుత్పత్తి ద్రవాలు ఉన్నత మార్గానికి చేరినప్పుడు అప్పుడు రకరకాల చక్రాలు రకరకాల చక్రాలు అంటే మళ్ళీ శరీరంలో ఉండే గ్లాండ్స్
(23:10) గ్రంధులు ఏంటంటే మూలాధారంలో అడ్రనలిన్ గ్రంధి స్వాధిష్టా టానంలో స్త్రీలకైతే ఓవరీస్ పురుషులకైతే టెస్టికల్స్ మణిపూరకంలో పాంక్రియాస్ అనాహతంలో థైమస్ గ్రంధి విశుద్ధంలో థైరాయిడ్ గ్రంధి ఆజ్ఞా చక్రంలో పిట్యుటరీ గ్రంధి సహస్రారంలో పీనల్ గ్రంధి అలా ఈ గ్రంధులన్నింటిని ఉద్దీపనం చేస్తూ ఆరోగ్యాన్ని ఒక ఆకర్షణని దివ్యత్వాన్ని కలిగిస్తుంది అనేది కూడా ఒక భావన ఉన్నది కాబట్టి కుండలిన శక్తి మేలుకొలపాలంటే సాదా సీదా విషయం కాదు 12 ఏళ్ళ బ్రహ్మచర్యం కావాలి అది కూడా ఒక భావన కాబట్టి కుండలిన శక్తి అనేది ఒక అద్భుతమైనటువంటి భావన దాని
(23:56) గురించి మనం తలలు పగలకొట్టుకోకూడదు మనం చేయాల్సింది ఏంటంటే ధ్యానము ఇంకో విషయం ఉంది ఏంటంటే ఏ మార్గంలో సాధన చేసినా కూడా కుండల శక్తి మేలుకుంటుంది కుండల శక్తి గనక ప్రత్యేకంగా ఒకటి ఉంటే దానికి ఒక ప్రత్యేక సాధన ఉండాలి కదా సరే వీళ్ళు చెప్తున్నారు మరి ప్రత్యేకమైన సాధన ఏంటి ఆసనాలు వేయాలి ప్రాణాయామం చేయాలి లేకపోతే బంధాలు వేయాలి దాని వల్ల మేలుకుంటుంది అంటున్నారు కదా నిజానికి ఆ ప్రాణాయామము మరియు ఆసనాల వల్ల కలిగేది ఏమిటంటే బేసిక్ ఏకాగ్రత ప్రాథమికమైనటువంటి ఏకాగ్రత అదే అది తప్ప ఇంకేం కాదు ప్రాణాయామం అనేది ఉన్నదే మనకి ఏకాగ్రతను కలిగించడానికి
(24:35) అత్యంత చంచలమైన మనసుకి ఏకాగ్రతను కలిగించాలంటే ప్రాణాయామమే మార్గము బేసిక్ ఏకాగ్రత అత్యంత ప్రాథమికైనటువంటి ఏకాగ్రత సరే దానివల్ల కుండ కుండల్ని మేలుకుంటుంది కానీ దాన్ని ఉన్నత మార్గంలో చేరాలంటే ఇంకా ఏకాగ్రం చేయాలి ప్రాణాయామం సరిపోదు ధ్యానంతో మనసు నిజంగా ఏకాగ్రం చేసి శుద్ధం చేయాలి అప్పుడే కదా కుండల్ని పై వైపుకే వెళ్ళేది అప్పుడైనా ఏకాగ్రత అనే సూత్రం శుద్ధి అనే సూత్రం కచ్చితంగా వర్తిస్తుంది.
(25:01) ఇక్కడ ఇంకో విషయం ఏ మార్గంలో సాధన చేసినా కూడా కుండల శక్తి మేలుకొంటుంది జ్ఞాన మార్గంలో సాధన చేసినా మేలుకుంటుంది. యోగ మార్గంలో చేసిన మేలుకుంటుంది కేవలం తాంత్రిక సాధనలు చేసిన మేలు నిజానికి తాంత్రిక సాధనలో ఏం చేస్తారంటే ఒక రకమైన పూజ చేసి తర్వాత వాళ్ళు చేసేది ఏంట్రా అంటే జపమో ధ్యానమే అక్కడేమో అద్భుతాలు తలకిందులుగా ఏదో వేలాడతారు అనుకోవద్దు తాంత్రిక సాధనలు వాళ్ళు చేసేది కూడా అయితే ఏందంటే మనం ప్రశాంతంగా గుళలో కూర్చొని పువ్వుల మీద కూర్చొని ధ్యానం చేస్తే వాళ్ళు పుర్రెల మీద కూర్చొని ధ్యానం చేస్తారు అంతకన్నా ధ్యానమే చేయాలి
(25:34) ఏకాగ్రమే చేయాలి శుద్ధే చేయాలి తప్ప ఇంకొక మార్గం లేదు కాబట్టి ఏ ఏ మార్గంలో సాధన చేసినా కూడా కుండల శక్తి మేలుకుంటుంది అదే రమణ మహర్షిని ఒకళ్ళు అడిగారు భగవాన్ మరి యోగ మార్గంలో ఉన్న వాళ్ళకైనా ఈ కుండల శక్తిపాతము మరి అందరికీ ఉందా అప్పుడు ఆయన చెప్పాడు శక్తిపాతం లేని వాళ్ళు ఎవ్వరు జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకు కూడా కుండల శక్తి ఉంటుంది మేలుకుంటుంది దాని పేరు ఏమంటారంటే బ్రహ్మాకార వృత్తి లేక అహం స్పురణ అంటారు.
(26:05) దాన్నే కుండలన శక్తి మేలుకోవడం కుండలన శక్తిని మేలుకోవడం అంటారు. అదే మనం ఏదైనా ధ్యానం చేస్తున్నాం అనుకోండి ఆలోచన రహితే ఏర్పడింది అది కుండలన శక్తి మేలుకోవడమే అది ఏకాగ్రతకు ప్రథమ సూచన అయితే దాన్ని నిలబెట్టుకోవాలి ఇంకా సుస్థిరం చేసుకోవాలి అప్పుడే కుండలిన శక్తి ఉన్నత గతిలో వెళ్తున్నది అని అర్థం కాబట్టి ఈ భావనల్ని మనం సమన్వయం చేసుకోకపోతే సంశయాలు పెరిగిపోయి మనకు ఆటంకాలు ఏర్పడతాయి తప్ప మన సాధన మార్గం ఏ మాత్రము సులభము కాదు కాబట్టి దీన్ని మనం బాగా అర్థం చేసుకున్నాం ఏ మార్గంలో ఉన్నటువన్నా కూడా సాధన చేసిన కుండల్ని శక్తి మేలుకుంటుంది. తర్వాత
(26:42) చివరిగా ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఇంత చెప్పినా కూడా ఈ కుండల్ని శక్తి మరి ఎందుకు ఇంత ప్రసిద్ధిని పొందింది మన మనసులని ఎందుకు ఇంత ఆకర్షించింది అంటే దాని వెనక ఇంకొక భ్రమ ఇంకొక అపోహ ఉంది అది ఏంటంటే కుండల్ని శక్తిని ఏదో ఒకటి చేసి మేలుకొలిపాయామ అనుకోండి ఎవరో గురువు శక్తిపాతం ఇచ్చారు లేకపోతే ఇంకేదో చేసాం కుండల శక్తి మేలుకుంటే చాలు మన ధ్యానంలో మనం పడే కష్టాలన్నీ తొలగిపోతాయి మన ధ్యానం ఎంతో మహా సుఖంగా ఉంటుంది.
(27:10) తర్వాత దానంత కదే అది పైకి పోతుంది అప్పుడు ఒక్కొక్క చక్రంలో ఓపెన్ అయిపోతే చివరికి అక్కడ చేరుతుంది ముక్తి వచ్చేస్తుంది ఇలాంటి భావనలు ఉంటాయి ఇది కూడా చాలా తప్పు అన్నమాట మనం పరపాటున ఏదో చేసి కుండల్ని శక్తిని బలవంతంగానో ఏదో చేసి మేలుకొలిపోయామ అనుకోండి అది పైకి పోదు కుండల్ని శక్తి యొక్క సహజ గమనం ఏంటంటే కిందికి పడడం పతనం కావడం అది లోయర్ స్టేట్ లోకి వెళ్ళిపోతూనే ఉంటుంది దాన్ని పైకి ఎత్తాల్సిన బాధ్యత మనదే ప్రతి పై చక్రానికి మనమే తీసుకొని పోవాలి దానికి కష్టపడాలి.
(27:41) ఒకవేళ కష్టపడకుండా దాన్ని పైకి ఎత్తకుండా పై చక్రాన్ని తీసుకెళ్ళకుండా అట్లాగే ఉంచామ అనుకోండి ఏమవుతుంది అది పతనం అవుతుంది ఉండల్లినే శక్తి పతనం అవుతుంది. పతనం అయినప్పుడు తీవ్రమైనటువంటి పరిణామాలు కలుగుతాయి అదే స్వామి వివేకానంద చెప్తారు. ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు కదా ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆ వ్యక్తిత్వం పర్సనాలిటీ కరిష్మ ఆయన యొక్క దివ్య తేజస్సును చూసి ఆయన వాక్ పటిమ గాంభీర్యము ఆ గంభీరమైనటువంటి వాక్కులను విని ఆ లోతైన అర్థాలని చూసి ఆ వాళ్ళు విదేశీలు మొట్టమొదటగా ఎంతో ఆకర్షితులు అయిపోయారు ఆయన ఉపన్యాసం ఇస్తుంటే ఆ విదేశీయులంతా
(28:20) శిలా ప్రతిమలలాగా వాళ్ళ ఏకాగ్రత అద్భుతమైనటువంటి ఏకాగ్రతతో శిలా ప్రతిమల లాగా వింటుండేవాడంట మరి స్వామి వివేకానంద ఊరుకుంటాడు అబ్బా ఇంతమంది దొరికారు అని చెప్పి ఉపన్యాసాలు దంచుకుంటూ పోలేదు ఆయన దాన్ని గమనించాడు ఏమని ఆ ఉపన్యాసం అయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్లి ఏం చేశారు అని చెప్పి ఆయన వెళ్లి దాన్ని స్వయాన వెళ్లి కనుక్కున్నాడు అన్నమాట కనుక్కున్నప్పుడు ఆయనకి తెలింది ఏందంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అతి తీవ్రమైనటువంటి కామ ప్రకోపాలకు గురయ్యారు వాళ్ళంతా అని దానికి కారణం ఏంటి కుండల్ని శక్తి అనేది మన ప్రయత్నం లేదు లేకుండా
(28:55) ఇతరుల ప్రమేయం ద్వారా మేలుకున్నది. మేలుకున్నప్పుడు మళ్ళీ మామూలు స్థితికి వెళ్ళడం అనేది సహజ లక్షణం దేనికైనా తన సహజ స్థితికి వెళ్తూ ఉంటుంది అది తన సహజ స్థితికి వెళ్ళినప్పుడు తీవ్రమైన కామాన్ని ఎప్పుడైతే మూలాధార చక్రంలో ఒక పతనం అవుతుందో తీవ్రమైన కామాన్ని తీవ్రమైన ద్వేషాలు రాగ ద్వేషాలని కలిగిస్తుంది ఆ కుండల శక్తి ఆ పతనం అయిపోతుంది కాబట్టి దాన్ని మనం ఉన్నత దిశలో మళ్ళంచడం అనేది మన మీదే ఉంది బాధ్యత కాబట్టి ఈ కుండల్ని చక్రాలతో ఆటలు అనేది మనం ఆడకూడదు నిజానికి కేవలం బ్రమల్లో ఉన్నవాళ్ళు మాత్రమే ఆడుతుంటారు సరిగ్గా అర్థం చేసుకున్న
(29:30) వాళ్ళకి ఎక్కడుంది ఈ బాధే లేదు. ఇది మనం ఈ కుండల్ని శక్తి పతనం కావడం అనేది మనం నిత్య జీవితంలో కూడా గమనిస్తుంటాం ఏంటంటే కొంతమంది క్రీడాకారులు ఉంటారు లేకపోతే గొప్ప అచీవర్స్ ఉంటారు సాధిస్తారు ఏదైనా ఒక పోటీ ఉంది తమ మనసుని ఏకాగ్రం చేస్తారు ఉన్నతిని సాధిస్తారు కానీ అది అయిపోంగానే అత్యంత దారుణం తాగుబోతులుగా తిరుగుబోతులుగా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నిజంగా మన ప్రపంచంలో ఎంతో సాధించారు వీళ్ళు గొప్ప సెలబ్రిటీస్ గొప్ప ప్రతిష్ట ఉన్నవాళ్ళని మనం అనుకుంటాం కదా వాళ్ళ వ్యక్తిగత జీవిత జీవితాని కొంతగా కొంత గమనిస్తే అర్థమవుతుంది వాళ్ళ
(30:06) జీవితాలు చాలా అస్తవ్యస్తంగా ఉంటాయి. కుండల శక్తి పతనం ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఏదనా ఒక టెస్ట్ ఏదైనా పరీక్ష ఎదురైనప్పుడు మాత్రమే వాళ్ళ మనసుని తీవ్రంగా ఏకాగ్రం చేస్తారు తప్ప మామూలు పరిస్థితుల్లో ఆ టెస్ట్ లేనప్పుడు మామూలు పరిస్థితులో వాళ్ళు అత్యంత అధమ స్థాయిలో ఉంటారు. కాబట్టి ఎంత గొప్పవాళ్ళయనా సరే కిందన్న మూడు చక్రాల్లో పరిభ్రమిస్తూఉంటుంది ఒక లౌకికమైన మానవుడికి ఇంకా దరిద్రుడు అయితే ఒకటి రెండు చక్రాలే అత్యంత దురలవాటల్లో ఉండి తాగుబోతూ తిరుగుబోతు ఇంకా వాడికి డబ్బులు ఎతుకుపోవడం తాగడం మత్తులో పడిపోవడం తిరుగుబోతూ ఇది ఈ రెండు
(30:41) చక్రాల్లోనే కింద తిరుగుతుంటాడు ఇంకా అధమంగా ఉంటే ఒక చక్రంలో మనిషి ఉండడం చాలా కష్టము ఇంత అధమంగా ఇది మన పతనం కుండల్ని శక్తి పతనం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది కదా కాబట్టి కుండల శక్తిని ఏదో మేలుకొలిపితే మనం గనక ఇంకా అదే పైకి వెళ్ళిపోతుంది ఇలాంటి భావనలు అనేవి తప్పు మనం కుండల శక్తిని మనమే పైకి తీసుకెళ్ళాలి దానికి మనం సాధన చేయాలి.
(31:08) ఇక్కడ శ్రీ స్వామి వివేకానంద చెప్పిన కథలో కూడా ఏంటి ఉదాహరణ అంటే వాళ్ళకి ఏకాగ్రత అనేది అప్రయత్నంగా కలిగింది తర్వాత దానంత అది పతనం అయింది. అప్పుడు స్వామి వివేకానంద చివరిగా తన సందేహాన్ని చెబుతారుఅన్నమాట. ఏమిటంటే ఇలా కుండలిని పొరపాటున తీవ్రంగా త్వరగా మేలుకొలపాలి అనేటువంటి ప్రయత్నం అనే తప్పు అది సాధారణంగా ఎక్కడ జరుగుతుంది అంటే భక్తి కీర్తనల్లో కీర్తనలు భజనల్లో ఆ వాతావరణ ప్రభావం వల్ల ఆ భజన యొక్క ప్రభావం వల్ల అక్కడఉన్న భక్తులకు ఏకాగ్రత కలుగుతుంది అది కేవలం క్షణికము ఆ లయబద్ధమైన నృత్యం ఉంటుంది అక్కడ తాళబద్ధమైన సంగీతం ఉంటుంది ఆ తాళాలు
(31:48) మృదంగాలు ఈ అద్భుతమైన సంగీతము ఆ శ్రావ్యమైన గానం ఉంటుంది ఆ తర్వాత భావావేషాన్ని కలిగించేటువంటి ఒక సాహిత్యం ఉంటుంది వీటన్నిటి వల్ల కీర్తనల్లో భజనల్లో ఏమవుతుందంటే ఏకాగ్రత కలుగుతుంది భగవంతుడి మీద ప్రేమ కలుగుతుంది మనసు ఏకాగ్రం అవుతుంది కానీ అది క్షణికము ఎప్పుడైతే ఆ పరిస్థితులనేవి పోయి తన ఇంటికి పోయి మామూలు పరిస్థితులోకి వెళ్ళిపోతాడు వెంటనే పతనం అయిపోతుంది.
(32:12) అందువల్లే స్వామి వివేకానం చెప్తాడు ఇట్లా తీవ్రంగా త్వరగా కుండల్ని పైకి లేపడం అనేది కుండల్ని అంటే ఏకాగ్రత ఆ ఏకాగ్రత అనేది మన ప్రయత్నం లేకుండా పరిస్థితుల ప్రభావం వలనో ఇంకెవరి ప్రభావం వల్లనో పైకి లేచింది అనుకోండి ఏకాగ్రత కలిగింది దాన్నే కుండల శక్తి మేలుకోవడమో ఉదోగం చెందటం అంటారు కానీ అది ఎక్కువ కాలం నిలబడదు పతనం అయిపోతుంది మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది ఆ మామూలు స్థితికి వచ్చినప్పుడు ఇంతకుముందు కన్నా ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు.
(32:42) కాబట్టి స్వామి వివేకానంద చెప్తారు ఏకాగ్రతను సుస్థిరంగా ప్రశాంతంగా నెమ్మదిగా అభ్యాసం చేయడం ఒక్కటే మార్గము ఈ ప్రమాదాలను నివారించడానికి లేకపోతే ఈ కుండల్ని శక్తి ఏకాగ్రతలు వీటితో ఆటలు అనేవి కేవలం ప్రమాదాలకు దారిదీస్తాయి. వీటిని మనం బాగా అర్థం చేసుకుందాం మన సాధన మార్గం ఏదైనా కానీ అది ధ్యానం కావచ్చు లేకపోతే ఆత్మ విచారణ కావచ్చు మొదటి దాన్ని బాగా మనం తెలుసుకోవాలి బాగా విషయాన్ని తెలుసుకున్నప్పుడు పురోగమనం లభిస్తుంది ఆ పురోగమనాన్నే గుండెల్ని మేలుకోవడం అని ఈ తర్వాత రకరకాల చక్రాలకు చేరడం అని చెబుతారు అంతేగాన ఇంక దాని మీద మనకి ఎలాంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదు ఆ
(33:24) అపోహల వల్ల మనకి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఇక ఈ ధ్యానము ఆత్మ విచారణ గురించి మనం తర్వాత తరగతుల్లో వివరంగా తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతిహి హరిహి ఓం తత్సత్ [సంగీతం]
No comments:
Post a Comment