Thursday, September 3, 2026

జీవిత సమస్యలన్నింటికీ భగవద్గీతలో సమాధానాలు | 5 Insane Life Hacks |Bhagavad Gita|TeluguMotivation

జీవిత సమస్యలన్నింటికీ భగవద్గీతలో సమాధానాలు | 5 Insane Life Hacks |Bhagavad Gita|TeluguMotivation

Author Name: Greeshma’s Guidance

Youtube Channel Url:https://www.youtube.com/@greeshma_guidance

Youtube Video URL:https://www.youtube.com/watch?v=6Rr21L8kV-4



Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మీ జీవితం అస్తవ్యస్తంగా ఉందా? అంతా అయిపోయింది అనిపిస్తుందా అప్పులు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఫెయిల్యూర్స్ ఒకదాని తర్వాత ఒకటి సునామీలా వచ్చి మిమ్మల్ని ముంచెత్తుతున్నాయా ఇక నా వల్ల కాదు నా బ్రతికింతే అని అనిపిస్తుందా? కానీ ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్. 5000 ఏళ్ల నాటి ఒకే ఒక్క పుస్తకంలో మీ ప్రతి సమస్యకు ఒక అల్టిమేట్ సీట్ కోడ్ ఉందంటే నమ్ముతారా? అవును చరిత్రలోనే అతి పెద్ద సంక్షోభంలో కురుక్షేత్రంలో ఒక లెజెండరీ వారియర్ తన సొంతవాళ్ళతోనే యుద్ధం చేయలేక చేతిలోంచి ఆయుధం జారవిడిచి కుప్పుకూలిపోయాడు. అతడే అర్జునుడు. ఆ
(00:43) క్షణంలో అతని ఫ్రెండ్ మెంటర్ అయిన శ్రీకృష్ణుడు చెప్పిన మైండ్ బ్లోయింగ్ సీక్రెట్స్ే భగవద్గీత. ఆ మాటలు కేవలం అర్జునుడి కోసం కాదు ఫ్రెండ్స్ అవి టైంలెస్ ఈరోజు మనల్ని వెంటాడుతున్న ప్రతి సమస్యకు అవే సమాధానం. ఈరోజు మనం జీవితంలో ఎదురయ్యే అతి పెద్ద ఛాలెంజ్లకు అంటే బాధ, డబ్బు కష్టాలు, బ్రేకప్స్, భయం, ఓటమి లాంటి ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేయడానికి భగవద్గీత ఇచ్చే ఐదు ఇన్సైన్ లైఫ్ హాక్స్ గురించి తెలుసుకుందాం.
(01:19) [సంగీతం] మీరు ప్రేమించిన వాళ్ళను కోల్పోవడం కంటే దారుణమైన నొప్పి ఇంకోటి ఉండదు. ఆ క్షణంలో గుండె బద్దలవుతుంది. ప్రపంచం ఆగిపోయినట్లే ఉంటుంది. ఆ బాధ నుండి ఎప్పటికీ బయటకు రాలేమని అనిపిస్తుంది. అర్జునుడి పరిస్థితి కూడా ఇదే. తన తాత గురువులు ఎదురుగా ఉంటే వాళ్ళని ఎలా చంపాలి అని అతని శరీరం వణిపోయింది. అప్పుడు కృష్ణుడు చెప్పిన ఫస్ట్ సీక్రెట్ చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్.
(01:48) నువ్వు దేనికైతే ఏడుస్తున్నావో అది నిజానికి ఏడవాల్సిన విషయం కాదు. నిజమైన జ్ఞానులు పోయిన వారి గురించి గాని ఉన్నవారి గురించి గాని సోకించరు. ఇక్కడ కృష్ణుడు బాధపడొద్దని చెప్పడం లేదు బాధపడండి కానీ అందులోనే మునిగిపోవద్దు అంటున్నాడు. ఎందుకంటే గీత ప్రకారం మనం చూస్తున్న ఈ శరీరం ఈ ప్రపంచంలో నాది అనుకునే ప్రతిది టెంపరరీ వాసాంసి జీర్ణాని యధావిహాయ అంటే మనం పాత బట్టలు తీసి కొత్త బట్టలు వేసుకున్నట్లే మనలోని అసలైన నువ్వు అంటే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది.
(02:27) దాని అర్థం ఏంటంటే మనం ఎవరినైతే కోల్పోయామని విలపిస్తున్నామో వాళ్ళ శరీరం మాత్రమే మనకు దూరమైంది. వాళ్ళలోని ఆత్మకు చావు లేదు. అది ఎటర్నల్. అలాగే మనం పోగొట్టుకున్న డబ్బు, ఆస్తులు కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. సుఖ దుఃఖాలు కూడా అంతే. ఏది పెర్మినెంట్ కాదు. సో నెక్స్ట్ టైం మీకు గుండె పగిలే బాధ వచ్చినప్పుడు ఏడవండి కానీ [గొంతు సవరించుకోవడం] ఆ బాధలో బందీ అయిపోకండి. మీలో మీరే అనుకోండి.
(02:55) ఇది కూడా గడిచిపోతుంది. ఈ శరీరం ఈ ప్రపంచం అశాశ్వతం కానీ నాలోని శక్తి శాశ్వతం. ఈ ఒక్క ఆలోచన అతి పెద్ద నష్టాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఇస్తుంది. డబ్బు సమస్యలు, జాబ్ టెన్షన్, బిజినెస్ లో లాస్ ఇవి మన నిద్రను మన శాంతిని మొత్తం లాగేసుకుంటాయి. ఇంత కష్టపడుతున్న రిజల్ట్ ఏంటి? ఈ అప్పుల నుండి బయటపడేది ఎప్పుడు ఇలాంటి ప్రశ్నలు మనల్ని తినేస్తాయి.
(03:25) ఇక్కడే భగవద్గీత ప్రపంచంలోనే గ్రేటెస్ట్ ప్రొడక్టివిటీ హాక్ ను మనకు పరిచయం చేస్తుంది. అదే కర్మయోగం కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్ పూర్మ తే సంగోస్త్వ కర్మణి మీనింగ్ చాలా క్లియర్ పని చేయడం వరకే నీకు అధికారం ఉంది. దాని రిజల్ట్ మీద కాదు కాబట్టి రిజల్ట్ కోసం పని చేయకు అలాగని పని చేయడం ఆపకు ఇది సింపుల్ గా అనిపించినా ఇది ఒక సూపర్ పవర్ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే మీ పనిని మీ బాధ్యతను 100% ఫోకస్ తో నిజాయితీతో చేయండి.
(04:05) కానీ ఆ తర్వాత వచ్చే రిజల్ట్ గురించి టెన్షన్ పడదు. ఎందుకంటే రిజల్ట్ అనేది కేవలం మీ ప్రయత్నం పైనే ఆధారపడి ఉండదు. మీ కంట్రోల్ లో లేని వెద్య విషయాలపై ఆధారపడి ఉంటుంది. రిజల్ట్ మీదే మనసు పెడితే మీరు వర్క్ పై కాన్సంట్రేట్ చేయలేరు. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాసేటప్పుడు పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని టెన్షన్ లో పడితే తెలిసిన ఆన్సర్స్ కూడా మర్చిపోతాడు.
(04:29) అదే రిజల్ట్ సంగతి పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్స్ పై 100% ఫోకస్ పెడితే తన బెస్ట్ ఇవ్వగలడు. డబ్బు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇదే లాజిక్ డబ్బు వస్తుందా రాదా అని భయపడటం ఆపి నేను ఇప్పుడు ఏం చేయగలను అని ఆలోచించి దానిపై ఫోకస్ చేయండి. పనిని పూర్తి అంకిత భావంతో చేస్తే టెన్షన్ తగ్గుతుంది. టెన్షన్ లేనప్పుడు మీ పనితనం పెరుగుతుంది.
(04:54) సక్సెస్ ఛాన్స్లు ఆటోమేటిక్ గా పెరుగుతాయి. కర్మయోగం అంటే రిజల్ట్ ను వదిలేయడం కాదు రిజల్ట్ గురించిన టెన్షన్ ను వదిలేయడం. [సంగీతం] మనము మనుషుల మధ్య బ్రతుకుతాం బంధాలే మన ప్రపంచం కానీ మనం ప్రాణంగా నమ్మిన వాళ్లే మనల్ని మోసం చేసినప్పుడు అర్థం చేసుకోలేనప్పుడు వచ్చే నొప్పి మాటల్లో చెప్పలేము. వాళ్ళ కోసం అన్నీ చేశాను నాకు ఇదేనా తిరిగివచ్చేది అనే ఆవేదన మనల్ని కాల్చేస్తుంది.
(05:25) అర్జునుడు ఫేస్ చేసింది కూడా ఇదే రిలేషన్షిప్ క్రైసిస్. ప్రేమించిన వాళ్ళపైనే బాణాలు వేయాల్సి రావడం అతనిని కుంగదీసింది. దీనికి అసలు కారణం అతి అనుబంధం అని గీత చెప్తోంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంఘస్తేశోపజాయతే అంటే వ్యక్తుల గురించి అతిగా ఆలోచిస్తే వాళ్ళపై అటాచ్మెంట్ పెరుగుతుంది. ఆ అటాచ్మెంట్ నుండి కోరిక పుడుతుంది. ఆ కోరిక తీరనప్పుడు కోపం వస్తుంది.
(05:52) గీత మనల్ని బంధాలను వదిలేయమని చెప్పట్లేదు. కానీ ఆ బంధాలపై ఆధారపడటం వాళ్ళ నుండి ఎక్కువగా ఆశించడం వాళ్ళు మన అంచనాలకు తగ్గట్లు ఉండాలని కోరుకోవడమే మన బాధకు అసలు కారణం అని వార్న్ చేస్తుంది. మనం ఒకరిని ప్రేమించినప్పుడు ఆ ప్రేమ స్వేచ్ఛగా ఉండాలి. తిరిగి ఏదో ఆశిస్తే అది బిజినెస్ అవుతుంది. మన అంచనాలు దెబ్బతిన్నప్పుడు ప్రేమ స్థానంలో కోపం నిరాశ మిగులుతాయి.
(06:20) దీనికి గీత ఇచ్చే సొల్యూషన్ అనాసక్తి అంటే ప్రేమను పంచు నీ డ్యూటీ నువ్వు చెయి కానీ బదులుగా ఏది ఎక్స్పెక్ట్ చేయకు మీ ఫ్రెండ్ కు హెల్ప్ చేయండి కానీ అతను తిరిగి చేయాలనే కండిషన్ తో కాదు మీ పిల్లల్ని ప్రేమగా పెంచండి కానీ వాళ్ళు ముసలితనంలో చూస్తారనే లెక్కతో కాదు మనం ఎప్పుడైతే వ్యక్తుల నుండి ఏమి ఆశించకుండా మన పని మనం చేసుకుపోతామో వాళ్ళ ప్రవర్తన మన శాంతిని నిష్ట చేయలేదు.
(06:46) వాళ్ళు గౌరవించిన అవమానించిన మీరు అన్స్టాపబుల్ ఎందుకంటే కండిషన్స్ లేని ప్రేమకు ఉండే పవర్ అలాంటిది ఒకే ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ ఇప్పటిదాకా మీ మైండ్ బ్లాక్ అయి ఉంటే ఇప్పుడే ఆ లైక్ బటన్ ను ప్రెస్ చేయండి. మనం ఇంకా సగంలోనే ఉన్నాం. అసలు సుసలైన ఛాలెంజ్ ముందుంది. మీరు లైక్ చేస్తే మీలాగే కష్టాల్లో ఉన్న ఇంకొందరికి వీడియో చేతుంది. సో ఇప్పుడే చేయండి.
(07:16) ఫ్యూచర్ గురించిన భయం రేపు ఏం జరుగుతుందో అని టెన్షన్ ఇవి మనల్ని ఈ క్షణంలో బ్రతకనివ్వవు. నా హెల్త్ ఏమవుతుందో నా పిల్లల ఫ్యూచర్ ఏంటి ఇలాంటి ఆలోచనలు మన మైండ్ ను ఒక ఉయ్యాలలా ఊపుతూనే ఉంటాయి. గీతలో అర్జునుడు కూడా యుద్ధం తర్వాత ఏం జరుగుతుందో అని భయంతో వడికిపోయాడు. అప్పుడు కృష్ణుడు స్థిత ప్రజ్ఞత గురించి చెప్తాడు.
(07:43) స్థిత ప్రజ్ఞుడు అంటే సుఖ దుఃఖాలలో లాభ నష్టాల్లో ఒకేలా చలించకుండా ఉండేవాడు దుఃఖేస్వ నుద్విజ్ఞమనాః సుఖేషు విగతస్వృహ అంటే కష్టాలు వచ్చినప్పుడు పొంగిపోనివాడు సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోనివాడు భయం కోపం లేనివాడే స్థిరమైన బుద్ధి గలవాడు అయితే మనసును కంట్రోల్ చేయడం గాలిని పట్టుకోవడం లాంటిది కదా ఇదే క్వశ్చన్ అర్జునుడు అడిగాడు.
(08:11) దానికి కృష్ణుడు ఒక టూ స్టెప్ యాక్షన్ ప్లాన్ ఇచ్చాడు. అభ్యాసం మరియు వైరాగ్యం అభ్యాసం అంటే మీ మైండ్ ఒక క్రూర మృగం లాంటిది. దాన్ని మచ్చిక చేసుకోవాలి. ఎలా మీ మైండ్ పక్కకు వెళ్ళిన ప్రతిసారి దాన్ని సున్నితంగా వెనక్కి తీసుకురండి. రోజుకు ఐదు నిమిషాలు మీ శ్వాస [గొంతు సవరించుకోవడం] మీద ఫోకస్ పెట్టండి. అంతే ఇది ఒక రోజులో రాదు నిరంతరం ప్రాక్టీస్ కావాలి.
(08:36) వైరాగ్యం అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసే విషయాలను వదిలేయడం. ఉదాహరణకు సోషల్ మీడియాలో వేరే వాళ్ళ లైఫ్ ని చూసి మీతో మీరు పోల్చుకోవడం ఆపండి. అది మీలో ఇంకా టెన్షన్ ను పెంచుతుంది. అలాంటి అనవసరమైన విషయాలను కట్ చేస్తే మీ మైండ్ పీస్ ఫుల్ గా ఉంటుంది. భయం ఎప్పుడూ భవిష్యత్ గురించే ఉంటుంది. కానీ మనం బ్రతికేది ఈ క్షణంలో మీ మైండ్ ను కంట్రోల్ చేసి ఈ క్షణంలో 100 శాతం జీవించడం నేర్చుకుంటే భయానికి ఆందోళనకు చోటు ఉండదు.
(09:08) మీ మైండ్ మీ కంట్రోల్ లో ఉంటే బయట ఎన్ని తుఫాన్లు వచ్చినా లోపల మీరు ప్రశాంతంగా ఉంటారు. అన్ని దారులు మూసిపోయినప్పుడు అన్ని ప్రయత్నాలు ఫెయిల్ అయినప్పుడు మన మీద మనకి నమ్మకం పోతుంది. నా వల్ల కాదు అనే నిరాశ మిమ్మల్ని తినేస్తుంది. ఇది చాలా డేంజరస్ స్టేజ్ యుద్ధభూమిలో అర్జునుడిది కూడా ఇదే పరిస్థితి. తను నేర్చుకున్న విద్య తన బలం ఏది అతనికి ధైర్యాన్ని ఇవ్వలేకపోయింది.
(09:36) కంప్లీట్ గా హెల్ప్లెస్ గా ఫీల్ అయ్యాడు. అప్పుడే అతను కృష్ణుడిని శరణం వేడుతూ నేను నీ శిష్యుడిని నాకు దారి చూపించు అని అడిగాడు. ఇక్కడే గీతలోని ఫైనల్ మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ మనకు దొరుకుతుంది. గీత చివరిలో కృష్ణుడు ఓ గ్రేట్ ప్రామిస్ చేస్తాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వ సర్వపాపేభ్యో మోక్షయష్యామి ఆసుః నీ భావం నీ చింతలన్నీ నీ భారాలన్నీ వదిలేసి నన్ను ఒక్కడినే శరణం పొందు నేను నిన్ను అన్ని పాపాల నుండి బాధల నుండి బయటపడేస్తాను దుఃఖించకు శరణాగతి అంటే చేతకాక చేతులెత్తేయడం కాదు ఇది ఒక అల్టిమేట్ పవర్ ఆఫ్ మీ శక్తికి మించిన
(10:20) భారాన్ని మీ భయాలను మీ అహాన్ని ఆ యూనివర్సల్ పవర్ కు లేదా భగవంతుడికి సరెండర్ చేయడం నా బెస్ట్ నేను ఇచ్చాను ఇక రిజల్ట్ నీ చేతుల్లో ఉంది అని నమ్మడం. ఈ ఒక్క ఫీలింగ్ మీకు ఇన్క్రెడిబుల్ ఫ్రీడమ్ ని ఇస్తుంది. రిజల్ట్ యొక్క భారం మీ మీద నుండి దిగిపోతుంది. మీరు ఒంటరిగా ఫైట్ చేయడం లేదని ఒక పెద్ద శక్తి మీకు తోడుగా ఉందని తెలిసినప్పుడు అంతులేని ధైర్యం వస్తుంది.
(10:48) ఒక చిన్న పిల్లాడు తండ్రి చెయ్యి పట్టుకున్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా నడుస్తాడో భగవంతునిపై నమ్మకం ఉంచిన వ్యక్తి జీవితంలో ప్రతి కష్టాన్ని అలాగే ఎదుర్కుంటాడు. సో మీకు ఎప్పుడైనా ఇట్స్ ఓవర్ అనిపించినప్పుడు ఒక్క క్షణం ఆవి ఆ శక్తిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీ భయాలను ఆయనకు అప్పగించి నన్ను నడిపించు అని అడగండి.
(11:13) మా సుచుహు దుఃఖించకు అనే ఆయన అభయం మీ చీకట్లో వెలుగు చూపిస్తుంది. చూశరుగా 5వేల ఏళ్ల నాటి పుస్తకం నుండి ఐదు ఇన్సైన్ లాఫాక్ట్స్ కష్టాలు ఓటములు జీవితంలో వస్తూనే ఉంటాయి. వాటిని ఎవరు ఆపలేరు కానీ వాటిని చూసి కుప్పకూలిపోవాలా లేక వాటిని వెపన్స్ గా వాడుకొని మరింత బలంగా మారాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. దుఃఖం వస్తే ఆత్మ శాశ్వతమని గుర్తుపెట్టుకోండి.
(11:40) డబ్బు కష్టాలు వస్తే రిజల్ట్ టెన్షన్ లేకుండా పని చేయండి. బంధాలు బాధ పెడితే అంచనాలు లేకుండా ప్రేమించండి. భయం వేధిస్తే మీ మైండ్ ను కంట్రోల్ చేయండి. ఇక ఏ దారి లేనప్పుడు ఆ భగవంతుడికి సరెండర్ అవ్వండి. భగవద్గీత ఒక పుస్తకం కాదు ఫ్రెండ్స్ అది మనకు ధైర్యాన్ని ఇచ్చే ఫ్రెండ్ దారి చూపే గైడ్ మీ లైఫ్ లో ఏ కష్టం వచ్చినా ఈ మాటలు గుర్తుంచుకోండి.
(12:05) మీరు ఒంటరి కాదు అర్జునుడికి దారి చూపిన ఆ జ్ఞానం ఈరోజు మీకు కూడా తోడుగా ఉంది. మీకు నా నుండి ఓ ఛాలెంజ్. ఈ ఐదు సీక్రెట్స్ లో ఈ వారం మీరు ఏది వాడబోతున్నారో ఇప్పుడే కింద కామెంట్ చేయండి. మీ లైఫ్ లో భగవద్గీత ఎలాంటి మార్పు తెచ్చిందో [గొంతు సవరించుకోవడం] నాకు తెలియాలి. మీ జీవితాన్ని మార్చే ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే ఏం చేయాలో మీకు తెలుసు.
(12:29) అదే నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో పవర్ఫుల్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అందాక బి స్ట్రాంగ్ బి హ్యాపీ అండ్ స్టే ట్యూన్ టు క్రిస్మస్ గైడ్. జై శ్రీ కృష్ణ

No comments:

Post a Comment