సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఏ దేవుడొస్తాడు | Sri Pushpagiri Peethadhipati Sri VidyaShankara Bharathi
Author Name:Reflection Bharat
Youtube Channel Url:https://www.youtube.com/@ReflectionBharat
Youtube Video URL:https://www.youtube.com/watch?v=nvzNPEk4Bkc
Transcript:
(00:00) అయితే భారతదేశంలో కూడా హిందుత్వం సనాతన ధర్మం అంటే హిందువులే సనాతన ధర్మాన్ని ఎక్కువగా పాటిస్తారు. మిగిలిన వాళ్ళు పాటించరు అని అయితే ఎనిమిది నుంచి తొమ్మిది రాష్ట్రాల్లో ఇప్పటికి భారతదేశంలో హిందువులు మైనారిటీలు అయిపోయారు. తొమ్మిది రాష్ట్రాల్లో అఫిషియల్ గా అది కూడా నాలుగు సంవత్సరాల క్రితం జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు వస్తే ఎంతమంది అవుతారో తెలియదు.
(00:22) మరి సనాతన ధర్మానికి మనం దూరం అవుతున్నామా లేదా సనాతన ధర్మమే మనకు దూరమవుతుందా ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే ఎలా నిత్య నూతనం అంటున్నాం సనాతనం ఎప్పటికీ ఉంటుంది అంటున్నాం కానీ ఒకవైపు ధర్మాన్ని మనం కాపాడకపోతే మరి ధర్మం ఇప్పటికి ఎనిమిది రాష్ట్రాల్లో నుంచి దూరం వెళ్ళిపోతుంది మరి ఎలా అనే ప్రశ్న మనల్ని వేధిస్తుంది ఇక్కడ ఒక చిన్న పరామర్శ మనం పురాణాల్లో మనం గమనించినట్లయితే మనిషి ఒక్కడే కాదండి ధర్మాన్ని పాటించేది సనాతనం అని మనం ఎందుకు పేరు చెప్తున్నాము అంటే ఒకడు పాటిస్తే అది ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రాంతీయ ధర్మం అవుతుంది లేదు ఒక దేశం పాటిస్తే దేశికమైనటువంటి ధర్మం
(01:03) అవుతుంది. లేదు ఒక రాష్ట్రమో లేకపోతే ఒక ఖండమో పాటించింది అనుకోండి అది ఖండాంతర ధర్మం అవుతుంది. పంచభూతాలు ధర్మాన్ని పాటిస్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి కర్మలు మనం బాగా గమనిస్తే సూర్యుడు తనకు నిర్దేశించినటువంటి సమయంలో ఉదయిస్తున్నాడు. ఏ ధర్మంతో ఉదయిస్తున్నాడు ఆయన? సనాతన ధర్మం అనేటువంటి ఒక నిబంధనతో సూర్యోదయం జరుగుతున్నది.
(01:28) రెండవది వర్షములు అదే కాలంలో వర్ష రుతువులో వర్షకాలంలోనే వర్షాలు పడాలి ఎందుకు పడాలి అది ధర్మం ఆ వరుణుడికి ప్రపంచం ఇచ్చినటువంటి ధర్మం భూమి ఏ కాలంలో ఏ పంట ఇవ్వాలో దానికి తెలుసు కాబట్టి కృషి చేసేటువంటి శ్రామికుడు ఆ సమయంలో దుఖితుడిని నీరు పోస్తే అందులో నుంచి పంట వస్తున్నది. ఇది సనాతన ధర్మంలో అంతర్లీనమై ఉన్నటువంటిది ఎండాకాలంలో మన దేహమంతా కూడా చలికాలంలో గడ్డకట్టుకుపోయి రోగాలన్నీ కూడా విజృంభించేటువంటి సమయంలో ఒక్కసారిగా మార్తాడు విజృంభించి మనకు వసంత రుతువులో దేహాన్నంతా కూడా సుస్థిరపరిచేటువంటి ఉష్ణాన్ని పెంచేటువంటి తాపాన్ని
(02:04) కలుగజేస్తున్నాడు కొత్త చిగుళ్ళను ఇస్తున్నాడు కొత్త పంటని ఇస్తున్నాడు కొత్త ఆహారాన్ని ఇస్తున్నాడు ఇదంతా కూడా సనాతన ధర్మంలో ప్రకృతి ఆకాశం చేస్తున్నటువంటి ధర్మం వేడైతే చల్లగాలు వస్తుంది చల్లగా ఉంటే వేడి గురిపిస్తుంది ఆకలి వేస్తే అన్నం పెడుతోంది దాహం వేస్తే నీళ్ళ ఇస్తుంది లేదు మనం ఉండాలి అనుకుంటే చెట్టు పుట్ట తనకు తాను సంహరించుకొని మనకు ఇల్లు గుడ్డ నీడగా ఒకటి మారుతున్నాయి అవన్నీ అవి ధర్మాలు చేస్తున్నప్పుడు ఒక్క మనిషి మాత్రమే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడు అనే మాట ఒప్పుకునే విషయం కాదు ఎందుకు మనం సనాతన ధర్మాన్ని పాటించాలి
(02:42) అంటే సనాతన ధర్మంలో ప్రకృతిని కాపాడుకునేటువంటి అనేక వనరులు ఉన్నాయి అనేక విషయాలు ఉన్నాయి ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి విషయం సనాతన ధర్మంలో ఉన్నది మన గృహాన్ని కాపాడుకునేటువంటి విషయం సనాతన ధర్మంలో ఉన్నది భావితరాలలో పిల్లల్ని కాపాడుకునేటువంటి ధర్మం మన సనాతనంలో ఉన్నది ఈ తర్వాత మనం ఎదగవలసినటువంటి కాలంలో వచ్చేటువంటి అనేక ఇబ్బందులని ఎదుర్కొనేటువంటి సాహసోపేతమైన విద్య మన సనాతన ధర్మంలో ఉన్నది.
(03:08) కాబట్టి ప్రపంచంలోనే కాదు విశ్వంలో సనాతన ధర్మము ప్రకృతికి అంతర్లీనమై ప్రవర్తిస్తున్నది. మనిషి అనేటువంటి వారు ఆచరించడానికి యోగ్యుడు మాత్రమే తప్ప ధర్మాన్ని కాపాడే శక్తి మనలో లేదు ఎందుకంటే ధర్మమే మనల్ని కాపాడాలి ఎందుకంటే ధర్మో రక్షతి రక్షితః ధర్మమేన స్వయంహంతే ఏవండీ ధర్మమే మనల్ని కాపాడాలి ధర్మమే మనల్ని చంపాలి కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం మనకు ప్రాణంగా ఉంటుంది.
(03:42) ధర్మాన్ని వదిలామా ధర్మం మనకు మృత్యువై అనుసరిస్తుంది. ఈరోజు మనం పడుతున్నటువంటి అనేక ఉద్రేకాలకు దురాచారాలకు కారణం ఏమిటి అనుకుంటున్నాం మనం లోకంలో ధర్మ బుద్ధి దూరం కావడం అనేటువంటి విషయాన్ని కోసమేగా మనం ఇక్కడ కాంక్లివ్ పెట్టుకొని అందరూ సనాతన ధర్మాన్ని ఆత్మగా భావిస్తూ ఎవరెవరు ఈ లోకంలో ధర్మ రక్షణార్థం జిజ్ఞాసులు అయి ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు.
(04:05) ఎందుకు వీళ్ళకందరికీ స్ఫూర్తిగా మనం మాట్లాడుతున్నాము అంటే ఏది చేస్తే మనం చేస్తున్నది రైట్ ఒకటి మనం చేస్తున్నది కరెక్ట్ గా ఉన్నది ఇంకా మనం దీన్ని ఉదుతి చేసి లోకంలో ధర్మ పరిరక్షణార్థం ముందుకు వెళితే తప్పకుండా ధర్మము యొక్క ఉద్యమంలో మనం నిష్నాతులమై విజయాన్ని పొందుతాము అనేటువంటి ఒక ఉత్సాహాన్ని కలుగజేయడానికి ఈ వేదిక మనకు ఆకలింపు చేసేదానిగా కాంక్లవ్ పెట్టుకున్నాం అవునా కాదా అండి కాబట్టి మనిషి అనేటువంటి సనాతన ధర్మం పాటించేది చాలా చాలా అల్పమైనటువంటిది కానీ సనాతనం నిత్యనూతనం ఎలాగైతే రేపు తెల్లవారి జామున పరమాత్మ మీలో నిద్ర నుంచి పైకి లేచి మిమ్మల్ని
(04:45) మేలుకొలుపుతున్నాడో ఆయన నూతనుడు కాకపోతే మనల్ని లేయం నిన్న పరమాత్మ ఈరోజు మనలో సనాతనుడిగా ఉద్భవించకపోతే ఈరోజు స్వామివారు ఇక్కడికి వచ్చేవారు కాదు అంటే మీకు ఒక ఉదాహరణకు చెప్తున్నాను అలాగని ఇక్కడ ఉన్నటుంటి వాళ్ళందరూ కూడా ఆ స్ఫూర్తితో నిరంతరము ఈరోజు ఒక ఆలోచన చేశం కానీ సనాతన ధర్మంలో ఒక మెట్టు ఎక్కాం రేపటికి ఇంకొక మెట్టు ఎట్లా ఎక్కాలి ఆలోచన రూపంలో సనాతనుడు ఎప్పుడు నిత్య నూతనుడే ఉద్యమ రూపంలో సనాతనుడు ఎప్పుడు నిత్యనూతనుడే మనిషి యొక్క పరాక్రమ రూపంలో సనాతన ధర్మం ఎప్పుడు కూడా నిత్యనూతనమే కాబట్టి హిరణ్య కశుపుడు పుడితే ప్రహ్లాదుడులా
(05:23) సనాతన ధర్మం వస్తుంది రావణాసురుడు వస్తే విభీషణుల సనాతన ధర్మం వస్తుంది లేదు ఇంకేదైనా ఆపదలు వచ్చాయి అనుకోండి కృష్ణ పరమాత్మల సనాతన వస్తుంది ఈరోజు అమోగ దేశపతి లాగా సనాతన ధర్మం వేదిక ఎక్కింది. ఇలాగ అనేకాలు ఎందుకంటే సభలో మంచి పని చేసినటువంటి వారిని వారి తరపున మిమ్మల్ని అందరినీ కూడా మేము కీర్తిస్తూ మీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ధర్మనిష్టకు ఎప్పుడు కూడా అభినందనలు చెబుతూ సనాతనం నిత్యనూతనం పురా అపి నవం పురాణం పురాణాల్లో 18 పురాణాలు వ్యాసులవారు చెప్పారండి 18 పురాణాలు వ్యాసులవారే చెప్పారు 18 పురాణాల్లో పేరు మార్చిన అర్థాలు మారలే
(06:08) ఎక్కడో ఒక చోట సృష్టి ఉత్పత్తి ఉన్నది ఎక్కడో చోట రాక్షస సంహారం ఉన్నది ఎక్కడో ఒక చోట ఆ వంశానికి అంతిమం ఉన్నది మళ్ళీ దాంట్లో భక్తుల యొక్క గాధ ఉన్నది దుర్నాయకుల యొక్క హననం ఉన్నది భక్తుల్ని ఉద్దరించేటువంటి భవిష్యత్తులో మన ప్రణాళిక అందులో నిష్ట అయ ఉన్నది. ఈరోజు చదివినా మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది రేపు దొరికి చదివినా మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నిన్న మనం వచ్చాము అంటే ఆ సమస్యకు పరిష్కారంతోనే ఈ వేళకు వచ్చాం అంటే ఏ రోజుక ఆరోజు నిత్య నూతనం పురాణం పురాణంలో దాగి ఉన్నది సనాతన ధర్మం కాబట్టి సనాతనాన్ని నూతనం అనటానికి ఎంతో
(06:44) భయపడాల్సినటువంటి అవసరం లేదు ముక్తకంఠంతో ఏకవాక్యంగా చెప్పగలిగిన మాట ఏదైనా ఉన్నది అంటే సనాతనం నిత్యనూతనం
No comments:
Post a Comment