Monday, July 20, 2026

🥸ముక్కులో గులాబీ పువ్వులు పెట్టుకుని, మురిక్కాలువలో కూర్చుంటే కంపు పోతుందా? | Anukula Vedam

🥸ముక్కులో గులాబీ పువ్వులు పెట్టుకుని, మురిక్కాలువలో కూర్చుంటే కంపు పోతుందా? | Anukula Vedam

Author Name:Anukula Vedam

Youtube Channel Url:https://www.youtube.com/@anukulavedam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=PDbnfK2Cv4g



Transcript:
(00:00) ఒక పెద్ద యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక జెన్ మాస్టర్ దగ్గరికి వచ్చాడు. నేను జీవిత సత్యాలన్నీ తెలుసుకోవాలి నా బతుకు మారాలి నాకు కొత్త జ్ఞానం ప్రసాదించండి అని పెద్ద పెద్ద డైలాగులన్నీ కొట్టాడు. ఆ మాస్టర్ ఏమి మాట్లాడకుండా ప్రశాంతంగా ఒక కప్పులో టీ పోయడం మొదలపెట్టాడు. కప్పు నిండిపోయి టీ కింద వలిగిపోతున్న సరే మాస్టర్ పోస్తూనే ఉన్నాడు.
(00:23) ఆ ప్రొఫెసర్ కి చిర్రు ఎత్తుకవచ్చి ఏంటండీ మీ కళ్ళు కనబడట్లేదా కప్పు అంచుల వరకు నిండిపోయింది ఇంకా పోస్తున్నారు అందులో ఇంకొక్క చుక్క కూడా వెళ్ళదు అని అన్నాడు. అప్పుడు ఆ జెన్ మాస్టర్ నవ్వి నీ బుర్ర కూడా ఈ కప్పు లాగే నీ పాత ఆలోచనలతో నీ అహంకారంతో నువ్వు చదివిన పుస్తకాల చెద్దతో అంచుల వరకు నిండిపోయి ఉంది. ముందు నువ్వు దాన్ని ఖాళీ చేయకుండా నేను ఎంత కొత్త జ్ఞానం పోసినా అది ఇలాగే కింద పడిపోతూ ఉంటది.
(00:49) ముందు ఆ కప్పుని ఖాళీ చేయు అన్నాడు. ఎగజాక్ట్ గా మీ పరిస్థితి కూడా ఇదే మీకుొక కొత్త జీవితం కావాలి. అవునా నా జీవితం మారిపోవాలి కొత్తగా ప్రారంభించాలి అని చాలాసార్లు అనుకునే ఉంటారు. వినడానికి ఈ మాట చాలా బాగుంటది. కానీ ఇక్కడే ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. మీరు అడుగుతున్నదే ఎంత ఇలాజికల్ గా ఉందో ఒక్కసారి లోతుగా అర్థం చేసుకోండి.
(01:13) ఈ కొత్త జీవితం కావాల్సింది ఎవరికీ మీకు మీలో దాగున్న నేను అనే అహంకారానికి కావాలి. మరి మీ పాత జీవితంలో ఉన్న చెత్తను సమస్యల్ని ఏడుపుని ఆందోళనని ఎవరు క్రియేట్ చేశారు అదే నేను మీరు ఒక విషయాన్ని స్పష్టంగా గమనించారా మీరు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారాలి అని కోరుకుంటారు కానీ మీరు మాత్రం మారకుండా ఎగజాక్ట్ గా ఆ పాత నేను లాగే ఉండిపోవాలి అనుకుంటారు.
(01:40) నా జాబ్ బాలేదు కొత్త జాబ్ కావాలి నా రిలేషన్షిప్స్ బాలేవు కొత్త రిలేషన్షిప్స్ కావాలి నా కారు బాలేదు కొత్తది కావాలి కానీ నా బుద్ధి బాలేదు నా ఆలోచన విధానం బాలేదు ఈ పాత నేను చచ్చిపోవాలి అని ఎప్పుడైనా అనుకున్నారా లేదు ఇది ఎలా ఉందంటే ఒకడు మురుగకాలవలో కూర్చొని నాకు ఇక్కడ చాలా కంపు కొడుతుంది నా చుట్టూ గులాబీ పువ్వులు పెట్టండి అని ఏడ్చినట్టుంది.
(02:04) మురుగకాలవలో ఉన్నంత కాలం ఎన్ని పెర్ఫ్యూములు చల్లిన ఆ వాసన మారదు. మురుగులో కూర్చున్నవాడు మారకుండా చుట్టూ ఉన్న వాతావరణం మారితే ఏంటి లాభం? కొత్త జీవితం అడుగుతున్న మీ పాత సెల్ఫే మీకున్న అతి పెద్ద రోగం. రోగానికి కొత్త బట్టలు వేసేస్తే ఆరోగ్యం వచ్చినట్టా కాదుగా సో ఆ పాత కప్పుని పగలుకొట్టాల్సిందే. మార్కెట్లోకి వెళ్లి చూస్తే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అని పర్సనాలిటీ డెవలప్మెంట్ అని వేలకి వేల పుస్తకాలు వీడియోలు కోర్సులు అవన్నీ మీ లోపల ఉన్న అహంకారాన్ని మరింత బలంగా పాలిష్ చేసేవే నిన్ను నువ్వు మెరుగుపరుచుకో ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అని చెప్తారు. కానీ ఇక్కడే మానవ చరిత్రలో అతి
(02:42) పెద్ద స్కామ్ దాకా ఉంది. మీ లోపల ఉన్నది ఒకే మనసు ఆ మనసు మొత్తం భయంతో ఆశలతో కండిషనింగ్ తో నిండిపోయి ఉంది. ఆ చెత్త మనసుతోనే మీరు నన్ను నేను మెరుగుపరుచుకుంటాను అని రంగంలోకి దిగితే ఏం జరుగుతుంది? ఒక పిచ్చోడికి నువ్వు తెలివిగా ఆలోచించు అని చెబితే వాడు తెలివిగా పిచ్చి పనులు చేస్తాడు. అంతే తేడా మీరు అనుకుంటున్న ఇంప్రూవ్మెంట్ అంతా ఆ పిచ్చివాడి తెలివితేటలే కొత్త జీవితం కావాలంటే మీ లోపల ఇంప్రూవ్మెంట్ జరగకూడదు డిస్ట్రక్షన్ జరగాలి.
(03:12) మీ పాత ఆలోచనలు మీ పాత భయాలు మీ నమ్మకాలు అన్ని కూలిపోవాలి. ఇల్్లు పునాదులతో సహా కుళ్లిపోయినప్పుడు పైన రంగులు వేస్తే అది కొత్త ఇల్లు అయిపోద్దా అవ్వదుగా దాన్ని పునాదులతో సహా కూల్చేయాలి. కానీ కూలిపోవడం మీకు అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే మీకు విపరీతమైన భయం మీ ఐడెంటిటీ ఎక్కడ పోతుందో అని భయం నేను ఫలానా నేను గొప్పవాడిని నేను బాధల్లో ఉన్నవాడిని అనే అబద్ధపు గుర్తింపు లేకపోతే మీరు బతకలేరు.
(03:40) అందుకే మీరు నిజమైన మార్పుని ఎప్పుడూ కోరుకోరు. కేవలం మార్పు అనే భ్రమను మాత్రమే కోరుకుంటారు. మీరు పడుతున్న బాధలకి మీ అసంతృప్తికి కారణం ఎవరు ఎప్పుడైనా నిలదీసి అడిగారా మిమ్మల్ని మీరు సొసైటీనా మీ పేరెంట్స్ మీ బాస్ మీ పార్ట్నరా కాదు ఇదంతా మీరే సృష్టించుకున్నారు. యు ఆర్ ద అల్టిమేట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ ఓన్ మిజరీ సమస్యని క్రియేట్ చేసిన మైండ్ తోనే పరిష్కారాన్ని వెతుకుతున్నారు.
(04:07) ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో ఆలోచించండి. తప్పు చేసిన చేతులతోనే తీర్పు రాయాలని చూస్తున్నారు. దొంగే పోలీస్ స్టేషన్ కి వెళ్లి నాకు దొంగతనం చేయకుండా ఉండడానికి రక్షణ కల్పించండి అని అడిగినట్టుగా ఉంది మీ పరిస్థితి. మీ జీవితంలో మీకు సొంతంగా వచ్చిన ఆలోచన ఒక్కటైనా ఉందా మీ కోరికలు నిజంగా మీవేనా పక్కింటివాడు కారు కొన్నాడు కాబట్టి మీకు కారు కావాలి.
(04:26) ఇగ లో ఎవడో ఫొటోస్ పెట్టాడు కాబట్టి మీకు ఆ లైఫ్ స్టైల్ కావాలి. సమాజం ఇదే సక్సెస్ అంటే అని ఒక డెఫినిషన్ ఇస్తే దాన్ని గుడ్డిగా నమ్మేసే జీవితమంతా ఒక ఎలకల రేసులో పరిగెడుతున్నారు. మీ ఆలోచనలు అప్పు తెచ్చుకున్నవే మీ కోరికలు అప్పు తెచ్చుకున్నవే మీ లక్ష్యాలు కూడా అప్పు తెచ్చుకున్నవే దేవుడు పాపం పుణ్యం అన్నీ మీకు ఇతరులు చెప్పినవే మరి అరువు తెచ్చుకున్న బతుకుతో ఒరిజినల్ గా ఉన్న ఆకాశంలో ఎలా ఎగురుతారు? అసలు ఇందులో మీరు ఎక్కడున్నారు? అంతా పరాయి వ్యవహారమే.
(04:54) మీ లోపల మీ నిజమైన మీరు తప్ప అంతా ఉంది. కొత్త జీవితం అంటే కొత్త ప్రదేశానికి వెళ్ళడం కాదు కొత్త జీవితం అంటే పాత దృక్పదాన్ని వదిలేయడం మీరు ఎప్పుడూ ప్రెజెంట్ మూమెంట్ లో ఉండరు. ఎందుకంటే ప్రెజెంట్ లో మీ ఈగోకి పని లేదు. మీరు ప్రతిదాన్ని మీ లాభం కోసమే చూస్తారు. ఇది చేస్తే నాకుఏంటి లాభం ఇదే కదా మీ బుర్రలో ఎప్పుడు తిరిగే లెక్క? ఇలాంటి క్యాలిక్యులేషన్ తో బతికే వాడికి ఎప్పటికీ కొత్త జీవితం రాదు.
(05:23) రిలేషన్షిప్స్ లో ప్రేమలో చివరికి దేవుడి దగ్గర ప్రార్థనలో కూడా లాభ నష్టాలు చూసుకునే ఒక చీప్ వ్యాపారి మీరు ఈ వ్యాపార బుద్ధి పోవాలి ఈ లెక్కల మైండ్ ఆగిపోవాలి. చీకటిని పారద్రోలాలంటే కత్తితో యుద్ధం చేయకూడదు ఒక చిన్న దీపం వెలిగించాలి. ఆ దీపమే అవేర్నెస్ ఒకడిని పొగడుతున్నారంటే దాని వెనక మీకు ఏదో కావాలనే స్వార్థం దాగుందేమో చూడండి ఒకరికి భయపడుతున్నారంటే మీ ఈగోని ఎవరో హర్ట్ చేస్తారనే ఇన్సెక్యూరిటీ ఉందేమో చూడండి మీ ప్రతి చర్య వెనక ఉన్న అసలు ఉద్దేశాన్ని పట్టుకోండి దాన్ని జడ్జ్ చేయకండి జస్ట్ అబ్సర్వ్ చేయండి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలి అంటే ఒకే ఒక
(06:00) మార్గం సరెండర్ ఇక్కడ సరెండర్ అంటే దేవుడినో గురువుకో ఆశ్రమానికో వెళ్లి కాళ్ళ మీద పడటం కాదు నిజ నిజానికి సరెండర్ అవ్వడం నా జీవితంంతా ఒక అబద్ధం నేను కోరుకుంటున్నదంతా ఇతరులను చూసి తెచ్చుకున్న పట్టింపే నాకంటూ ఏమీ లేదు అనే నగ్నమైన నిజాన్ని ఒప్పుకోండి. కారణాలు చెప్పడం మానేయండి. జస్టిఫికేషన్స్ ఇవ్వడం ఆపండి నేను మంచివాడిని ప్రపంచమే చెడ్డది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆ సెల్ఫ్ పిటీ అనే చవకబార్ డ్రామాని కట్టిపెట్టండి.
(06:29) మీ కర్మలకి మీరే బాధ్యులు. ఎప్పుడైతే మీ తప్పుల్ని మీ స్వార్థాన్ని మీ భయాలని ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా ధైర్యంగా అద్దంలో చూసుకున్నట్టు చూసుకుంటారో అప్పుడు మీ లోపల ఉన్న ఆ పాత మనిషి చనిపోవడం మొదలవుతుంది. ఒక పాము తన పాత కుబుసాన్ని ఎలా వదిలేస్తుందో మీరు కూడా మీ పాత ఐడెంటిటీని అలానే వదిలేయాలి. ఎందుకంటే ఆ వదిలేసిన కుబుసం గురించే పట్టుకొని ఏడుస్తూ కూర్చుంటే ఆ పాము ఎప్పటికైనా ముందుకు వెళ్ళగలదా ఎప్పటికీ వెళ్ళలేదు.
(06:59) చెత్తను దాచుకుంటే ఆస్తి అవ్వదు అహంకారాన్ని పెంచుకుంటే వ్యక్తిత్వం అవ్వదు. కలలో ఉన్నంతసేపు కలలోని రాక్షసుడితో మీరు తీవ్రంగా యుద్ధం చేస్తూనే ఉంటారు. రక్తం చిందిస్తారు అలిసిపోతారు. కానీ ఆ కల నుండి బయట పడాలంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు కేవలం నిద్ర లేవాలంతే అవేకనింగ్ ఇస్ ఏ ఓన్లీ సొల్యూషన్ పాత జీవితం అంటే కలలో బ్రతకడం కొత్త జీవితం అంటే నిద్ర లేచి నిజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడడం.
(07:27) దీనికి ఎంతో సమయం పడుతుంది సంవత్సరాల పాటు సాధన చేయాలి హిమాలయాలకు వెళ్ళిపోవాలి అని గాని ఎవడైనా చెబితే వాడు మిమ్మల్ని మళ్ళీ మోసం చేస్తున్నాడనే అర్థం. మార్పు అనేదే సమయానికి సంబంధించింది కాదు అది ఒక అకస్మాత్తు అవగాహన ఇన్స్టంట్ రియలైజేషన్ నా అహంకారమే నా శత్రువు అని మీకు ఇప్పుడు ఈ క్షణంలో అర్థమైతే సెకండ్ లో మీ జీవితం మారిపోతుంది.
(07:51) ఇంత విన్న తర్వాత కూడా మీ మైండ్ ఏమంటుందో తెలుసా మనం ఎలాగైనా మారిపోవాలి సో రేపటి నుండి మొదలెడదాము రేపటి నుండి కొత్త ప్లాన్ వేసుకుందాము అని అంటుంది. అవునా అదేమి అసలైన శత్రువు ఈ రేపు అనేదే అహంకారం వేసే అతి పెద్ద ట్రాప్ రేపు అనేది ఎప్పటికీ రాదు ఎప్పుడు ఉండేది ఈ క్షణం మాత్రమే మార్పు వస్తే ఇప్పుడే ఈ క్షణమే రావాలి లేదంటే ఇంకో 100 వీడియోలు చూసిన 1000 పుస్తకాలు చదివినా మీ జీవితంలో ఒక్క మిల్లీమీటర్ కూడా మార్పు రాదు.
(08:21) మీరు మళ్ళీ అదే మురుగకాలవలో కొత్త రంగు బట్టలు వేసుకొని కూర్చుంటారు. సో మీ పాత కప్పుని పగలకొట్టడానికి ముందుగా మీరు నమ్ముతున్న ఏ అబద్ధాన్ని వదిలేపోతున్నారు.

No comments:

Post a Comment