చెడ్డ రోజా? అదేంటి? There is no Bad Day until you create
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=eF31vT_djtE
Transcript:
(00:01) భగవంతుడు మనల్ని ఈ భూమి మీదకి మంచిరోజు చూసి పంపించాడండి మంచి ముహూర్తం పెట్టి పంపించాడా కాదు కదా సృష్టిని గౌరవించే వ్యక్తిగా మనల్ని నమ్మి ఈ భూమి మీద పంపించాడు. ఆయన ఉద్దేశం ఒక్కటేనండి ఈ అద్భుతమైన సృష్టిలో మనం కూడాను అద్భుతంగా ఎదగాలి అని అంటే ఆ ప్రయోజనం కోసమే మనం ఈ భూమి మీదకి పంపబడ్డాం.
(00:28) నేను చాలా తర్చులో ఒక కొటేషన్ చెప్తూ ఉంటాను కదా ఏ బేబీ ఇస్ గాడ్స్ ఒపీనియన్ దట్ వరల్డ్ షుడ్ గో ఆన్ అంటే బిడ్డ భగవంతుని సంతకం అండి విశ్వంలో మనల్ని భాగస్తులని చేసి ఆ పాంచభౌతికమైన విశ్వతత్వాన్ని మనలో నింపి ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే ఆ విశ్వాన్ని విశ్లేషించి శోధించి క్లారిఫికేషన్ తీసుకొని హాయిగా జీవించు అని భగవంతుడు ఉదారత్వంతో ప్రేమతో మనల్ని భూమి మీద పంపించాడండి అంతే తప్ప విశ్వం అలా ఏదో క్యాజువల్ గా సృష్టింపబడలేదండి దానికి ఒక ప్రయోజనం ఉంది అర్థం ఉంది కాబట్టి
(01:12) విశ్వ లక్షణాలని పునికి పుచ్చుకున్న మన జీవితాలకు కూడాను ఒక అర్థం ఉంది. ఇది గమనిస్తే త్రికరణ శుద్ధిగా గనుక విశ్వసిస్తే మన ప్రతి క్షణం కూడా అద్భుతమేనండి అలాగే ప్రతి గంట ప్రతి రోజు కూడాను అద్భుతమే ఉపయోగించుకోవడం మన చేతిలోనే ఉందండి అంతే తప్ప మంచి రోజు చెడ్డ రోజు అంటూ ఉండవండి అదంతా మన అభూత కల్పనే అసలు నీలాంటివాడు ఈ భూమి మీద లేడంటే నువ్వు ఎంత ప్రత్యేకమైన అతిధివో అర్థమైందా ఈ భూమి మీద సో దర్ ఇస్ నో బాడ్ డే ఆర్ గుడ్ డే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ థాట్స్ అల్టిమేట్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే
(01:58) వన్ థింగ్ హపెన్స్ ఐదర్ యు రun ది డే ఆర్ డే రన్స్ యు సో వెదర్ యు వాంట్ టు బి ఏ మాస్టర్ ఆర్ ఏ సర్వెంట్ ఇట్ అల్టిమేట్లీ డిపెండ్స్ ఆన్ యు దట్స్ ఆల్ అంతేనండి నీ ఆలోచనలు మంచివి అయితే అది మంచి రోజు అవుతుంది అదే నీ ఆలోచన చెడ్డవ అయితే స్వయం కృతాపరాధం అయితే చెడ్డ రోల్ అయితుందండి. తరచుగా మన జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటాయి కొన్ని అనుకుంటూ ఉంటాం కదా రేపటి నుంచి అమ్మ నాన్నతో ఎక్కువసేపు మాట్లాడతాను.
(02:34) రేపటి నుంచి పిల్లలతో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాను. రేపటి నుంచి కోపం వచ్చే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తాను. అలాగే రేపటి నుంచి భగవద్గీతలో ఒక్క శ్లోకం అన్నా తాత్పర్యంతో సహా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. మరి ఇలా అనుకున్నామంటే మంచి రోజులే కదండీ అదే విచిత్రము ఎలా ఉంటుందో తెలియని రేపటికి మనం పోస్ట్పోన్ చేస్తాం. [నవ్వు] [ఆశ్చర్యం] కానీ మొదలు పెట్టం తప్పు ఎవరిదండి మనదే కదా మరి ఆ రేపు నువ్వు మనం కోసం ఎదురుచూస్తున్న రేపును
(03:18) నిందిస్తే ఎలాగండి నిందిస్తే ఎలాగ చెప్పండి మనం నిజంగా చెప్పాలి ఏంటంటే మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నాం కానీ ఆ మంచి రోజు మనకోసం ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి అలిసిపోయిందండి [నవ్వు] అలిసిపోయింది అంతే జీవితం ఎప్పుడు ఒక్కసారిగా వెళ్ళిపోదండి రోజుకి కొంచెం కొంచెం కొంచెం కొంచెం వెళ్ళిపోతుంది అప్పుడు మనం కుదిలి ఏం చేయాలో తెలియక ఆసక్తులు అలా కూర్చుండిపోతాం.
(03:47) ప్రపంచాన్ని నిందిస్తూ కదా నాన్న ఎలా ఉన్నావురా అని నాన్న ఫోన్ చేస్తే ఏ బిజీగా ఉన్నాను నాన్న నేను తర్వాత మాట్లాడతాను అని మాట్లాడడానికి వాయిదా వేసింది ఎవరు అది కాదురా నాన్న అమ్మ ఐసి లో ఉంది అని చెప్పబోయేందులోనే ఫోన్ కట్ చేసింది ఎవరు నువ్వే కదా మరి తెలిసిన వెంటనే బిజీ అంతా పక్కన పెట్టేసి అంతకంటే బిజీగా పరిగెత్తావుగా నువ్వు వెళ్ళంగానే నీకోసం కలవరించి కలవరించి పోయిందని నాన్న చెబితే నువ్వు బాధపడ్డావుగా అదే సమయంలో డాక్టర్ ఎంటర్ అయ్యి
(04:32) కొద్ది క్షణాల క్రితమే కోమలోకి వెళ్ళిపోయిందండి ఆమె అని చెప్పగానే కుప్పకండిపోయి రోధించింది ఎవరు ఉందే కదా ఆలోచించండి ఒకసారి ఆ సన్నివేశం ఆలోచించండి. నాన్న ఫోన్ చేశడు అంటే అది మంచి రోజే కదండీ అమ్మ ఫోన్ చేసింది అంటే మంచి రోజే కదా అంటే నీకు అశుభం కలగాలని వాళ్ళందరూ ఫోన్ చేస్తారా సో ఇలా మంచి రోజులని పోస్ట్పోన్ చేసింది ఎవరండి మంచి మాటల్ని పోస్ట్పోన్ చేసింది ఎవరు మనమే కదా అలా కాలం అనే అటెండెన్స్ రిజిస్టర్లో మనకి ఇంటూ మార్కులు పడుతూనే ఉన్నాయి కదండీ ఈ వాస్తవాన్ని విస్మరిస్తే ఎలా చెప్పండి
(05:16) ండి ఒక నిజం చెప్తానండి మీ రోజుని పాడు చేసింది మీ శత్రువులు కారు తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం అనే ఒక అలవాటు ఉంది కదా ఆటిట్యూడ్ ఉంది కదా అవేనండి అలా కొన్ని వేల రోజులకి బ్యాడ్ డే అని ట్యాగ్ వేసింది ఎవరండి నువ్వేగా నువ్వా అసలు ఇది గుడ్ డే ఇది బ్యాడ్ డే అని డిసైడ్ చేసేది ఎవరన్నా నీకు మంచి చేస్ స్తే అది మంచిరోజు అంటావు పోస్మన్ చేస్తావు స్టార్ట్ చేయవు ప్రపంచాన్ని నిందిస్తావు ఒక్కడు గుర్తుంచుకోవాలండి మనకంటే ప్రపంచం ముందు నుంచి ఉంది.
(06:02) ఎవరనా మనకి మంచి చేస్తే పొంగిపోతాం కదా కానీ మంచి చేయాలి ఇతరులకి అని మనం అనుకున్నప్పుడు దాన్ని ఎందుకు పోస్ట్ చేస్తున్నామో మనకే తెలియదు. కదండీ ఒకటండి జీవితం ఎప్పుడు మోసం చేయదు ఎందుకంటే అది భగవంతుడు ఇచ్చిన జీవితం కాబట్టి మనమే జీవితాన్ని రేపు అనే మాటతో మోసం చేస్తూ ఉంటామండి క్యాలెండర్లో రోజులు మారటం వల్ల జీవితం మారదు నిర్ణయాలు మారిన రోజే జీవితం మారుతుంది.
(06:35) అప్పుడు అన్నీ మంచి రోజులే గడియారం కూడాను కేవలం సమయాన్ని మాత్రమే చెబుతుందండి నీ ఆలోచనలు నీ జీవితాన్ని చెప్తాయి. నీ దృక్పదమే నీ రోజును తయారు చేస్తుంది. మరి మనలో ఏదో లోపం పెట్టుకొని రోజుని నిందిస్తే ఎలా చెప్పండి నోట్స్ రాసుకుంటూ ఉంటే ఒక అనుమానం వచ్చిందండి నాకు లిజనర్స్ మళ్ళీ అనుమానం వేస్తారేమో కామెంట్ బాక్స్ లో రాసేటప్పుడు అని చెప్పేసి గబగబ దాని గురించి కూడా రాసుకున్నానండి అదేంటంటే కొంతమందికి కొన్ని విచిత్రమైన ఆ డౌట్లు వస్తూ ఉంటాయి.
(07:18) పురోహితులు ముహూర్తాలు నిర్ణయిస్తారు కదా మంచి రోజులు అని చెబుతూ ఉంటారు కదా మరి వాడి సంగతి ఏంటండి మా పురోహితుడు మాకు ముహూర్తం పెట్టాడు ఒక్క క్షణం మాకు పట్టంలేదు అని మనం అంటుంటాం కదండీ మనం అంటే మనం కాదులేండి కొంతమంది అలాగ అంటుంటారు కదా అన్ని డౌట్లేనండి ఈ డౌట్లే మనల్ని ఆపేస్తున్నాయి మంచి రోజా కాదా ఓ పెద్ద డౌట్ అండి అద్భుతమైన ఆలోచన వచ్చిందంటే అది మంచి రోజే ఆ క్షణం నీదే నువ్వు అలా ప్రారంభించాల్సిందే అంతే ఒకటండి ముహూర్తాలు నెట్వర్క్స్ లో కూడా నువ్వు తప్పు పట్టకూడదు ఎందుకంటే ముహూర్తం అనేది గాలి వీచే సమయం కానీ పడవలు నడపల్సింది నావికుడివే కదా
(08:02) అలాగే జీవితం అనే సుక్షేత్రాన్ని సస్యామలం చేయవలసింది భార్యా భర్తలే కదా ఒకటండి ఇప్పుడు ఇప్పుడు రైతు కూడా విత్తనం నాటాలని అనుకుంటాడు అప్పుడు నేల తడవాలి కదా అది మెత్తబడాలి కదా అందుకనే ప్రకృతిలో విత్తే సమయం ఏదన్నా ఉంది అంటే వర్షాకాలం అండి కానీ అల్టిమేట్ గా చివరికి కష్టపడాల్సింది మళ్ళీ మటుకు అయితే గాలి ఎంత అనుకూలంగా ఉన్నా నావికుడు గనుక నిద్రపోతే పడవ గమ్యానికి చేరదు.
(08:39) అంతే కదండీ కేవలం ముహూర్తం మన జీవితాన్ని మారుస్తుంది అంటే ఉట్టి భ్రమ అండి ఒక విధంగా చెప్పాలి అంటే అది అజ్ఞానమే ఆలోచనలు చెడ్డవైనా మాటలు కఠినంగా ఉన్నా జీవితం అతలాకుతలమే అల్లా కల్లోలమే బిపి షుగర్లు కంట్రోల్ లో ఉండాలి అంటే మరి ఎక్సర్సైజ్ చేయాలి కదా వాకింగ్ చేయాలి కదండీ ప్రాణాయామం కూడా చేయాలి కదా చేయాల్సింది మనమే కదా కదండీ టైంకి భోజనం కూడా చేయాలి కదా మనం సో ముహూర్త బలం అంటే జాగ్రత్తగా పట్టుకోండి ముహూర్త బలం అంటే ప్రకృతిలో కొన్ని సమయాల్లో శక్తి ప్రశాంతత
(09:26) అనుకూలత ఎక్కువగా ఉంటాయండి ఎక్కువగా ఉంటాయి. మీ ఆలోచనలు సన్నగిల్లుతూ ఉన్నా కూడాను ఆ వాతావరణం అనేది మీ ఆలోచనల్ని అద్భుతంగా తయారు చేస్తాయి అన్నమాట అసలు ఈ ప్రాతిపతి మీదనే వివాహం గృహప్రవేశం ఉపనయనాలు యజ్ఞాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి మంచి ఉదాహరణ చెప్తానండి ఇప్పుడు కౌరవుల దగ్గర కూడాను జ్యోతిష్కులు ఉన్నారుగా మరి అయినా ఎందుకు కౌరవులు ఓడిపోయారు ఇక్కడ ఒక విషయాన్ని పట్టుకోవాలండి మనం ముహూర్తం అంటే ధర్మం గొప్పది అది వాళ్ళ దగ్గర లేదు పాండవుల దగ్గర ఉంది.
(10:02) యతో ధర్మస్తోజయః కదండీ కాటండి ముహూర్తం అనేది తలుపు తెరుస్తుంది లోపలికి నడిచి వెళ్ళేది ఏదన్నా ఉంది అంటే అది మన ఆలోచనే మన వ్యక్తిత్వమే మన కర్మే ఆలస్యం చేసామ అనుకోండి చివరికి అది మన కర్మ కూర్చుంటుందండి దాన్ని అనుభవించక తప్పదు ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రాన్ని తప్పు పట్ట పట్టకూడదండి నిట్టు పరిస్థితిలో కూడాను అన్వయించుకునే పరిజ్ఞానం మనలో ఉండాలి అంతే అంతకంటే ఏం లేదండి సో చివరిగా ఒక్క మాట అండి ఒక్క మాట ఈ భూమికి సూర్యుడు ఎంత అవసరమో అంటే మనవాడు సుభిక్షంగా ఉండాలి అంటే ఈ భూమి మీద ఉన్న
(10:50) మనకి ముహూర్తాలు ధర్మము ప్రేమ విశ్వాసం కూడాను అంతే అవసరం అండి అంతే అవసరం అది ప్రకృతి [గొంతు సవరించుకోవడం] నియమాలుండి వాడిని గౌరవించకపోతే ఎలాగండి సో మంచి రోజులు చెడ్డ రోజులు అంటూ ఏమి లేవండి అన్నీ మంచి రోజులే అన్ని మంచి రోజులే మంచి రోజు కాబట్టే ఆ రోజు చాలా శక్తివంతమైన క్షణంలో మీకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన మిమ్మల్ని పని చేయి పని చేయి కార్యాచరణకు ఉపక్రమించు అని తోస్తూ ఉంటుందండి కానీ మనం రేపు రేపు అంటూ ఉంటాం.
(11:35) సో తప్పు ఎవరిదండి మనదే కదా సో [నవ్వు] [ఆశ్చర్యం] జావసంగా చెప్పానే కదండీ ఎందుకంటే పోస్ట్పోన్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో ఓడిపోతూ ఉంటారండి. ఒక స్థాయికి ఎదిగిన మేధావని చూడండి అనుకున్నదే తడవుగా పని ప్రారంభిస్తారు. అచీవర్స్ కూడాను అదే పని చేస్తారు కాకపోతే ఏంటంటే ఆ ఆలోచన బలంగా పెట్టుకొని దానికి కావలసిన ఏర్పాట్లన్నీ క్షణం వేస్ట్ చేయకుండా చేసుకుంటూ ఉంటారండి చేసుకొని అప్పుడు వాళ్ళు కార్యచరణలో దిగుతారున్నమాట కాబట్టి అన్ని రోజులు మనవే అన్ని రోజులు మంచివే ఇందాక నేను చెప్పినట్టుగా భూమి మీద భగవంతుడు రోజులని ఎంజాయ్ చేస్తూ నిన్ను నీవు పునీతం చేసుకోవయ్యా నా సృష్టిని కూడా గౌరవించు
(12:21) అని అవ్యాధమైన ప్రేమతో పందించాడండి. [నవ్వు] సో ఇదండి ఈ వీడియోలో సంగతి వినందుకు కృతజ్ఞతలు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఆలోచిస్తున్న వాళ్ళు కార్యాచరణలోకి దిగుతారేమో ఒక్కటి దిగినా మీ ప్రయాసం నా ప్రయాసం ఫలించినట్టే కదండి. నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడండి ఇబ్బందే లేదు ఎన్నో ఫోన్స్ వస్తున్నాయి నేను మాట్లాడుతూనే ఉన్నాను.
(12:49) నా ఫోన్ నెంబర్ 9491063089 నా పేరు మారుతి కిరణ అండి YouTube లోకి వెళ్లి ఎంఆర్ టహ్ ఐ స్పేస్ ఇచ్చి కేఐఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పి ఓఆర్ యు ఆర్ఐ అని చెప్పేసి మా ఇంటి పేరు కూడా వస్తుంది అదే నా YouTube ఛానల్ బెల్ ఐకాన్ లైక్ బటన్ మీరు ఇటు నొక్కుతూనే ఉన్నారు కదండి కాబట్టి కృతజ్ఞతలు పోద చిన్న రిక్వెస్ట్ అండి వీటన్నిటికీ మించి అద్భుతమైన మెసేజ్ ని మీరు కామెంట్ బాక్స్ లో పెడితే దాన్ని నేను చదువుకొని అన్వయించుకని ఇంకొంచెం సీరియస్ గా ఆలోచించి మరికొన్ని వీడియోలు చేస్తానండి ఇదే నా వాగ్దానం [నవ్వు] నమస్కారంఅండి
No comments:
Post a Comment