రాత్రి మోటివేషన్ పొద్దున్నే ఎందుకు మాయమైపోతుంది : Rayala Suneetha
Author Name:Rayala Suneetha
Youtube Channel Url:https://www.youtube.com/@rayalasuneetha-w5b6g
Youtube Video URL:https://www.youtube.com/watch?v=HJY5HdfNvg0
Transcript:
(00:01) హాయ్ ఇది మీకు తెలుసా ఈ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ మోటివేషనల్ స్పీకర్లు ఎక్కడుంటారో తెలుసా కరెక్ట్ గా రాత్రి 10 గంటలకి బెడ్ మీద పడుకునే ముందు ప్రతి ఇంట్లోనూ ఇలా ఒకరు తయారవుతుంటారు. ఫోన్లో ఏదో ఒక ఫిట్నెస్ వీడియో చూడటమే ఆలస్యం. మనోళ్ళకి ఎక్కడ లేని పోనకం వచ్చేసి ఇలా అంటారు. అమ్మ రేపటి నుంచి చూడు నేను ఎలా మారిపోతాను పొద్దున్నే ఐదు గంటలకే అలారం కంటే ముందే లేచిపోతా యోగా చేస్తా మెడిటేషన్ చేస్తా రేపటినుంచి జంక్ ఫుడ్స్ కూడా అన్ని బంద్ ఓన్లీ హెల్దీ డైట్ తింటా రాత్రి పడుకునే ముందు మనోళ్ళు ఇచ్చే
(00:47) స్పీచ్లు వింటే ఒలంపిక్స్ ఆత్రేలు కూడా తలదించుకోవాలి. కానీ కట్ చేస్తే పొద్దున్నే ఆరవుతుంది. అలారం అరుస్తూనే ఉంటుంది. అమ్మ వచ్చి దుప్పట్లు లాగుతూ లేవే యోగా చేస్తా అన్నావ్ అని అంటే లోపల నుంచి ఒక నీరసమైన వాయిస్ వస్తుంది. అబ్బా అమ్మ నువ్వు వెళ్ళు ఒక ఐదు నిమిషాలు 10 నిమిషాలు తర్వాత చేస్తారే అని అంటారు. నిజం చెప్పండి మీ ఇంట్లో కూడా ఇలాంటి రేపటితరం యోగా గురువులు ఉన్నారా? అసలు ఈ రేపు అనే మాయ వెనక ఉన్న రహస్యం ఏంటి? రాత్రి పడుకునేటప్పుడు మన మెదడు చాలా రిలాక్స్ గా ఉంటుంది. అప్పుడు మనకు ప్రపంచాన్ని జయం
(01:33) చేసేంత మోటివేషన్ వచ్చేస్తుంది. కానీ పొద్దున్నే లేచేసరికి ఆ వేడి బెడ్ ఆ మెత్తటి దిండు ఇచ్చే సుఖం ముందు యోగాసనాలు ప్రాణాయామాలు అన్నీ బలా దూరైపోతాయి. ఈ ఒక్కరోజు పడుకుంటే ఏమవుతుందిలే రేపటి నుండి పక్కా చేద్దాం అని మైండ్ మనల్ని చాలా ఈజీగా మోసం చేసేస్తుంది. దాంతో ఇలా వాయిదా వేస్తుంటారు. పిల్లలు ఇక్కడ ఒక విషయం గమనించాలి.
(02:03) మీరు మీ అమ్మని మోసం చేయట్లేదు మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. రోజు చేస్తాలే చేస్తాలే అనుకుంటూ కూర్చుంటే చివరికి మీ ఆరోగ్యం కూడా తర్వాత చూసుకుందాంలే అని చేతులెత్తేస్తుంది. ఈ చిన్న అలవాటు నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప జీవిత సత్యం ఉంది. జీవితంలో సక్సెస్ అవ్వాలన్నా హెల్దీగా ఉండాలన్నా మనకు కావాల్సింది ఒకే రోజులో చేసే పెద్ద పెద్ద ప్రయోగాలు కాదు.
(02:37) రోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు ఈరోజు నుంచే గంటల తరబడి యోగా చేయాల్సిన అవసరం లేదు. కేవలం టైం కి నిద్ర లేవడం అనే ఒకే ఒక చిన్న అలవాటుతో మొదలు పెట్టండి. బెడ్డు మీద నుంచి లేచి నుంచోవడమే మీ మొదటి విజయం మాటలు చెప్పడం చాలా ఈజీ కానీ దాన్ని చేతల్లో చూపించినప్పుడే మీకంటూ ఒక వాల్యూ ఉంటుంది. అమ్మ లేపితేనే లేవడం కాదు మీ బాధ్యత మిమ్మల్ని నిద్ర లేపాలి.
(03:10) రేపు అనేది ఎవ్వరికీ రాదు ఉన్నదల్లా ఈరోజు మాత్రమే సో మై డియర్ గాయస్ రాత్రిపూట డైలాగులు ఆపేసి రేపు పొద్దున్నే అలారం మోగగానే బెడ్ దిగడానికి రెడీ అవ్వండి. ఈ వీడియోని రాత్రిపూట తోపులా మాట్లాడి పొద్దున్నే లేవని మీ ఫ్రెండ్స్ కి ఇప్పుడే షేర్ చేసి ట్యాగ్ చేయండి. చూద్దాం రేపు పొద్దున ఎంతమంది నిజంగా లేచి యోగా చేస్తారో.
No comments:
Post a Comment