Monday, July 20, 2026

The Secret Behind Universe And You | అసలు నిజం 🤫🔥

The Secret Behind Universe And You | అసలు నిజం 🤫🔥

Author Name:Truth Inside you

Youtube Channel Url:https://www.youtube.com/@TRUTHINSIDEYOU7

Youtube Video URL:https://www.youtube.com/watch?v=N0AoiLkxJKc



Transcript:
(00:03) ఒక్కసారి నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు. ఒకప్పుడు రోజు నీకు మెసేజ్ చేసిన వాళ్ళు ఇప్పుడు రిప్లై కూడా ఇవ్వడం లేదు. ఒకప్పుడు [సంగీతం] నీతో గంటలు కొద్ది మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు నీ ప్రెసెన్స్ కూడా పట్టించుకోవడం లేదు.
(00:23) నువ్వు మారిపోయావా లేక వాళ్ళు మారిపోయారా? లేదా ఇంకేదైనా కనిపించని శక్తి నీ జీవితంలో పని చేస్తుందా? ఈ వీడియో చివరి వరకు చూస్తే నీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలకు నువ్వు ఇప్పటివరకు ఊహించని సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే చాలా మంది ఒక పెద్ద నిజాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. అందరూ దూరమవుతున్నారు అంటే నేను ఓడిపోతున్నానని అనుకుంటారు.
(00:46) కానీ నిజానికి కొన్ని సందర్భాల్లో అది ఓటమి కాదు. అది విశ్వం నీ జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తున్న మొదటి సంకేతం. ఇది వినడానికి కాస్త బాధగా ఉంటుంది. కానీ ఈ నిజం తెలుసుకున్న తర్వాత నువ్వు ఎవరిని బలవంతంగా నీ జీవితంలో ఉంచాలని ప్రయత్నించవు. ఇప్పుడు ఒక ప్రశ్న ఒక రాకెట్ భూమి నుంచి అంతరిక్షంలోకి వెళ్ళాలంటే మొదట ఏమి వదిలేస్తుంది. దాని కింద ఉన్న భారీ ఫ్యూయల్ బూస్టర్స్ ఎందుకంటే అవి మొదటి దశలో అవసరం కానీ పైకి వెళ్ళాలంటే వాటిని వదిలేయాల్సిందే.
(01:17) మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. నువ్వు ఆర్డినరీ ఆలోచనల నుంచి హైయర్ కాన్షస్నెస్ వైపు ప్రయాణం మొదలు పెట్టినప్పుడు నీ వైబ్రేషన్ మారడం మొదలవుతుంది. నీ ఎనర్జీ మారుతుంది. నీ డెసిషన్స్ మారుతాయి నీ ప్రయారిటీస్ మారుతాయి. అప్పుడు నీతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరు అదే స్పీడ్ లో మారరు. అక్కడే డిస్టెన్స్ మొదలవుతుంది. చాలా మందిది ఈగో అనుకుంటారు.
(01:41) కొంతమంది ఆటిట్యూడ్ అంటారు. మరి కొంతమంది నువ్వు మారిపోయావు అంటారు. కానీ వాళ్ళకు కనిపించని విషయం ఒక్కటే నువ్వు వాళ్ళకు దూరం కాలేదు. నువ్వు నీ అసలు రూపానికి దగ్గర అవుతున్నావు. విశ్వం ఎప్పుడూ మనకు కావాల్సిన వాళ్ళను మాత్రమే ఇవ్వదు. మన ఎదుగుదలకు అవసరమైన వాళ్ళని ఇస్తుంది. వాళ్ళ పని పూర్తయ్యాక నిశశబ్దంగా బయటకు తీసుకెళ్తుంది.
(02:02) అందుకే కొన్ని రిలేషన్షిప్స్ ఎలాంటి గొడవ లేకుండానే ముగిసిపోతాయి. ఎలాంటి ఎక్స్ప్లనేషన్ లేకుండానే కొందరు డిసపియర్ అయిపోతారు. మొదట్లో అది చాలా బాధగా ఉంటుంది. ఎందుకు ఇలా జరిగింది అని రాత్రంతా ఆలోచిస్తావ్. నాలో ఏమైనా తప్పుందా అని నీకే నువ్వు ప్రశ్నలు వేసుకుంటావ్. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో ప్రతి డోర్ క్లోజ్ అవ్వడం పనిష్మెంట్ కాదు.
(02:23) కొన్ని డోర్స్ క్లోజ్ అవ్వడం ప్రొటెక్షన్ ఇది యూనివర్స్ ఇచ్చే సైలెంట్ బ్లెస్సింగ్ ఇప్పుడు ఇంకో విషయం చెబుతాను దీన్ని చాలా తక్కువ మంది మాత్రమే గుర్తిస్తారు. నువ్వు నిజంగా నీ పర్పస్ కోసం పని చేయడం మొదలు పెడితే నిన్ను ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళు ఒక్కొక్కరుగా దూరమవుతారు. ఎందుకంటే ముందు నువ్వు అందరికీ ఎస్ చెప్పేవాడివి ఇప్పుడు అవసరం లేని చోట నో చెప్పడం నేర్చుకున్నావ్.
(02:46) ముందు అందరినీ ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించేవాడివి. ఇప్పుడు నీ ఇన్నర్ పీస్ ని కాపాడుకోవడం నేర్చుకున్నావ్. ముందు ఒంటరిగా ఉండడానికి భయపడేవాడివి ఇప్పుడు సాలిట్యూడ్ లోనే నీ నిజమైన శక్తిని కనుగొంటున్నావ్. ఇదే వాళ్ళకు అర్థం కాదు. ఎందుకంటే ప్రపంచం నువ్వు అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటుంది. కానీ యూనివర్స్ మాత్రం నువ్వు నీకే అందుబాటులో ఉండాలని కోరుకుంటుంది.
(03:08) ఈ రెండు దారులు ఎప్పుడూ ఒకటిగా ఉండవు. అందుకే నిజమైన ట్రాన్స్ఫార్మేషన్ మొదలయ్యే సమయంలో ఒంటరితనం నీ జీవితంలోకి వస్తుంది. ఆ ఒంటరితనం శాపం కాదు అది కాస్మిక్ ఎనర్జీ నీతో మాట్లాడే నిశశబ్ద ప్రదేశం అక్కడే నీ అసలు ప్రయాణం మొదలవుతుంది. కానీ ఇంకా ఒక పెద్ద రహస్యం ఉంది. నువ్వు అందరూ దూరమవుతున్నారని అనుకుంటున్న సమయంలో నిజానికి విశ్వం నీ జీవితంలో ఎవరిని తొలగిస్తోంది ఎందుకు తొలగిస్తోంది? దాని వెనక ఉన్న హ్యూమన్ సైకాలజీ మరియు స్పిరిచువల్ ట్రూత్ చాలా మందికి తెలియదు.
(03:38) అదే విషయం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నువ్వు ఈ వీడియో ఇక్కడి వరకు చూసావంటే యూనివర్స్ నీతో ఉంది. నీకు తెలియకుండానే అది నీకు సహాయం చేస్తుంది. కామెంట్ లో యూనివర్స్ అని కామెంట్ చెయ్ ఎంతమందితో యూనివర్స్ ఉందో చూద్దాం. ఇప్పుడు ఒక ప్రశ్న ఎందుకు కొంతమంది నీ జీవితంలోకి చాలా ప్రేమతో వస్తారు కానీ అదే వాళ్ళు ఒక్కసారిగా నీకు పరాయి వాళ్ళలా మారిపోతారు ఎందుకు నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు నీకన్నా తప్పు చేసినా ప్రశాంతంగా ఉంటారు ఎందుకు మాత్రం నువ్వే బాధపడుతుంటావ్ ఈ ప్రశ్నలకు సమాధానం రిలేషన్షిప్ లో కాదు హ్యూమన్ సైకాలజీలో ఉంది. మనిషి ఎప్పుడూ
(04:13) తనకు కంఫర్టబుల్ గా అనిపించే వాళ్ళతోనే ఎక్కువ కాలం ఉండాలని చూస్తాడు. కానీ నువ్వు మారడం మొదలు పెట్టినప్పుడు నీ మాటలు మారుతాయి. నీ హ్యాబిట్స్ మారుతాయి నీ ప్రయారిటీస్ మారుతాయి నీ డ్రీమ్స్ మారుతాయి నీ సైలెన్స్ కూడా మారుతుంది. అప్పుడు పాత వర్షన్ని ఇష్టపడిన వాళ్ళకు కొత్త నువ్వు అర్థం కావడం కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళు నిన్ను ప్రేమించలేదు వాళ్ళకు ఉపయోగపడిన నీ వర్షన్ని మాత్రమే ప్రేమించారు.
(04:39) ఈ మాట వినడానికి కాస్త కఠినంగా ఉంటుంది. కానీ జీవితంలో ఒకరోజు ప్రతి ఒక్కరు ఈ నిజాన్ని ఎదుర్కోవాల్సిందే. నువ్వు అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు నువ్వు మంచివాడివి నువ్వు అందరి ప్రాబ్లం్ సాల్వ్ చేసినప్పుడు నువ్వు స్పెషల్ నువ్వు నీ టైం ని సాక్రిఫైస్ చేసినప్పుడు నువ్వు గొప్పవాడివి కానీ ఒకరోజు నువ్వు నీ జీవితానికి వాల్యూ ఇవ్వడం మొదలు పెట్టావు.
(04:58) నీ గోల్స్ కి ప్రయారిటీ ఇవ్వడం మొదలు పెట్టావు. నీ మెంటల్ పీస్ ని కాపాడుకోవడం మొదలు పెట్టావు. అప్పుడు అదే ప్రపంచం నువ్వు మారిపోయావు అంటుంది. ఎందుకంటే వాళ్ళు నీ ఎదుగుదలను చూడడం లేదు వాళ్ళ కంట్రోల్ తగ్గిపోవడాన్ని చూస్తున్నారు. ఇక్కడే విశ్వం తన పని మొదలు పెడుతుంది. విశ్వం నీ జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తిని శాశ్వతంగా ఉంచదు.
(05:19) ప్రతి వ్యక్తి ఒక లెసన్. కొంతమంది నీకు ప్రేమ నేర్పిస్తారు. కొంతమంది నమ్మకం నేర్పిస్తారు. కొంతమంది మోసం నేర్పిస్తారు. మరి కొంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్ నేర్పిస్తారు. లెసన్ పూర్తయిన తర్వాత వాళ్ళ చాప్టర్ కూడా పూర్తవుతుంది. కానీ మనమే ఆ చాప్టర్ ని మళ్ళీ మళ్ళీ చదవడానికి ప్రయత్నిస్తాం. అందుకే బాధ ఎక్కువ కాలం ఉంటుంది. ఒకసారి అడవిలో పెరిగి ఒక పెద్ద చెట్టుని ఊహించుకో ఆ చెట్టు ఆకాశం వైపు ఎదుగుతున్న కొద్దీ దాని కింద ఉన్న చిన్న కొమ్మలు ఎండిపోతాయి.
(05:46) చెట్టు వాటిని ద్వేషించదు కానీ అవి దాని ఎదుగుదలకు అవసరం ఉండదు. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. నువ్వు కాన్షియస్నెస్ లో ఎదుగుతున్నప్పుడు నీ ఫ్రీక్వెన్సీ పెరుగుతున్నప్పుడు నీతో రెజనెన్స్ లేని వాళ్ళు సహజంగానే దూరమవుతారు. ఇది కర్స్ కాదు ఇది కాస్మిక్ అలైన్మెంట్. ప్రపంచం దీనిని లాస్ అంటుంది. యూనివర్స్ దీనిని స్పేస్ క్రియేషన్ అంటుంది.
(06:09) ఎందుకంటే కొత్త ఆశీర్వాదాలు రావాలంటే పాత భారాలు వెళ్ళిపోవాలి. కొత్త రిలేషన్షిప్స్ రావాలంటే పాత అటాచ్మెంట్స్ విడిపోవాలి. కొత్త పర్పస్ మొదలవ్వాలంటే పాత ఐడెంటిటీ ముగియాలి. అందుకే కొన్నిసార్లు నీ ఫోన్ సైలెంట్ గా ఉంటుంది. కొన్ని రోజులుగా ఎవరూ కాల్ చేయరు. కొన్ని మెసేజ్లకు రిప్లై రాదు. మొదట్లో అది ఒంటరితనంలా అనిపిస్తుంది.
(06:31) కానీ నిజానికి అదే నీ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ మొదలైన క్షణం. ఎందుకంటే బయట శబ్దం తగ్గినప్పుడే లోపల ఉన్న నీ ఆత్మస్వరం వినిపించడం మొదలవుతుంది. అక్కడే చాలా మంది వెనక్కి తిరిగి వెళ్తారు ఎందుకంటే ఒంటరిగా ఉండటం వాళ్ళకు భయం కానీ కొందరు మాత్రం ముందుకు నడుస్తారు ఎందుకంటే వాళ్లకు ఒక విషయం అర్థంవుతుంది. ఒంటరితనం అంటే ఎవరూ లేరని కాదు తప్పు మనుషుల శబ్దం తగ్గిందని నిజమైన శక్తి మాట్లాడడం మొదలు పెట్టిందని అదే కాస్మిక్ ఎనర్జీ అదే యూనివర్స్ గైడెన్స్ అదే నీ సోల్ నిన్ను సరైన దారిలో నడిపించే సమయం.
(07:04) ఇప్పుడు ఒక చిన్న కథ చెబుతాను ఆ కథలో ఉన్న వ్యక్తి పేరు ముఖ్యం కాదు ఎందుకంటే ఆ వ్యక్తి నువ్వే కావచ్చు. నీ జీవితంలో జరిగిన సంఘటనలే కావచ్చు. ఆ కథ విన్న తర్వాత ఎందుకు కొందరు నీ జీవితంలో ఉండకూడదో ఎందుకు విశ్వం కొందరిని నీ నుండి దూరం చేస్తోందో ఎప్పటికీ మర్చిపోలేని విధంగా అర్థమవుతుంది. ఒక చిన్న ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. అతనందరికీ మంచే చేసేవాడు.
(07:27) ఎవరైనా సహాయం అడిగితే ముందుండేవాడు. ఎవరైనా బాధలో ఉంటే తన బాధ మరిచిపోయి వాళ్ళకు ధైర్యం చెప్పేవాడు. అందుకే అందరూ అతని చుట్టూ ఉండేవారు అతనికి అనిపించింది. ఇంతమంది నా జీవితంలో ఉన్నారు అంటే నేను చాలా అదృష్టవంతుడిని అని కానీ ఒకరోజు అతను తన జీవితాన్ని మార్చాలని నిర్ణయించుకున్నాడు. ప్రతి ఉదయం త్వరగా లేవడం మొదలు పెట్టాడు.
(07:52) ధ్యానం చేయడం మొదలు పెట్టాడు. తన గోల్స్ కోసం పని చేయడం మొదలు పెట్టాడు. అవసరం లేని డిస్కషన్స్ తగ్గించాడు. టైం ని విలువైనదిగా చూడడం మొదలు పెట్టాడు. నెమ్మదిగా అతని జీవితంలో ఒక విచిత్రమైన మార్పు వచ్చింది. రోజు కాల్ చేసిన వాళ్ళు మెల్లగా మాయమయ్యారు. రోజు మెసేజ్ చేసిన వాళ్ళు బిజీ అయ్యారు. ప్రతి వీకెండ్ కలిసే ఫ్రెండ్స్ ఒక్కొక్కరిగా దూరమయ్యారు. మొదట అతను చాలా ఏడిచాడు.
(08:17) నాలో ఏదైనా తప్పు ఉందా అని తనని తానే ప్రశ్నించుకున్నాడు. ఒకరోజు అడవిలో ఒంటరిగా నడుస్తూ ఉండగా ఒక వృద్ధుడు కనిపించాడు. ఆ వృద్ధుడు ఒక్క మాట మాత్రమే అడిగాడు. నువ్వు సూర్యుని ఎప్పుడైనా దగ్గరగా చూశవా అతను నవ్వుతూ లేదు అన్నాడు. అప్పుడు వృద్ధుడు చెప్పిన మాట అతని జీవితాన్ని మార్చేసింది. సూర్యుడు ఉదయించినప్పుడు ప్రతి ఒక్కరు అతని వెలుతురుని ఇష్టపడతారు.
(08:43) కానీ మధ్యాహ్నం అతని శక్తి పెరిగినప్పుడు చాలామంది నీడ కోసం వెతుకుతారు. వెలుతురు తప్పు కాదు శక్తి ఎక్కువైంది. అలాగే నువ్వు కూడా నీ ఎనర్జీ పెరుగుతున్నప్పుడు నీ కాన్షియస్నెస్ పెరుగుతున్నప్పుడు నీ దగ్గర నిలబడగలిగేది నిజమైన మనుషులు మాత్రమే మిగిలిన వాళ్ళు సహజంగానే దూరమవుతారు. ఎందుకంటే వెలుతురులో నిలబడడానికి ధైర్యం కావాలి.
(09:08) చీకట్లో దాక్కోవడానికి మాత్రం కారణాలు చాలు. ఆ రోజు నుంచి ఆ యువకుడు ఎవరో వెళ్ళిపోతున్నారని ఏడవలేదు. వెళ్లే వాళ్ళకు చిరునవ్వుతో వీడ్కోలు చెప్పాడు. ఉండేవాళ్ళను హృదయపూర్వకంగా ప్రేమించాడు. ముఖ్యంగా తనని తాను గౌరవించడం నేర్చుకున్నాడు. ఇక్కడే చాలా మంది చేసే పెద్ద తప్పు ఒకటి ఉంది. వాళ్ళు ప్రేమను వెంబడిస్తారు. అప్రూవల్ ని వెంబడిస్తారు. వాలిడేషన్ కోసం జీవిస్తారు కానీ యూనివర్స్ చెప్పేది ఒక్కటే నువ్వు నిన్ను నువ్వు అంగీకరించిన రోజు ప్రపంచం నిన్ను అంగీకరించకపోయినా నీ జీవితానికి ఎలాంటి నష్టం ఉండదు.
(09:41) ఎందుకంటే నిజమైన కాన్ఫిడెన్స్ బయట నుంచి రాదు లోపల పుడుతుంది. నిజమైన పీస్ డబ్బుతో రాదు అర్థంతో వస్తుంది. నిజమైన సక్సెస్ అందరూ చప్పట్లు కొట్టినప్పుడు కాదు నువ్వు రాత్రి ప్రశాంతంగా నిద్రపోయినప్పుడు అప్పుడు వస్తుంది. గుర్తుపెట్టుకో బటర్ఫ్లై గా మారే ముందు క్యాటర్పిల్లర్ చాలా రోజుల పాటు ఒంటరిగానే ఉంటుంది. విత్తనం మహా వృక్షంగా మారే ముందు చీకటి నేలలో ఒంటరిగానే ఉంటుంది.
(10:07) వజ్రం ప్రకాశించే ముందు భూమి లోపల సంవత్సరాల పాటు ఒత్తిడిని భరిస్తుంది. అలాగే నీ జీవితంలో ఇప్పుడు ఒంటరితనం ఉంటే అది నీ ముగింపు కాదు నీ ఎవల్యూషన్ నీ రీబర్త్ నీ హైయర్ వర్షన్ పుట్టుక. కొన్నిసార్లు యూనివర్స్ మన నుండి మనుషులను తీసుకుపోదు. మనల్ని మన నిజమైన దారికి తీసుకెళ్ళడానికి దారి ఖాళీ చేస్తుంది. అందుకే ప్రతి లాస్ వెనక ఒక హిడెన్ బ్లెస్సింగ్ ఉంటుంది.
(10:31) ప్రతి గుడ్ బై వెనక ఒక న్యూ బిగినింగ్ ఉంటుంది. ప్రతి టియర్ వెనక ఒక పవర్ఫుల్ లెసన్ ఉంటుంది. ప్రతి సైలెన్స్ వెనక ఒక డివైన్ మెసేజ్ ఉంటుంది. ఇప్పటివరకు నిన్ను వదిలి వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఒక్కసారి గుర్తు చేసుకో. వాళ్ళు వెళ్ళిపోయాక నువ్వు బలహీనంగా మారావా? లేక మరింత బలంగా మారావా? నువ్వు ఇప్పుడు ఉన్న మనిషిగా మారడానికి ఆ బాధ కూడా ఒక కారణం కాదా అదే యూనివర్స్ యొక్క అద్భుతమైన విధానం అది నీకు కావాల్సింది ఎప్పుడూ ఇవ్వదు.
(10:59) నువ్వు కావాల్సిన వ్యక్తిగా మారే పరిస్థితులను ఇస్తుంది. అందుకే ఇకపై ఎవరైనా నీ జీవితంలో వెళ్ళిపోతే వాళ్ళను ఆపడానికి ప్రయత్నించకు వాళ్ళను ద్వేషించకు వాళ్ళను శపించకు నిశశబ్దంగా ఒక చిరునవ్వు నవ్వు మనసులో ఒక మాట చెప్పు. ఈ ప్రయాణంలో నీ పాత్ర పూర్తయింది. ధన్యవాదాలు ఎందుకంటే నీ జీవితంలో ఉండాల్సిన వాళ్ళను ఎవరూ తీసుకెళ్ళలేరు.
(11:23) ఉండకూడని వాళ్ళను ఎవ్వరూ ఆపలేరు. ఇది రిలేషన్షిప్ రూల్ కాదు ఇది యూనివర్స్ రూల్ కాబట్టి ఈ రోజు నుంచి ఒంటరిగా ఉన్నానని బాధపడకు ఎందుకంటే నువ్వు ఒంటరిగా లేవు నీతో శ్వాస ఉంది నీతో ఆత్మ ఉంది నీతో కాస్మిక్ ఎనర్జీ ఉంది నీతో విశ్వం ఉంది. మరియు గుర్తుంచుకో నువ్వు విశ్వానికి ఎంత దగ్గర అవుతావో అంతగా నీ జీవితంలో శబ్దం తగ్గుతుంది. కానీ అదే సమయంలో నీ జీవితానికి అర్థం పెరుగుతుంది.
(11:50) నీ మనసుకు ప్రశాంతత పెరుగుతుంది. నీ ఆత్మకు శక్తి పెరుగుతుంది. చివరికి ప్రపంచం నిన్ను గుర్తుపెట్టుకునేది నీతో ఎంతమంది ఉన్నారో చూసి కాదు నువ్వు నిజంగా ఎవరిగా మారావో చూసి

No comments:

Post a Comment