ఇదీ... అసలు ప్రేమంటే This is the Real Love
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=H8Yy0z45NUA
Transcript:
(00:00) వెన్ లవింగ్ అదర్స్ ఇస్ ది గ్రేటెస్ట్ వీక్నెస్ ఆఫ్ యువర్ వర్డ్స్ యువిల్ బి ది స్ట్రాంగస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ మళ్ళీ చెప్తానండివెన్ లవింగ్ అదర్స్ ఇస్ ది గ్రేటెస్ట్ వీక్నెస్ ఆఫ్ యువర్స్ యువిల్ బి ది స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ తెలుగులో చెప్పాలి అంటే అందరినీ బ్రేమించడం నీ బలహీనత గనుక అయినట్లయితే టేక్ ఇట్ గ్రాంటెడ్ ఈ ప్రపంచంలో నువ్వే బలవంతుడివి అని అసలు మొదట చూస్తే ఇది కొంచెం విరుద్ధంగా అనిపిస్తుంది కదండీ కన్ఫ్యూజన్ గా కూడా ఉంటుంది.
(00:34) ప్రేమ బలహీనత ఎలా అవుతుంది అదే బలం ఎలా అయితుంది అని చెప్పేసి కదండీ అలాగే ఈ రోజుల్లో చాలా మంది అనుకుంటూ ఉంటారు వేరేవాళ్ళు కూడా నువ్వు చెప్తూ ఉంటారు మనకి అరే నాన్న నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే మోసం చేస్తారురా అలాగే కనపడిన వాడికల్లా నువ్వు సహాయం ఇస్తూ ఉంటే వాళ్ళు నిన్ను అది నీ బలహీనత అనుకొని ఉపయోగించుకుంటూ ఉంటారు.
(00:59) పోనీ మనక ఎందుకు వచ్చిన వాళ్లే అని చెప్పేసి క్షమించామ అనుకో ప్రతి వాడిని వాళ్ళు నిన్ను చులకం చేస్తారు అలాగే ప్రతివాడితో వినయంగా మంచిగా నెమ్మతిగా ఉన్నామఅనుకో వాడు నిన్ను బలహీనుడిని అనుకునే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండాలయ్యా బాబు అని చెప్తూ ఉంటారా లేదా అండి ప్రపంచం కూడా ఏం చెప్తుంటుంది కొంచెం కఠినంగా ఉండవయ్యా బాబు ఎవరిని అంత తొందరగా నమ్మొద్దు అని చెప్తూ ఉంటుంది గా ఒక్కటండి మనకు గనుక స్టెబిలిటీ గనక లేకపోతే అంటే ఇతరుల వల్ల నీ ప్రేమ గనుక మారిపోతే అది ప్రేమే కాదండి నువ్వు అర్థం చేసుకోవడంలో ఎక్కడో లోపం ఉందని అర్థం అండి అంతకంటే ఏమీ లేదు
(01:42) ఒకటి మా అయితే జాలిపడు అంతే తప్ప ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి రావక్కర్లేదు నీ అభిప్రాయాన్ని వ్యక్తపరచక్కర్లేదు ఎప్పుడో తప్పనిసరి అయితే తప్ప ఇక్కడ ఒక విషయం ఉందండి నిన్ను ద్వేషించిన వారిని ద్వేషించడం చాలా సులభం కదా అట్లాగే నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించడం కూడాను చాలా సులభమే కానీ నిన్ను బాధ పెట్టిన తర్వాత కూడాను హృదయంలో ద్వేషాన్ని పెంచుకోకుండా ఉండటం అంటే అదే నిజమైన బలం అండి అదే నిజమైన బలం అసలు ఈ బలం ఉన్నవాడిని జయించడం చాలా కష్టం అండి ఎందుకంటే ఇతనికి ఎక్కడ తగ్గాలో తెలుసు ఎక్కడ నెగ్గాలో తెలుసు
(02:26) ఎక్కడ అనవసరంగా మాట్లాడకూడదో తెలుసు ఎక్కడ నిశశబ్ధంగా వెళ్ళిపోవాలో తెలుసు కాబట్టి ఇతను చాలా బలవంతుడి కింద లెక్కండి అంటే ఇది ఒక విధమైన అద్భుతమైన అంతర్గత శక్తి అందుకే చూడండి ఒక స్థాయికి ఎదిగిన మేధావులని గాని పండితులని గాని జ్ఞానులని గాని వాళ్ళు ఎప్పుడు కూడాను పరిశీలనాత్మకంగా ఉంటారు.
(02:54) ఎంతో మంది వస్తూ ఉంటారు వాళ్ళని చూస్తూ ఉంటారు. వాళ్ళని ఏదో అడుగుతూ ఉంటారు కదా అందరి మాటలు వింటారండి కానీ ఏంటంటే ఏ అభిప్రాయం మనకి రాకుండా ముందు వాళ్ళు అట్లా పరిశీలనాత్మకంగా చూస్తూ అన్ని వింటూ ఉంటారండి తప్పనిసరి అయితే తప్ప వాళ్ళు మాట్లాడరు అన్నమాట ఆ విధంగా సమాజాన్ని ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ నేర్చుకుంటూ ఉంటుంటారండి వాళ్ళు అందుకనే చూడండి [గొంతు సవరించుకోవడం] పండితులు ఎప్పుడనా మాట్లాడినప్పుడు ఒక సమావేశాన్ని ఒక సందర్భాన్ని ఎంచుకునే మాట్లాడతారు అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వాళ్ళు మాట్లాడరండి
(03:39) అసలు ఆధ్యాత్మికంగా గనుక చెప్పాలి అంటే మన అసలు స్వరూపం ఏదన్నా ఉంది అంటే అది ప్రయమేనండి ఇప్పుడు పిల్లవాడు పుట్టంగానే అతనికి ప్రపంచం అంటే ఏమిటో తెలుసా ఏమి తెలియదు కదా అసలు ఎక్కడున్నారో తెలుసా తెలియదు కదా కదా పక్కనఉన్న అమ్మని తెలుసా ఏమి తెలియదు కదా సో అలా ఉండిపోతాడు అన్నమాట ఆకలియతే ఎప్పుడో ఏడుస్తాడు అంతే తప్ప లేకపోతే అలా ఉంటాడు ఏ అభిప్రాయం లేకుండా అలాగే ఉంటాడు ఎవరనా నవ్వితే నవ్విస్తాడు.
(04:11) అంతే కదండీ కానీ అదే పిల్లవాడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెరిగి పెద్దవాడు అయతూ ఉంటే సమాజాన్ని వ్యక్తుల్ని ఎదురుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటే ఇతలో ఉన్న ప్రేరణ ప్రశ్నార్థకంగా మారుతుంది. అంటే మెల్లమెల్లగా ఆవిర అయిపోతూ ఉంటుందన్నమాట. అంతే దాని స్థానంలోనే అరిష్ట వర్గాలు మెల్లమెల్లగా చేరుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటేనండి నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా లేకపోతే అర్థం చేసుకుంటున్నావా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా ఇక్కడ క్లారిటీ రావాలండి అందుకే నేను ఏమంటానఅంటే అందరినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు
(04:57) చాలా తక్కువ మందిని మటుకు ఎన్నుకో వాళ్ళనే ప్రేమించు అని నేను చాలా వీడియోలో కూడా చెప్పానండి నిజమైన ప్రేమలో ఎక్స్పెక్టేషన్ ఉండదు మరే ఉంటుంది నిస్వార్థంగా చేసే సహాయం మాత్రమే ఉంటుందండి ఎవడో వచ్చి ఒకపే కావాలని అడుగుతాడు కానీ నీ దగ్గర అంత డబ్బు లేదు ఒకవే రూపాయలు ఇచ్చి ఇంతకంటే నా దగ్గర లేదయ్యా అన్నామ అనుకోండి ఆ డబ్బులు తీసుకొని అతను వెళ్ళిపోయాడు అనుకోండి మీకు కూడా సంతోషంగా ఉంటుంది.
(05:29) ఇస్తే ఇస్తా లేకపోతే లేదు అంతేగనీ స్థాయికి నుంచి ఇచ్చి అప్పులు చేయాలి కదా మీరు కాబట్టి అతనింటే జాలి ఉంటుంది ప్రేమ ఉంటుంది కానీ నేను ఇందాక చెప్పినట్టుగా ఎక్స్పెక్టేషన్ ఉండదండి అట్లాగే నిజమైన ప్రేమలో కూడా ద్వేషం ఉండదు జాలి ఉంటుందండి జాలి ఉంటుంది నేను హైకోర్టులో ఒకసారి పని చేస్తున్నప్పుడుండి ఒక అడ్వకేట్ చాలా సీరియస్ గా చేస్తున్నాడు.
(05:54) ఆర్డర్ వస్తుందని ఒక ఎక్స్పెక్టేషన్ తో ఉన్నాడు దాదాపు 3పావ ఆర్గ్యుమెంట్ నడిచింది జడ్జ్ గారేమో వింటున్నారు గన ఇంకా ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు ఇతనిలో సహనం నశించింది. కానీ ఒక కంక్లూషన్ కి వచ్చేసాడు ఈయన ఆర్డర్ ఇవ్వడం అని చెప్పేసి ఆ కోపంలో అతను ఈ పేపర్లో పెట్టుకోవడానికి ఉండే చిన్న చిన్న పోడి లాగా ఉంటుందండి చిన్న టేబుల్ లాగా ఆ కోపంలో అది కోర్ట్ని మర్చిపోయి అతను జడ్జి గారిని మర్చిపోయి దాన్ని ఇసిరేసాడండి కాకపోతే ఆయన తగలలేదు అనుకోండి ఆయన ఏం మాట్లాడకుండా కోర్టు దిగిపోయాడు మళ్ళీ పావండ తర్వాత వచ్చి కూర్చున్నాడండి నేను లంచలో అడిగాను సరే ఏంటి సార్ ఎప్పుడు
(06:37) జరగలేదు ఇది కోపంతో అలా ఇసిరేయడం ఏంటి మీకు తగిలిఉంటే ఏమయఉండేది అని అడిగానండి నేను సరే జడ్జి గారు ఏమన్నారంటే ఒకటయ్యా ఎవరి కష్టాల్లో వాళ్ళు ఉంటారు మనం అందరినీ కూడాను సమదృష్టితో చూడాలి ఒక బలహీనతకు లోబడి ఆయన ఏదో నా మీద విసిరేశాడు. అట్లా అని చెప్పేసి నేను ఆర్డర్ ఇవ్వను పో అని అనగలమా హాయిగా వింటాము మనకు తోచింది ఏదో ఆర్డర్ ఇస్తాము అంతే తప్ప దాన్ని మనిషి మనసుకు పట్టించుకుంటే ఎలాగయ్యా అలా గనుక పట్టించుకుని అయితే పట్టించుకున్నట్టయితేనే నేను స్థాయికి వచ్చేవాడిని అని అన్నాడండి దాదాపు ఐదు నిమిషాలు మాట్లాడాడు. నాకు అనిపించింది
(07:21) ఎంత సయ్యమనం అని దాంట్లో తెలియని ఒక అంతర్లీనంగా అందరినీ ప్రేమించే తత్వం అనటమో కాదో నాకు తెలియదు కానీ సమదృష్టితో చూసే ఒక గొప్ప సద్గుణాన్ని నేను కనుగొన్నానండి ఆయనలో అదన్నమాట అట్లాగే మీతో మాట్లాడుతుంటే నాకు ఇంకో విషయం గుర్తుకొస్తుంది ఏంటంటే గొలగమూరు వెంకయ్య స్వామి నెల్లూరు దగ్గర ఆయన ఒక పెద్ద ఆశ్రమం ఉందనుకోండి ఆయన ఏదో తత్వాలు పాడుకుంటూ ఉంటాడు ఎవర ఏనా వినడానికి వస్తే వాళ్ళక చెప్తూ ఉంటాడు.
(07:52) ఒకసారి ఒకతను అలా పోతూ ఈ పిచ్చిముండ కొడుక్కి ఏం పని లేదు ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు అందరికీ అన్నాడండి ఈ పదమే వాడాడు. ఎవరైతే ఈయన మాటలు శ్రద్ధగా వింటున్నారో ఆయన బాధపడి ఏంటి స్వామి ఈయన ఇలా మిమ్మల్ని దూషిస్తూ వెళ్ళిపోయాడండి అని అడిగితే ఆ గొలరు వెంగే స్వామి గారు ఆయన అవదూతండి ఆయన ఏమన్నాడఅంటే ఆయన అన్నందుకు నేను బాధపడలేదయ్యా కానీ ఇంత దుమ్ము నెత్తి తినేసుకుంటూ పోతున్నాడు ఏమిటి వచ్చే జన్మలో ఏమైపోతాడయ్యా ఏమో అని చెప్పి బాధపడ్డాడండి దాంట్లో జాలి ఉంది అతని మీద పెద్దో గొప్ప ప్రేమ కూడా ఉందండి అంటే చూడండి ఇటువంటి స్థాయికి చెందిన వ్యక్తుల్లో
(08:37) ప్రేమ ఎట్లా ఉంటుందంటే సమదర్శనంగా ఉంటుందండి సమదృష్టితో ఉంటుంది. మీరు భగవద్గీతలో మీ అందరికీ ఒక శ్లోకం గుర్తుండే ఉంటుంది కదండీ విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిశైవ స్వపాకేచ పండిత సమదర్శనః అని అంటే ఒక బ్రాహ్మణుడు అంటే ఒక బ్రహ్మజ్ఞాని అందులోను విద్యా వినయం ఉన్నవాడు ప్రపంచంలో అన్ని రకాల జీవులను కూడాను సమభావనతో చూస్తాడు అని చెప్పేసిండి మనమేదో కేవలగా తీసుకుంటాము ఆ శ్లోకాన్ని అలాగే అలాగే ఆవును ఏనుగును కుక్కను చండాడను కూడాను సమదృష్టితో చూస్తారు.
(09:20) ఇప్పుడు చూడండి ఆవు ఉత్తమ జీవి కదా ఏనుగు మధ్యమ జీవి అలాగే కుక్క చండారుడు కొంత అధమజీవిండి ఆవుని మనం చాలా పవిత్రతగా చూస్తాం హిందువులుగా కదా ఏనుగు చూడండి ఎంత బలం ఉన్నా కూడాను తన పని అది ప్రశాంతంగా చూసుకుంటూ ఉంటుంది. కదా ఊరేంపులో మనం ఏం చేస్తాం ఎనుమనే వాడతాం కదా కుక్కని వాడాం కదా [నవ్వు] [ఆశ్చర్యం] అట్లాగే కుక్క దగ్గరికి వచ్చేటప్పటికి దానికి విశ్వాసం కూడా ఉంటుంది.
(09:50) చండాలు ఉన్నాడు మనఅందరికీ తెలుసు ఆ వెలివేయబడిన వ్యక్తి సమాజ అంతా అతను తప్ప ఒప్ప అనేది మనక సబ్జెక్ట్ కాదండి ఇక్కడ సో పండితా సమదర్శన అంటే ఏంటంటే అన్ని ప్రాణంలో ఉన్నది ఆత్మే అది ఒక స్థాయికి చెందిన వ్యక్తి నేను ఇందాక అన్నట్టుగా సమదృష్టితో ఉంటాడండి అసలు సమదృష్టి ఉన్నవాడే పండితుడు అతనికి చదువు ఉన్నా లేకపోయినా కూడా పర్వాలేదు ండి ఈ సమదృష్టి లేని వారికి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా వేస్టే అంతేనండి దృష్టి కూడా మూడు రకాలుగా ఉంటుంది నేను నోట్స్ రాసుకుంటాను అంటే నాకు ఈ పాయింట్ తెలిసింది. ఒకటి ఏంటంటే దేహ దృష్టి రెండు
(10:34) మనో దృష్టి మూడు ఆత్మ దృష్టి ఈ ఆత్మ దృష్టిలోనే పండిత వర్గం ఉంటుందండి. నా చిన్నప్పుడు మా ఊరికి వెళ్ళినప్పుడు అలా నేను ఊరు బయటికి వెళ్ళేవాడినండి మా వ్యక్తులతో ఈ గ్రామంలో బెచ్చనఎత్తుకొని దూరంగా పాడుపడిన సత్రాల్లోకి వెళ్లి అంటే ఊరవతలు వెళ్లి వాళ్ళు తింటుంటారున్నమాట అక్కడ వాళ్ళతో పాటు కుక్కలు కూడా ఉంటూ ఉంటాయి. వాళ్ళ వచ్చిన దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే కొంత భాగాన్ని పక్కనే పెడతారు.
(11:05) పిలిచి ఆ పెట్టే ఆ కుక్కని పిలుస్తారు ఆ కుక్కలేమో వీళ్ళ పక్కనే వచ్చి కూర్చొని హాయిగా తింటూ ఉంటాయండి. వీళ్ళు కూడా అన్ని తింటూ ఉంటారు. [నవ్వు] [ఆశ్చర్యం] వీళ్ళు కూడా ఒక విధంగా చెప్పాలి అంటే సమదర్శకులుండి పండితులు కాకపోవచ్చు కదా మన హృదయం ఎంత గొప్పదో చూడండి మీరు మాట్లాడుతూ ఉంటే ఇటు భగవద్గీత ప్రశక్తి నేను తీసుకొచ్చాను కాబట్టి కృష్ణుడు కూడాను సామాన్యుడు స్థాయికి దిగివచ్చి అర్జునుడికి చెప్తాడండి ఏమనింటే యుద్ధం అనివార్యమైంది వాళ్ళు వీళ్ళని చూస్తే ఎలాగ నువ్వు నీ స్వధర్మం ఉంది కదా [గొంతు సవరించుకోవడం] దాన్ని మానవాళ యొక్క ప్రయోజనానికి
(11:48) వినియోగించు అసలు నేను వచ్చింది అందుకే అని చెప్తాడండి యదా యదాహి ధర్మస్య జ్ఞానిర్భవతి భావతారమ ధర్మస్య శ్లోకం ఉంది కదా శ్లోకం ఉంది కదా ద్వాపర యుగంలో కూడాను శ్రీకృష్ణుడు మనందరికీ తెలుసు ఎన్ని అవమానాలు ఎదుర్కున్నాడో కదా అట్లాగే ఎంతమందిని మట్టు పెట్టాడో కూడా మనకు తెలుసు కానీ బేసికల్గా గనుక కృష్ణుడి క్యారెక్టర్ ని గనక మనం చూసినట్లయితే అందరినీ ప్రేమించాడండి బలహీనుడు కాలేదు అంటే ఆ కృష్ణ తత్వమే మనలో ఉండాలంటే ఏం చేసాడు శ్రీకృష్ణ భగవానుడు ప్రేమతో ధర్మాన్ని కాపాడాడు అర్జునుడికి ధైర్యాన్ని ఇచ్చాడు అధర్మాన్ని
(12:33) ఎదుర్కొన్నాడు కదా ఇప్పుడు శ్రీకృష్ణుడు [గొంతు సవరించుకోవడం] అర్జునుడితో అందరినీ ప్రేమిస్తాను అంటున్నావు అర్జున అయితే యుద్ధం మానేసేయ అని అన్నాడా అనలేదు కదండ అందరినీ సమదృష్టితో చూస్తూ యుద్ధం చెయ్ అలా ధర్మాన్ని కాపాడు అట్లాగే నువ్వు కూడా నీ స్వధర్మాన్ని కాపాడుకో అంతే తప్ప ఈ కురుక్షేత్రం నుంచి యుద్ధం నుంచి పారిపోతాను అంటావ ఏమిటి అని అన్నాడు కదండి ప్రస్తుత యువత చూడండి ఎలా ఉందో అంటే వీళ్ళందరికీ కూడాను చెప్పేవాళ్ళు లేఖనా లేకపోతే అసలు వాళ్ళు వినటం లేదో నాకు తెలియదు కానీ చాలామంది గర్ల్ ఫ్రెండ్ మాట్లాడకపోతే
(13:19) దుఃఖించేస్తారు. ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు హత్యలు కూడా చేసేస్తున్నారు. బాయ్ఫ్రెండ్ మాట్లాడకపోతే టెన్షన్ పడిపోతున్నారు వాళ్ళు కదా ఇక్కడ బుద్ధుడు ప్రసక్తి విరాన్ని మనం పట్టుకు రావాల్సిందేనండి తప్పదు బుద్ధుడి యొక్క చరిత్ర గనుక చదివినట్లయితే ఆయన దృష్టించిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఆయన కోపం రాలేదు.
(13:42) ఏమయ్యా అంత బలిష్టంగా ఉన్నావు ఏంటి వీళ్ళు అడుక్కు తింటావ ఏంటి అని అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడలేదండి ఆయన శిష్యుల్లో ఉన్న ఒక సీనియర్ శిష్యుడు అడిగాడు ఏంటి స్వామి మీరేం మాట్లాడరు అని ఆయన అలా నవ్వురుకున్నాడండి నవ్వురుకున్నాడంటే ఒక స్త్రీ అంటే ఒక యువతి నీళ్ళలో పడిపోతే ఆమెని రక్షించే ప్రయత్నంలో ఈయన కూడా నీళ్ళలో దిగి ఆ తడి వస్త్రాలతో ఉన్న స్త్రీని భుజం మీద వేసుకొని ని ఒడ్డున దింపి రక్షించాడండి [నవ్వు] శిష్యులందరూ ఆశ్చర్యపోయారు.
(14:16) మనందరం కూడా సన్యాసులం కదా [గొంతు సవరించుకోవడం] ఏంటి ఈయన ఎలా చేశడు అని చెప్పేసి అక్కడ ఆయన మనో వికారాలకు పోలేదండి ఆయన చూసింది ఒకటే ఆ స్త్రీలో కేవలం ఆత్మనే చూశడండి. అసలు గౌతమ బుద్ధుడుకి ఈ పరివర్తన రావడానికి ముందు ఒక సండం జరిగింది మీ అందరికీ తెలుసు అడవిలో భార్యత నిద్రిస్తున్నప్పుడు ఆయనక ఎందుకో జ్ఞానోదయం అయిందంట సుధోధనుడు జ్ఞానోదయం అయిపోంగానే లేచాడు పక్కనేమో అందమైన భార్య యశోధర యశోధర అనుకుంటా ఆమె నిద్రిస్తూ ఉంది ఎప్పుడైతే ఆ జ్ఞానోదయం అయిందో ఆయన లేచి వెళ్ళపోయాడు అలా వదిలేసి
(15:00) ఎందుకంటే మహావాళ్ళకి ఏదో చేయాలి మనం చేయకపోతే ఎలాగని ఇవన్నీ పక్కన పెట్టండి సింపుల్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిందే అదేంటంటే రాళ్ళతో కొట్టబడిన చెట్టు కూడాను సమదృష్టితో ఉంటుందండి కదా [నవ్వు] ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి లౌకిక ప్రపంచంలో ప్రేమించడం అంటే మోసపోవడం కానే కాదు మిమ్మల్ని ఎవరు ఎలా చూస్తారో అన్న దాని మీద నీ ప్రేమ ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆధారపడదు.
(15:34) మీరు ఎలాంటి మనిషో నీకు తెలుసు దాని మీదనే నీ ప్రేమ ఆధారపడి ఉంటుంది. నిన్ను నీవు గనుక సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినట్లయితే నువ్వు ఎవరిని అర్థం చేసుకోలేవు ఈ ప్రపంచంలో ఒకటండి ప్రపంచం లో ఉన్న ప్రతి విషయానికి మనం మారిపోతూ ఉండకూడదండి మారిపోతూ ఉండకూడదు మన ప్రేమతో మనం ప్రపంచాన్ని కొంచెమైనా సరే మార్చగలిగి ఉండాలండి అదే నిజమైన ప్రేమ అర్థం చేసుకునే పరిపక్వత గనుక లేకపోతే కళ్ళబుల్లి కబురులని నమ్మి వాటినే ప్రేమ అనుకుంటే
(16:19) మోసపోవడం మటకు కాయంఅండి ప్రస్తుత యువత ఇక్కడే మోసపోతున్నది అన్నమాట మోసపోతున్నది నా వీడియోలు విన్న తర్వాత నాకు చాలా మంది మహిళలు కూడా ఫోన్ చేస్తున్నారండి. వాళ్ళు కూడాను కొంత ఖేదానికి గురవుతున్నారు. ఒకళ ఇద్దరు లేడీస్ అయితే కొంచెం డిప్రెషన్ లోకి పోయినట్టుగా కూడా అనిపించారు నాకు నేను ఒక విషయం చెప్తానండి ఒక మహిళ ఉంది ఇంట్లో దేనికి లోటు ఉండదు జరుగుబాటుకి అసలు ఇబ్బందే లేదు.
(16:52) భార్య మటుకు సారీ భర్త మెటకు నా జోలికి రావద్దు. నా ప్రపంచంలో నన్ను ఉండని అని అంటాడండి ఒక్కొకసారి భార్య ఇంట్లో ఉందన్న స్పృహ కూడాను అతనికి ఉండదు అంతేనండి కాకపోతే ఏంటంటే పిల్లల పెళ్ళళ్లు చేసేసారు వాళ్ళు బాధ్యతలు కూడాను అయిపోయాయి. ఇక్కడ ఆయన్ని భార్య ఒకసారి అడిగిందట ఏంటయ్యా బాబు ఎప్పుడు నీ ప్రపంచంలో నువ్వు ఉండిపోతావు నేను అంటూ ఒక సహధర్మచారిణ ఉన్నాను కదా అంటే ఆయన ఒక మాట అన్నాటండి ఏంటంటే అసలు సంసార రంజిలో పడి కొన్ని కొన్ని అభిరుచులని నేను చంపుకున్నాను ఇప్పుడు దాన్ని నేను రివైవ్
(17:36) చేసుకుంటున్నాను దయచేసి నా విషయంలో కొంచెం నువ్వు దోకం చేసుకోవద్దు అని ఫ్రెండ్ చెప్పేసాటండి ఈ భార్య ఈ మహాదలి అంతరంగం ఏంటంటే ఇదేం జీవితం బాబు ఇది అసలు జీవితమే నాని వర్రీ అయిపోతున్నదండి. ఇటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు మరి ఇటువంటి కేసులో ఏం చెప్పాలి చెప్పండి భర్తఏమో ప్లాన్ బి ని ఆల్రెడీ సిద్ధం చేసుకొని దాంట్లో దూరిపోయాడు దాంట్లో రమిస్తున్నాడు బయటకి రానంటున్నాడు మరి అటువంటి వాళ్ళ నిజంగా మార్చగలమా మనం చెప్పండి అయితే నేను ఒకటే చెప్పాలనుకున్నానండి అదేంటంటే
(18:22) అమ్మ ఒకటి 60 దాటాయి కదా ఇద్దరికి నువ్వు కూడాను ప్లాన్ నేను ఒకటి సిద్ధం చేసుకో నీ ప్రపంచంలో నువ్వు ఉండు అలా ఉంటున్న కొద్ది మెల్లమెల్లగా ఈ భగవద్గీతను గనుక చాలా జాగ్రత్తగా గనుక నువ్వు చదువుకున్నట్లయితే నువ్వు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే నువ్వు [గొంతు సవరించుకోవడం] కూడాను పండితులలాగా సమదర్శనిగా ఉంటూ ఆయనలో ఉండే అవకరాలని సమదృష్టితో చూసే స్థాయికి చేరుతావు.
(18:59) అంటే ఓ బొమ్మ ఒక మాట అన్నానండి అది ఏంటంటే ఆయన ఒక అల్లరి బొమ్మ అనుకోమ్మా కాసేపు అల్లరి చేస్తాడు తర్వాత నిద్రపోతాడు కదా నిన్నేమి కొట్టట్లేదు తిట్టట్లేదు నువ్వు ఏమనా ఖర్చు పెట్టుకుంటాను అంటే పెద్దాయనే [గొంతు సవరించుకోవడం] పట్టించుకోవట్లేదు కానీ ఆయనక ఏంటంటే కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని పట్టుకొని ఉంటున్నాడు ఆయన అది ఏ విధంగా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవు నీ బాధలో ఏమన్నా ఉంది అంటే అసలు నన్ను పట్టించుకోవట్లేదు నాతో మాట్లాడట్లేదు మీరేం పెట్టిన తింటారుగా ఇబ్బంది ఏముంది అని చెబుతూ మీరు కూడాను మీరు ఒక ప్రపంచంలో ఉంటూ ఆయనలో ఉన్న ఇటువంటి అవకరాలు ఏమన్నా
(19:37) ఉన్నాయి అంటే వాటిని కూడా అలాగే చూస్తూ ఉండమా సమదృష్టితో మారితే మారొచ్చు లేకపోతే లేదు ఇంతకంటే ప్రమాదకరమైన పరిస్థితిలో మహిళలు జీవిస్తున్నారు [గొంతు సవరించుకోవడం] అంతే అంతకంటే ఏం లేదు కాకపోతే మీకు ఏంటంటే కొంచెం వ్యక్తిగరం ఎక్కడో తప్పుతున్నట్టుగా అనిపిస్తుందమ్మ అని చెప్పి ఇంక ఒక మాట కూడా చెప్పానండి అదేంటంటే కుండీలో మొక్క చేతిలో పుస్తకం అలాగే బయట సత్సంగం ఇంట్లో ఒకవేళ కుక్క పిల్ల ఉంటే కుక్క పిల్ల ఇవి కాలక్షేపం కావాలమ్మా ఇంతకంటే ఎక్కువ ఆశించొద్దు ఆశిస్తే భంగపడాల్సింది నువ్వే నీ మాటల్లోనే చెప్పావు నీకు ఎన్నో కళలు ఉన్నాయని
(20:16) కదా వాటిని అభివృద్ధి చేసుకోమా నో ఏజ్ ఇస్ రిలేట్ టు స్టార్ట్ జీవితాన్ని ఎక్కడి నుంచయనా సరే ప్రారంభించవచ్చు అంటే కాలు దువి కయ్యానికి దిగటం లేదు కదా ఆయన ఏదో ఆయన లోకంలో ఆయన ఉంటున్నాడు కానీ దాదాపు 57 58 ఏళ్ళు మీరిద్దరూ కలిసి పిల్లని కూడా ఒక స్థాయికి పట్టుకొచ్చారు కదా అని చెప్పి నేను ఆమెని కన్విన్స్ చేయడానికి శత విధాల ప్రయత్నించానండి.
(20:39) ఎందుకంటే ఎక్కువ ఏమ ఆశించద్దమ్మ అని చెప్పానండి నేను ఎంతవరకు కరెక్ట్ గా చెప్పానో నాకు తెలియదు కానీ కొంచం మీరు కూడా ఆలోచించండి అంతేనండి చివరిగా ఒక మాట చెప్తున్నానండి అదేంటంటే బలహీనుడు అయితే ప్రతికారం తెచ్చుకుంటాడు ఇక్కడ ఈ స్త్రీ విషయంలో అది లేదు అసలైన శిసలైన బలవంతుడు క్షమిస్తాడు కానీ జ్ఞాని ఉన్నాడు చూసారా అతను సమదృష్టితో అందరినీ ప్రేమిస్తాడండి అంతేనండి అందుకే అతను సమదర్శనిగా ఉంటాడు సమదృష్టితో ఉంటాడు.
(21:15) ఏ విధమైన వికారాలకి లోను కాడండి. ఈ స్థాయిలో ఉండడానికి గనుక మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనం కూడాను ప్రవర్తించామ అనుకోండి ఒక విధంగా మనలో ఒక తెలియని ప్రేమ అసలు శిసలైన ప్రేమ మెల్లమెల్లగా మొగ్గ తొడుగుతూ ఉంటుందండి. సో ఇదండి వీడియోలో ఉన్న సంగతి ఇంత ఎఫెక్టివ్ గా చెప్పానో తెలియదు కానీ ఏదో ఉంది అసలు ప్రేమ అంటే ఇది కాదు ఏదో ఉంది అని నాకు అనిపించి సీరియస్ గా నోట్స్ రాసుకొని ఇలాగ మీకు చెప్పే ప్రయత్నం చేశనండి సో ఇదండి ఈ వీడియోలో సంగతి వినందుకు కృతజ్ఞతలు ఈ వీడియో గనుక నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
(21:50) ఎక్కువ మందికి షేర్ చేయండి. నాతో మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండి నా ఫోన్ నెంబర్ 9491063089 బెల్ ఐకాన్ లైక్ బటన్ మీరు ఇటు నొక్కుతారు నొక్కుతూనే ఉన్నారు నాకు తెలుసండి ఎందుకంటే మీ మీద నాకు అంత గొప్ప నమ్మకం మీకు కూడా నా మీద అంత అభిమానం కాకపోతే చిన్న రిక్వెస్ట్ అండి మంచి మెసేజ్ ని మీరు అనుకున్న శైలిలో పెట్టండి అవసరమైతే ప్రశ్నించండి నేను కూడాను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటానండి సో నమస్కారం
No comments:
Post a Comment