తెలిసితే మోక్షము తెలియకున్న బంధము #yogavasistham
Author Name:TATTWABODHA
Youtube Channel Url:https://www.youtube.com/@Tattwabodha2498
Youtube Video URL:https://www.youtube.com/watch?v=5Azszgj1gRA
Transcript:
(00:01) ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం హరిహి ఓం
(00:48) శ్రీ గురుభ్యో నమః కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం బ్రహ్మ బ్రహ్మమానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్టం సద్గురుం భజే హరి ఓం ఇక వశిష్ట మహర్షి ఒక ముఖ్యమైన విషయాన్ని మనకు ప్రస్తావన చేస్తున్నారండి ప్రతిదీ ముఖ్యమైనదేనండి ఏ వాక్యమైనా మనకు ఉపనిషత్తుల్లో ఉన్న ఏ వాక్యమైనా మహా వాక్యమైనట్లు ప్రతిదీ ముఖ్యమైన విషయమే మనకి యోగ వాశిష్టంలో అందుకే ప్రతిదీ శ్రద్ధగా
(01:33) జాగ్రత్తగా సూక్ష్మ బుద్ధితో గ్రహిస్తూ ముందుకు వెళ్ళాలండి. లేకపోతే సత్యం బోధపడడం చాలా కష్టం సూక్ష్మ బుద్ధి ఉండాలి. ఇక్కడ ఒక మాట చెప్తున్నారండి వశిష్ట మహర్షి రామ ఈ జీవుని వాస్తవ స్వరూపము శుద్ధ చైతన్యమే అని చెప్పుకున్నాం కదా ఈ జీవుని యొక్క వాస్తవ స్వరూపం శుద్ధ చైతన్యం అని చెప్పుకున్నాం కదండీ గత భాగంలో వృత్తి రహితము శుద్ధ తత్వమగు ఆత్మ అదే ఈ జీవుని వాస్తవ స్వరూపం అని చెప్పుకున్నాం కదండీ మనం గత భాగంలో అదే ప్రస్తావన చేసుకున్నామండి సుషుప్తిని ఉదాహరణగా తీసుకొని మనం అక్కడ ప్రస్తావన చేసుకున్నాము సరే ఇంకా చెప్తున్నారండి రమ
(02:19) ఒకే నీరు అనేక తరంగములుగా సుడులుగా బుడగలుగా అనేక రూపములు దాల్చి వచ్చి గమనించావా ఇప్పుడు మనం చూస్తే సముద్రంలో అదే కదండీ మీరు సముద్రంలో చూడండి సముద్రాన్ని గమనించండి. ఒకే నీరు మనకి తరంగాలుగా ఉన్నదే అదే సుడుగుండాలుగా సుడులుగా ఉన్నదే అదే ఆ నీటిలో బుడగలు ఉంటాయి కదండీ ఆ సముద్రపు నీరు ఒడ్డుకి వచ్చి తగిలినప్పుడు అలా ఒడ్డుకి వచ్చి తగిలినప్పుడు అక్కడ నూరగాలుగా ఏర్పడుతుంది కదండీ నీటి బుడగలు ఏర్పడతాయి ఆ నీటి బుడగలుగా ఉన్నది ఆ నీరే ఒకే నీరు ఎన్ని రకాలుగా ఉంటాయో నువ్వు గమనించావా ఇది మనం గమనించవచ్చు అండి సముద్రం దగ్గరికి వెళ్తే మనం గమనించవచ్చు
(03:06) అదేవిధంగా చైతన్యమే సంకల్ప వికల్పాది నానావిధ భ్రాంతులతో జగత్తు రూపమున ప్రతిభాసితమ అగుచున్నది అంటున్నారు ఇది చాలా గొప్ప మాట అండి ఇది అందుకే మనకి ఆ చైతన్యాన్ని సముద్రంతో పోలుస్తారండి చిరాకాశాన్ని మనము అర్థం చేసుకోవడానికి సముద్రంతో పోలుస్తారు. సత్యాన్ని అర్థం చేసుకోవడానికి సముద్రం అనేది అద్భుతమైన ఉదాహరణ అండి భగవంతుడు సముద్రాన్ని అందుకే సృష్టించారు కాబోలు ఎందుకంటే సత్యం చాలా తేలిగ్గా అర్థమైపోతుంది సముద్రాన్ని అర్థం చేసుకుంటే ఏం చెప్తున్నారు ఇక్కడ చైతన్యమే
(03:55) సంకల్ప వికల్పాది నానావిధ భ్రాంతులతో జగత్తు రూపము ప్రతిభాసితమగుచున్నది అంటున్నారు అందుకే చూడండి సంకల్పమే జగత్తు అండి ఈ జగత్తు సంకల్ప రూపంగా మనకు అనుభవానికి అందుతూ ఉంటుంది. సంకల్పం అంటే ఆలోచన అండి ఒక థాట్ వృత్తి రూపంగానే మనకి ఈ జగత్తు అనుభవానికి అందుతూ ఉంటుంది. వృత్తి రూపంగానే ఈ జగత్తు ఉన్నదండి సంకల్ప మాత్ర జగత్తు ఇది ఇదం జగత్ సంకల్ప మాత్రం ఈ జగత్తు సంకల్ప మాత్రం అండి అంతే సంకల్ప మాత్రంగా ఈ జగత్తు మనకు అనుభవం
(04:42) అవుతూ ఉన్నదండి అందుకే మనకి భగవాన్ రమణ మహర్షి కూడా ఒక మాట అంటారండి హూ యమై నేనెవరు అనే గ్రంథంలో భగవాన్ రమణ మహర్షి ఒక మాట అంటారు. యోగ వాశిష్టం కూడా అదే చెప్తుందండి. జగత్తు అనేది అంటే మనం ఏదైతే చూస్తూ ఉన్నామో ఈ జగత్తు ఈ ప్రపంచం ఈ జగత్తు అనేది తలపుల కన్నా వేరుగా లేదు అంటారు తలపు అంటే ఆలోచన అండి సంకల్పం ఆలోచన ఒక థాట్ జగత్తు అనేది తలపుల కన్నా వేరుగా లేదు.
(05:18) ఎలా చెప్పగలరు అంటే వారే చెప్తారు భగవాన్ రమణ మహర్షి చెప్తారండి. ఇవి మనకి ఉపనిషత్తుల్లో చెప్పిందేనండి మనము ఆల్రెడీ ఇదే విషయాన్ని ప్రస్తావన చేసుకున్నాం ఎన్నో సార్లు ప్రస్తావన చేసుకున్నాము అదే ఇక్కడ ఋషి చెప్తున్నారు మహర్షి భగవాన్ రామ మహర్షి ఏం చెప్తున్నారు అంటే జగత్తు అనేది తలపుల కన్నా వేరుగా లేదు నిదురలో అంటే గాఢ నిద్రని చెప్తున్నారండి సుషుప్తి నిదురలో తలపులు లేవు అక్కడ ఆలోచన లేవు కదండీ వృత్తి రహిత స్థితి కదా నిదురలో తలపులు లేవు జగత్తు లేదు ఇది మనందరికీ అనుభవమే కదండీ ఇదే శంకరాచార్యుల వారు వివేక చూడామలో చెప్పారు మాండూక్
(06:02) ఉపనిషత్ ఇదే చెప్పింది మహాత్ములందరూ ఇదే చెప్పారండి. నిదురలో తలపులు లేవు అంటే అక్కడ ఎటువంటి వృత్తులు సంకల్పాలు ఏవి లేవు అందుకే అక్కడ జాగ్రత్త లేదు. జాగ్రత్తలో అంటే ఇప్పుడు మేలుకొని ఉన్నాం కదండీ ఈ మేలుకొని ఉన్న స్థితి ఈ జాగ్రత్తలో మరియు స్వప్నం అంటే మనం నిద్రలోకి వెళ్ళిన తర్వాత కల వస్తుంది కదండీ ఈ స్వప్నం జాగ్రత్తలోన స్వప్నంలోనూ స్వప్న వస్తే జాగ్రత్త వస్తే స్వప్న వస్తండి జాగ్రత్తలోనూ స్వప్నంలోనూ తలపులు కలవు తలపులు అంటే ఆలోచన అండి థాట్ ఆలోచనలు కలవు కాబట్టి జగత్తు కూడా కలదు మిధురలో తలపులు లేవు జగత్తు లేదు.
(06:53) ఇక్కడ గొప్ప మాట చెప్తున్నారండి మరల ఇది మన నిత్యం అనుభవంలో ఉన్నదేనండి అంటే ఇప్పుడు మనం ఏదైతే ప్రస్తావన చేశాను నేను ఇది మనం ఎన్నో సార్లు ప్రస్తావన చేసుకొని ఉన్నాము. ఇంకా చెప్తున్నారు ఏం చెప్తున్నారు అంటే ఒక గొప్ప మాట అంటారండి సాలె పురుగు సాలెపురుగు ఉంటుంది కదండీ ముండకోపనిషత్తు ఇదే ఉపమానాన్ని చెప్తుందండి ఇప్పుడు ఏదైతే భగవాన్ రమర్షి చెప్తారో అదే ఉపమానాన్ని ముండకు ఉపనిషత్తు చెప్తుంది.
(07:24) అంటే ఈ సృష్టికి పరమాత్మే నిమిత్త కారణం ఉపాదాన కారణం ఈ రెండు కూడా ఆ పరమాత్మే అయింది ఆ పరమాత్మే అయ్యాడు అని చెప్పడానికి ముండకోపనిషత్తు సాలిప్ర ఉదాహరణగా చెప్తుందండి. అందుకే అంటుంది ముండకోపనిషత్తు యతోనాభితే గృహంతేచ అని మీరు చూస్తే చూడండి సాలిపురుగు తనలో నుంచే దారం తీసుకొని గూడు కట్టుకుంటుంది. ఇక్కడ అదే చెప్తున్నారు భగవాన్ రమ మహర్షి కూడా సాలిపురుగు తనలో నుంచే దారాలను బయటకి తీసి గూడు అల్లి మరలా దానిని తనలోకే తీసుకున్నట్లే అంతే కదండీ సాలిపురుగు దారాలని ఎక్కడ నుంచి తీస్తుందండి తనలో నుంచే కదా అందుకే
(08:10) ఊర్ణనాభి అనే పదాన్ని ముండకపోపెత్తి వేసింది. అంటే సాలిపురుగు తనలో నుంచే దారాలను బయటకి తీసి గూడు అల్లి మరలా దానిని తనలోనికి తీసుకున్నట్లే మరల ఆ దారాలు ఉంటాయి కదండీ దాన్ని తనలోకే తీసేసుకుంటుందండి. తనలోకి తీసేసుకున్నట్లే అందుకే పరమాత్మ తన నుంచే సృష్టి ఈ సృష్టిని వ్యక్తపరిచి తనలోకే లయం చేసుకుంటాడు అని చెప్పేసి గొప్ప ఉపమానంగా మనకి మన నిత్యం మన ఇంటిలో కనిపించేదేనండి సాలిపురుగు సాలిపురుగు ఆ గూడు నిత్యం మన కంటి ముందు కనిపించేది కానీ మనం పరిశీలించము మనం అసలు గ్రహించము విచారణ
(08:54) చేయము ఋషులు పరిశీలించి విచారణ చేసి మనకి సత్యాల్ని గ్రహించడానికి కి వాటిని అందించారు. నిత్యం సత్యం మన కంటి ముందే ఉన్నదండి. కానీ మనం అసలు విచారణ చేయము అందుకే ముండకోపనిషత్తు ఈ ఉపమానాన్ని ప్రస్తావన చేసింది. ఇప్పుడు మనం ఏదైతే ప్రస్తావన చేసుకున్నామో దాన్ని ముండకోపని చెత్త మనకు ప్రస్తావన చేసింది. యతోనాభి సృచతే గృహంతేచా అని ఇక చెప్తున్నారు భగవాన్ రమణమష అదే విషయాన్ని ఇక్కడ అలాగే మనసు తనలో నుంచి ప్రపంచాన్ని బయటకి నిర్మించి మరలా తనలోనికి ఉపసంహరించుకొని మరుగుపరుస్తుంది అంటున్నారండి మనసులోనే ఉన్నదండి
(09:39) మనం ఈ మనసు గురించి ఎంతో చెప్పుకున్నామండి గత భాగాల్లో చాలా విస్తారంగా చెప్పుకున్నాం మనసు ఆత్మ నుంచి బహిర్ముఖమైనప్పుడు అంటే బయటకి కదలినప్పుడు ఇప్పుడు గాఢ నిద్రలో నిశ్చలంగా ఉన్న స్థితి కదండీ అది ఒక చలనం వచ్చింది ఒక స్పందన వచ్చింది ఒక కదలిక వచ్చింది అది మనసఅయింది అది బహిర్ముఖమైనప్పుడు ప్రపంచంతో వస్తుంది అంతే కదండీ ఇప్పుడు మీరు జాగ్రత్తలోకి వచ్చినప్పుడు ఈ ప్రపంచం అంతా మీ అనుభవానికి అందుతూ ఉంది బాడ నిద్రలో లేదే ఆ కారణంగా జగత్తు కనబడినప్పుడు స్వరూపం తోచదు స్వరూపం ప్రకాశించినప్పుడు ప్రపంచం తోచదు.
(10:18) అది ఇది మనకి సాలిపురుగుని ఉదాహరణగా చెప్పారండి సాలిపురుగు తనలో నుంచే దారాలను బయటకు తీసి గూడు వల్లి మరలా దానిని తనలోనికి తీసుకున్నట్లే మనసు తనలో నుంచి ప్రపంచాన్ని బయటకు నిర్మించి మరలా తనలోనికి ఉపసంహరించుకొని మరుగుపరుస్తుంది అంటారండి. పూరామయలో భగవాన్ రామ చెప్తారు నేను ఎవరిలో సరే ఇక విషయంలోకి వెళ్తే వశిష్ట మహర్షి చెప్పిన దాన్ని మనం వివరించుకోవడానికి మనం ఈ విషయాన్ని ప్రస్తావనం చేసుకున్నామఅండి ఇంకా చెప్తున్నారు భగవాన్ వశిష్ట మహర్షి అద్దంలో ఎదురుగా ఉన్న దృశ్యం ఇప్పుడు ఒక అద్దం ఉన్నదండి ఆ అద్దంలో ఎదురుగా ఉన్న ఒక
(11:03) దృశ్యం అనేది దాని యొక్క రిఫ్లెక్షన్ అనేది అద్దంలో పడుతుంది కదండీ దాని యొక్క ప్రతిబింబం ఇప్పుడు మీరు అద్దం ఎదురుగా నిలబడితే మీ యొక్క ప్రతిబింబం అద్దంలో పడుతుంది ఒక పెద్ద కొండ మీద ఊరు బయట ఉండే ఒక పెద్ద కొండ మీద ఒక పెద్ద మీర [నవ్వు] ఒక దర్పణాన్ని ఉంచితే ఆ గ్రామం అంతా ఆ పట్టణం అంతా అడ్డంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది.
(11:26) దీనికి మనకి శంకరాచార్యులు ఎవరో గొప్ప శ్లోకం చెప్తారు దక్షిణామూర్తి సూత్రంలో మొదటిది అదేనండి విశ్వం దర్పణ దృశ్యమాన నగర తుల్యం నిజాంతర్గతం పశ్యత్మని మాయ బహిరద్భూతం యధానిద్రయ యసాక్షత్కుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమదం శ్రీ దక్షిణామూర్తే అంటారండి అద్భుతమైన శ్లోకం ఇది ఇప్పుడు ఏదైతే వశిష్ట మహర్షి చెప్పారో అదేనండి అర్థంలో ఎదురుగా ఉన్న దృశ్యం ప్రతిభాసం అగునట్లు దీనికి చూడండి శంకరాచార్యుల వారు చెప్పారు ఒక పెద్ద అద్దాన్ని ఊరు బయట ఒక పర్వతం మీద ఉంచామ అనుకోండి ఉదాహరణకి ఆ పట్టణం అంతా దాంట్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది కదా
(12:12) వాస్తవానికి ఆ పట్టణం ఎక్కడ ఉన్నది ఆ పట్టణం అడ్డంలో ఉన్నదా లేదు అది బయట ఉన్నది దానిలో ప్రతిబింబిస్తూ ఉన్నది. అలాగే ఈ జగత్తు ఈ విశ్వం ఈ దృశ్యం అంతా ఎక్కడ ఉన్నది మీ లోపల ఉన్నదండి కానీ బయట ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. మీ లోపల సంకల్ప మాత్రంగా ఉన్నది అది బయట ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఎలా యథా నిద్రయ అంటారండి శంకరాచార్యుల వారు ఇప్పుడు నిద్రలో మీరు కలగంటున్నారు.
(12:47) స్వప్న ప్రపంచం అది ఎక్కడ జరుగుతున్నది ఎక్కడ ఉన్నది మీ మనసులోనే కానీ బయట ఉన్నట్టు మీకు అనుభవం అవుతూ ఉన్నది. అందుకే మనకి శంకరుల స్వప్నాన్ని ఇక్కడ మరొక ఉదాహరణగా స్వప్నాన్ని చెప్తారు. స్వప్నము నాలోనే స్ఫురిస్తూ ఉంటుంది నాలోనే ఉండి కానీ బయట ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఎక్కడ జరుగుతూ ఉంటుంది నాలోనే నా మనసులోనే అందుకే మహాత్ములందరూ ఇదే సత్యాన్ని చెప్పారండి మహాత్ములందరూ ఇదే సత్యాన్ని మనకి స్పష్టంగా చెప్పి ఉన్నారు.
(13:30) స్వప్న ప్రపంచం ఎలాగైతే నాలో స్ఫురిస్తూ ఉన్నదో అలాగే జాగ్రత్త ప్రపంచం కూడా మాయ చేత నాలో కల్పించబడి ఉంటుంది అంటారు వ్యాసుల వారు ఇక్కడ అదే చెప్తున్నారండి వశిష్ట మహర్షి కూడా అద్దంలో ఎదురుగా ఉన్న దృశ్యము ప్రతిభాసం అగునట్లు అద్దంలో ఎదురుగా ఉన్న దాని యొక్క ప్రతిబింబం రిఫ్లెక్షన్ పడుతుంది కదండీ అలాగే చైతన్యము నందే సంకల్పమ మాత్రంగా ఈ దృష్టి జగత్తు స్ఫురిస్తుంది.
(14:03) సంకల్ప మాత్ర జగత్తు అండి ఇప్పటిదాకా మనం ప్రస్తావన చేసుకున్నది అదే చైతన్యము నందే సంకల్ప మాత్రంగా ఈ దృష్టి జగత్తు స్ఫురిస్తూ ఉన్నది. ఈ జగత్త అంతా భావన మాత్రం అండి మొత్తం భావనలే అంతా మన భావనేనండి అందుకే అంటారు ఇంకా ముందు ముందుకు వెళ్తే లోతైన మాటలు చెప్తారండి వశిష్ట మహర్షి మనము ఒక మాట అంటారండి మనకి మీకు ముందు ముందు భాగాల్లో వస్తుంది ఉత్పత్తి ప్రకరణంలో ఈ దృశ్యం అంటే మన కంటికి కనిపించేది ఇది నిజంగా ఉన్న పక్షంలో ఒకవేళ అది నిజంగా ఉన్నట్లయితే అంటే ఇతనికి సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ ఉన్నట్లయితే దృశ్యం నిజంగా ఉన్న పక్షంలో ఏం చేసినా అది
(14:49) నశించదు. ఎందుకంటే ఎందుకు ఎందుకు అంటే అసత్తుకు సత్తు గాని [నవ్వు] సత్తుకు అభావం గాని ఉండవు అంటారు. అసత్తు అంటే లేకపోవడం సత్తు అంటే ఉండడం లేనిది ఉండడం గానీ ఉన్నది లేకపోవడం గానీ అసలు ఎప్పుడూ ఉండవు కాబట్టి ఈ దృశ్యం గనుక నిజంగా ఉన్నట్లయితే ఇది ఏం చేసినా నశించదు అంటారు దృశ్యమే సత్యమైతే అది ఎన్నటికీ నశించదు. ఒకవేళ తపస్సు చేత జపం చేత ధ్యానాల చేత దృశ్యాన్ని నశింపచేద్దాము అని అనుకునేవారు అజ్ఞానులు మాత్రమే అంటారండి ఇదే యోగ
(15:34) వశిష్టంలో ఉత్పత్తి ప్రకరణంలో చెప్తారండి వశిష్ట మహర్షి మళ్ళీ చెప్తానండి ఈ మాట దృశ్యం సత్యమైతే ఒకవేళ ఈ దృశ్యం గనుక సత్యమే అయితే అది ఎన్నటికీ నశించదు ఎందుకంటే అసత్తుకు సత్తు [నవ్వు] గాని సత్తుకు అభావం గాని ఉండవు. ఉన్నది లేకపోవడం గాన లేనిది ఉండడం గాన జరగవు కదండీ కాబట్టి దృశ్యం సత్యమైతే అది ఎన్నింటికీ నశించదు [నవ్వు] తపస్సు ద్వారా జపాల ద్వారా ధ్యానాల చేత ధ్యానాల చేత దృశ్యాన్ని నశింపచేద్దాం అనుకునే వాళ్ళు అజ్ఞానులే అసలు వారికి ఏమి తెలియదు అంటారండి వశిష్ట మహర్షి ఈ విషయం స్వయంగా వారు చెప్తారండి వారి మాటలే నేను వినిపిస్తున్నాను మీకు
(16:18) ఉత్పత్తి ప్రకరణంలో వస్తుందండి ఇంకా ఒక గొప్ప మాట కూడా ఉత్పత్తి పలకరంలో చెప్తారండి ఈ దృశ్య ప్రపంచమే మనస్సు మనసే దృశ్య ప్రపంచం ఈ విషయాన్ని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని పదే పదే ఈ మాట చెప్తారండి ఇదే మాట ఉత్పత్తి ప్రకటనంలో యస్ ఇట్ ఈస్ చెప్తారండి ఈ దృశ్య ప్రపంచమే మనస్సు మనసే దృశ్య ప్రపంచం ఈ విషయాన్ని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటారండి వశిష్ట మహర్షి తామర విత్తనంలో తామర తీగ సూక్ష్మంగా అనిగి ఉండేటట్లు చైతన్య పరమాణువునందు ఈ జగత్తు ఇమిడి ఉన్నది.
(17:05) ఇవన్నీ మనకు చెప్తారండి ఉత్పత్తి ప్రకరణంలో చెప్తారు ఇంకా ఒక లోతైన సత్యం చెప్తారండి అది అది కూడా ఇక్కడ నేను ప్రస్తావన చేసి ముందుకు వెళ్తానండి ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి ఆ ముఖ్యమైన విషయాలు ప్రస్తావన చేసి ముందుకు వెళ్తానండి ఇంకా ఒక గొప్ప మాట అంటారు అక్కడ ఉత్పత్తి ప్రకటనంలో అని అంటారండి మనం ఏదైతే బాహ్యంగా స్థూలంగా ఇంత స్థూల ప్రపంచం ఉన్నది బాహ్య ప్రపంచం ఎలా ఉన్నది అని అనుకుంటారు కదండీ ఒక గొప్ప మాట అంటారండి చిదాకాశంలో శుద్ధమైన మనసులో బాహ్యంలో ఏ ఆకారం లేకుండానే
(17:55) ఈ జగత్తు ఉద్భవిస్తుంది అంటున్నారండి శుద్ధమైన మనసులో బాహ్యంలో ఏ ఆకారం లేకుండానే ఈ జగత్తు ఉద్భవిస్తోంది ఇప్పుడు ఈ జగత్తు బయట ఉందో మీలో ఉందో తెలుసుకోండి ఇంకా ఒక గొప్ప మాట అంటారండి నిజంగా అద్భుతమైన జ్ఞాన రత్నాలుండి ఇవన్నీ అందుకే ఈ గ్రంథము ఇంత గొప్పదండి ఇంకా ఒక గొప్ప మాట అంటారండి తామర పువ్వులో తరువాతి రాబోయే మొక్క యొక్క గింజలు ఉండేటట్లు తామర పువ్వులో తామర పువ్వులో తరువాత రాబోయే మొక్క యొక్క గింజలు ఉండేటట్లు ద్రష్టవందు అంటే చూసేవాడు ద్రష్టవందు ఈ చూడబడే దృశ్యం
(18:41) సూక్ష్మ రూపంలో అంటే సంస్కార రూపంలో వాసనా రూపంలో అనిగి ఉంటుంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏయ అంటే మీ స్వప్నం అండి స్వప్నంలో మీరు చూసే దృశ్యాలు ఆ ప్రపంచం ఉన్నది కదండీ అది ఎక్కడ ఉన్నది మీ మనసులో ఉన్నది ఎలా ఉన్నది వాసన రూపంలో ఉన్నది. ఆ వాసనలే మీకు స్వప్న ప్రపంచంగా వస్తూ ఉంటాయి అదే చెప్తున్నారు అంటే అది అర్థం చేసుకోవడానికి నేను స్వప్నాన్ని చెప్పానండి అదే చెప్తున్నారు ఈ ద్రష్ట యందు ఇక్కడ ఈ జాగ్రత్త ప్రపంచం గురించి మాట్లాడుతున్నారండి స్వప్నం కూడా అదే స్వప్నాన్ని పట్టుకుంటే మనకి తేలిగా అర్థమైపోతుంది ద్రష్ట యందు దృశ్యము ఈ
(19:17) చూడబడేది సూక్ష్మ రూపంలో అంటే సంస్కార రూపంలో సంస్కారం అంటే వాసనలండి ఈ వాసన రూపంలో అనిగి ఉంటుంది. నువ్వుల్లో నువ్వే పువ్వుల్లో వాసన దాగి ఉండేటట్లుగా ద్రష్ట అంటే దృశ్యం ఇమిడి ఉంటుంది. ద్రష్ట అంటే చూసేవాడండి చూసేవాడి అండి చూడబడేది ఇమిడి ఉంటుంది అంటున్నారండి చాలా లోతైన సత్యాలండి ఇవన్నీ కలలో గాని సంకల్పాలలో కానీ మనోరాజ్యంలో కానీ ఏర్పడే పదార్థాలు ఎటువంటివో కల స్వప్న ప్రపంచం కలలో గాని సంకల్పాల్లో గాని ఇప్పుడు మీరు
(20:04) ఏదైనా ఒక గతంలో చూసిన పట్టణం ఉన్నదండి అది ఇప్పుడు మీ మనసులో ఆలోచన రూపంలో కదులుతూ ఉంటుంది ఆ నగరం అంతా మీ సంకల్పాల్లో కదులుతూ ఉంటుంది అదే సంకల్ప నగరం లేదా మీరు ఒక స్వప్నాన్ని చూశారు ఒక స్వప్న ప్రపంచంలో వివహరించారు మేలుకున్న తర్వాత ఆ ప్రపంచం అంతా మీ సంకల్పాల్లో మీ ఆలోచనలో కదులుతూ ఉంటుంది అదే సంకల్ప నగరం ఈ పదార్థాలు ఎటువంటివో అట్లాగే ఇప్పుడు కనిపించే దృశ్య పదార్థాలు కూడా అట్లాంటివేనని నీవు గ్రహించాలి.
(20:32) ఆలోచనల్లోనే పుట్టి తలపల్లోనే పుట్టి పుట్టినటువంటి పిశాచము పిల్లవాడిని చంపడానికి సరిపోయినట్లు ఈ దృశ్య పిశాచి కూడా ద్రష్టను చంపుతుంది అంటారండి చాలా లోతైన మాటలండి ఇవి మనం అక్కడ చర్చించుకుందాము సరే ఇక విషయంలోకి వెళ్దామండి ఇక ఇప్పుడు మన విషయంలోకి వద్దాము ఏం చెప్పారు వశిష్ట మహర్షి అర్థంలో ఎదురుగా ఉన్న దృశ్యము ప్రతిభాసమ అగుచున్నట్లు చైతన్యమునందే సంకల్ప మాత్రంగా ఈ దృశ్య జగత్తు స్ఫురిస్తోంది.
(21:14) అయితే సృష్టికి పూర్వము సృష్టి సమయంలోను సృష్టి లయించినప్పుడు కూడా అట్టి చైతన్యమే సత్యమై నిత్యమై ఉన్నది. అట్టి చైతన్యము దేనికి కారణము గాని కార్యము గాని కాకపోయినప్పటికీ ఈ సృష్టి అనబడే లీలను తన యందు తానే ప్రకాశింప చేయుచున్నది. తన వాస్తవ స్వరూపము శుద్ధ చైతన్యమే అయినప్పటికీ ఏమిటి మనందరి యొక్క వాస్తవ ఆ స్వరూపం ఏమిటండి శుద్ధ చైతన్యమే ఆ గాఢ నిద్రలో సాక్షిగా ఉన్నది కదండీ అదేనండి మీరు ఇప్పుడు గాఢ నిద్రలో ఏమీ లేని దాన్ని కూడా ఆ ఆవరించి ఉన్న
(21:59) అజ్ఞానాన్ని కూడా తెలుసుకుంటూ ఉన్న ఆ చిత్ స్వరూపం ఉన్నది చూసారా అండి ఆ ప్రజ్ఞ తెలివి అదే మీరండి అది మీ యొక్క వాస్తవ స్వరూపం ఆ శుద్ధ చైతన్యం మీరు ఈ జీవుడు చెప్తున్నారండి ఈ జీవుడు తన యందు విచారించిన కారణంగా ఒకానొక అజ్ఞానాన్ని పొందుతున్నాడు. అందుకనే విచారణ కావాలి విచారణ లేకపోవడం వల్ల అజ్ఞానంలో పడుతున్నాడు.
(22:37) తన యొక్క స్వరూపాన్ని మరిచి తాను కానిది తను అని భావించే దుఃఖపడుతూ ఉన్నాడు. ఈ జీవుడు తన యందు విచారించని విచారణ లేకపోవడం చేత అజ్ఞానాన్ని పొందుతున్నాడు. అందుకే అజ్ఞానం ఎలా తొలగిపోతుంది అంటే విచారణ చేత విచారణ వల్ల నీ యొక్క స్వరూప జ్ఞానం నీకు కలుగుతుంది దానివల్ల అజ్ఞానం తొలిగిపోతుంది. నీ యొక్క స్వరూపం నీకు తెలిసి ఆనందంగా ఉంటావు అంతే చెప్తున్నారండి అవిచారంతో కూడిన ఆత్మ అంటే విచారణ లేకపోవడం అండి అవిచారంతో కూడిన ఆత్మ ప్రకృతి అనబడే దృశ్య భావన యంది ప్రవేశించి ఈ జగత్తును సత్యమైన దాని వలె స్పృంప
(23:24) చేస్తుంది. చైతన్య రూపుడగు ఈ జీవుడు ఒకా ఒకానొకప్పుడు [నవ్వు] ఈ దృశ్య విషయమై కొంత విచారణ శీరుడు అవుచున్నాడు. అంటే ఎప్పుడో ఒకానొకప్పుడు ఈ విషయాలకు సంబంధించి దృశ్యాలకు సంబంధించి కొంత విచారణ చేస్తున్నాడు. ఈ దృశ్య వ్యవహారం అంతా నాకు ఎక్కడి నుండి ఎట్లా ప్రాప్తిస్తుంది అసలు ఇంతకీ నేను ఎవరు హూ యమ్ ఐ కోహం అను ప్రశ్నలకు వస్తున్నాడు ఎప్పుడో ఒకప్పుడు విచారణ చేస్తున్నాడు ఏమని అసలు ఈ ప్రపంచంఅంతా ఎక్కడి నుంచి వస్తుంది ఈ దృశ్యమంతా ఈ దృశ్య వ్యవహారం అంతా నాకు ఎక్కడి నుంచి ఎట్లా ప్రాప్తిస్తుంది ఇంతకా అసలు నేను ఎవరు అను ఈ ప్రశ్నలకు
(24:10) వస్తున్నాడు అప్పుడు ప్రయత్నశీలుడై ప్రయత్నం చేసి విచారించి ప్రయత్నం చేసి విచారించి చూచి అంతా గ్రహించిన వాడై జగత్ భావమును త్యజించి వేస్తున్నాడు. ఈ జగత్తంతా భావన మాత్రమ అని చెప్పుకున్నాం కదండీ తన యందే సురిస్తూ ఉన్నది ఈ భావన అంతా ఇతన్నిటిని త్యజించి పరమ మహత్త అంటే గొప్పదైన పరమమైన ఆ ఉత్కృష్టమైన ఆ అత్యున్నత ఆ పరమ పదం ఆ ఆ స్వరూపాన్ని పొందుతున్నాడు పరమ మహత్ రూపమున ప్రకాశించుచున్నాడు.
(24:56) ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తున్నారండి రామ అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కిరటం ఉన్న కిరటం లేకున్నా జలం జలమే కదా ఇప్పుడు సరస్సులో ఒక సరస్సులో ఒక తరంగం లేచిందండి అలాగే ఏ తరంగము లేని సరస్సు ఉన్నది. ఇప్పుడు కెరటం ఉన్నా తరంగం ఉన్నా తరంగం లేకున్నా కానీ అది జలం జలమే కదా తరంగంగా ఉన్నంత మాత్రాన అది జలం కాకుండా పోతుందా తరంగంగా ఉన్న తరంగంగా లేకుండా జలం జలమే కదా అదేవిధంగా ఈ జీవుడు విచారించ విచారించకపోవుటచే జగత్భావం కలిగి ఉండి ఉండవచ్చు
(25:42) అంటే అతడు విచారణ లేకపోవడం వల్ల ఏ జగత్తు సత్యము అన్న భావ కలిగి ఉండి ఉండవచ్చు నేను ఈ దేహము అన్న భావన కలిగి ఉండి ఉండవచ్చు లేదా సర్వ సంకుచిత భావములను త్యజించి వేసి నేను ఈ దేహం కాదు ప్రాణం కాదు నేను సాక్షి చైతన్యాన్ని ఆ శుద్ధ చైతన్యాన్ని అంతటా నిండి ఉన్న నాకు పరిమితి లేదు నేను అంతటా నిండి ఉన్న ఆ మహత్తత్వాన్ని అని తెలుసుకొని ఉండి ఉండవచ్చు తెలుసుకొని ఆత్మానందంలో తేలియాడుచూ ఉండవచ్చు ఏది ఏమైనా ఈ జీవుని వాస్తవ స్వరూపము
(26:28) సర్వదా శుద్ధ చైతన్యమే అయి ఉన్నది సుమా అని చెప్తున్నారండి అతడు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అతను ఎప్పుడు అదే అందుకే మనకి ఉపనిషత్తులు ఇవే చెప్పాడండి గురువు ఉపదేశం చేస్తాడు కదండీ తత్వమసి నువ్వు అదే అయి ఉన్నావు నువ్వు ఆల్రెడీ అదే అదే అయి ఉన్నావు నీకు తెలిసినా తెలియకపో నువ్వు అదే తెలుసుకుంటే ఇక నీకు జన్మ లేదు.
(26:53) తెలియక అజ్ఞానంలో ఉన్నంత కాలం ఈ జన్మలో తిరుగు జన్మ వరంపరలో తిరుగుతూ ఉంటాం అంతే అందుకే అన్నమాచార్యులు వారు ఒక గొప్ప మాట అంటారు తెలిస్తే మోక్షము తెలియకుంటే బంధము కలవంటిది ఈ బ్రతుకు గనునికిని అని గొప్ప మాటఅండి ఇది అందుకే మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మీరు అదే ఆ స్వరూపమే ఎలాగైతే తరంగా ఉన్నా లేకపోయినా నీరే తరంగా ఉన్నా అది నీరే తరంగా లేకపోయినా నీరే తర తరంగంగా ఉన్నది కూడా నీవే ఎప్పుడు ఆ జలమే సత్యం తరంగం ఉన్న తరంగం లేకపోయినా ఆ జలమే సత్యం అలాగే మీకు మీ స్వరూపం తెలియకపోయినా తెలిసినా గాని మీరు ఎప్పుడు ఆ శుద్ధ చైతన్యమే కానీ తెలుసుకుంటే మోక్షము తెలియకుంటే బంధం
(27:38) అంతేనండి. ఇక మిగతా విషయాలు రేపటి భాగంలో తెలుసుకుందామండి హరిహి ఓం ఓం సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతిహి
No comments:
Post a Comment