Siddha Guru krupa ela untundi?
Author Name:GURU SEVA 108
Youtube Channel Url:https://www.youtube.com/@GuruSeva-108
Youtube Video URL:https://www.youtube.com/watch?v=AYHXpXia3a0
Transcript:
(00:00) ణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం సిద్ధ గురుపరంపరకు ప్రణామాలు సమర్పిస్తున్నాను. ఈ ప్రపంచంలో ఏ జ్ఞానం కావాలన్నా లౌకికమైన అలౌకికమైన దివ్య అదివ్య విజ్ఞాన జ్ఞానములు కావాలన్నా గురువు యొక్క కృప అత్యంత ప్రధానమైనటువంటిది మామూలు సామాన్యమైనటువంటి విద్య నుంచి ఆ విద్యామోహితుడైనటువంటి వ్యక్తి విద్యను నిజమైన దానిని తెలుసుకోవడం ద్వారా మాయను జయించి పరమేశ్వర చైతన్యాన్ని పొందగలుగు తాడు దానికి మార్గం
(00:46) నిరంతర ధ్యాన సాధన వల్ల అనంతమైన బ్రహ్మ భావనను చైతన్యాన్ని ధ్యానించటం వల్ల ఆ స్థితికి వెళ్ళగలుగుతాడు. ఈ సాధనకు కావలసినటువంటిది గురు కృప అంతకుముందు ఏ విద్య అయినా సరే అంతకుముందు వాళ్ళు చెప్పినటువంటి దాన్ని ముందు నేర్చుకొని తాను కొత్తది సృష్టించడానికి ప్రయత్నిస్తాడు మానవుడు సమస్త శాస్త్రములు అటువంటివే ఇవాళ ఉన్న సైన్సు డెవలప్మెంట్ అంతా కూడా పూర్వులు సాధించిన విజ్ఞానం దాంట్లో నుంచి తాను నూతనమైనటువంటి వాటిని సృష్టించటం అలానే ఆధ్యాత్మిక రంగం కూడా ఆధ్యాత్మిక రంగంలో మహానుభావులు మహర్షులు అయినటువంటి
(01:31) సద్గురువుల యొక్క కృప ఉంటే ఆ దివ్య నేత్రం తొందరగా వికసించి ఆధ్యాత్మిక జ్ఞానం బాగా లభిస్తుంది. పురాణంలో వ్యాసుడు చెప్పాడు వసుదేవసుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణుని మించినటువంటి జగద్గురువు మరొక్కరు లేరు. ఆ మహాపురుషుడు మానవజాతి ఏ రకంగా నడవాలో ఏ రకంగా ప్రవర్తించాలో ఏ సమయంలో ఏ రకమైనటువంటి స్థితిలో ఉండాలో ఆ ప్రచోదనాన్ని కలిగించడం కోసం అర్జునుని ఒక సాధనంగా ఒక మిషగా చేసుకొని భగవద్గీతను చెప్పాడు ఆయన గీత అనిఅంటే అర్జునుడికి చెప్పినటువంటి ఒక
(02:19) జ్ఞాన సంపద దాంట్లో పైకి కనిపించేది ఏమిటి అంటే యుద్ధం అంటే అక్కర్లేదు అనుకున్నాడు రాజ్యం కావాలనుకున్నారు అన్ని కష్టాలు పడ్డారు చిట్ట చివరి దశలో రాయభారాలు పూర్తఅయినాయి ఇక యుద్ధం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందరినీ ప్రబోధించాడు కృష్ణుడు అంగీకరించారు యుద్ధరంగానికి వచ్చారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః అందరూ యుద్ధం కోరి వచ్చారు సిద్ధమై వచ్చారు కానీ ఎదురుగా ఉన్నటువంటి భీష్ముడు ద్రోణుడు తాత గురువు ఇలాంటి వాళ్ళు బంధువులు అందరినీ చూసిన తర్వాత అయ్యో ఇంతమందిని ఎట్లా చంపుతాను అని అనుకున్నాడు అంటే ధర్మం కంటే దయ ఎక్కువ అనిఅని
(03:07) అనిపించింది ఆయనకు ఆ సమయంలో పెద్దన్నయ్య అహింసయే మదికి సంప్రీతిన్ సమర్ధించే నా ఉద్దేశములు మారే క్రమ్ముకొనెనేవో మోహమేఘమ్ములు ఈ గద్దెల్ మిద్దెలు అశాశ్వతంబులు మిదక్కార్పణ్యముల్ సాలులే వద్దయ్యా పరపక్ష మరణ రణ వ్యాపార పారిణతల్ నేను ఈ గద్దెలు మిద్దెలు ఈ సింహాసనాలు భవనాలు అశాశ్వతం నేను చుట్టాలను బంధువులను గురువులను చంపలేను అన్నాడు అర్జునుడు అంటే అప్పుడు కృష్ణుడు ప్రబోధించాడు నిజమైనటువంటి గురువు అతడికి ఈ సృష్టిలో ధర్మం ప్రధానమైనటువంటిది ధర్మాన్ని మించింది లేదు మిగతా అన్ని గుణాలు కూడా ధర్మం కంటే తక్కువే తన
(03:53) ఆత్మీయుడు దుర్మార్గం చేశడు హత్య చేశాడు కదా అని చెప్పి వాడిని ఉపేక్షించకూడదు దుర్మార్గులను శిక్షించి తీరాల్సిందే అని ఎంతో చెప్పాడు క్లైమం మాస్మగమపార్ధ నైతవయ ఉపపద్యతి క్షుద్రం హృదయ దౌర్బల్యం చట్పోతష్టపరంతప ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి నించో యుద్ధం చెయ్ అన్నాడు అన్నా సరే అర్జునుడికి ఇంకా మనసులో అనిపించడం లేదు ఏం చేయాల నిజమైనటువంటి గురువు ఇక్కడ చేస్తాడు అర్జునుని పరీక్షించాడు అతడు ఇది ఏమాత్రం యుద్ధానికి ఉన్ముఖంగా లేడు అందువల్ల యుద్ధం చేసి తీరాలి అని ప్రబోధించడానికి దివ్యమైనటువంటి శక్తిని ఉపయోగించాడు కృష్ణుడు అంటే ఎలా ఉపయోగించాడు అనిఅంటే
(04:40) మామూలుగా ముందు మంచి మాటలు చెప్పాడు ధర్మాన్ని ప్రబోధించాడు ఇది ధర్మం ఇది నువ్వు చేసి తీరాలి అధర్మపరులను శిక్షించి తీరాలి అన్నాడు అయినా వినలేదు అప్పుడు అంటాడు ఎందుకయ్యా జీవించటం అనేటువంటిది రక్తపు కూడుగాక మన రాజులకు హృతసూపయుక్తము భుక్తి లభించునే విడిచిపుత్తువే ధర్మము ధర్మాన్ని విడిచిపెట్టవద్దు శత్రువులను సంహరించటం దాని గురించి ఆలోచించ వద్దు ఎందుకంటే చచ్చేవాడు ఎవడు బతికేవాడు ఎవడు అన్ని నిర్ణయించేది నేనే ధర్మం నిర్ణయిస్తుంది నేను ధర్మ స్వరూపుడిని నేను ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు యుద్ధం చెయ్ అన్నాడు అన్నా ఇంకా వెనక్కి తీస్తూనే ఉన్నాడు గురువు
(05:22) శిష్యుడికి [గొంతు సవరించుకోవడం] ఏ స్థితిలో ఎంతవరకు అందించాలో అందిస్తూ నెమ్మది నెమ్మదిగా పైకి తీసుకెళ్తున్నాడు అర్జునుడిని యుద్ధం చేయవయ్యా ఏమి మరణిస్తారు మరణిస్తే ఏమైతారు వెళ్లాల్సిన చోటికి వెళ్తారు మళ్ళీ మళ్ళీ వస్తారు మళ్ళీ పుడతారు పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జటరేశయనం అన్నాడు శంకరులు అలా మళ్ళీ పుడతారు మళ్ళీ వస్తారు కర్మానుగుణంగా నడుస్తూ ఉంటారు కనుక మరణాన్ని గురించి బాధపడవద్దు ఆలోచించవద్దు స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయాహః పరధర్మం పనికి రాదు స్వధర్మం చేసి తీరాలి అన్నాడు అయినా సరే ఇంకా అర్జునుడికి ఆ ఉన్ముఖత్వం కలగలేదు అప్పుడు అంటాడు యుద్ధం
(06:05) చెయ్ జితోవా ప్రాప్షసే యహతోవా ప్రాప్షసే స్వర్గం జిత్వా భోక్షసే మహీం గెలిచావా రాజ్యాన్ని అనుభవిస్తావు మరణించావా స్వర్గానికి వెళ్తావు అంటే మరణించడం దేనికి స్వర్గానికి పోవడం దేనికి ఇంతమందిని చంపడం దేనికి అన్నాడు అంటే అప్పుడు అన్నాడు అసలు నువ్వు చంపేది ఏమిటయ్యా వీళ్ళందరినీ నేనే చంపాను నువ్వు నిమిత్త మాత్రంగా ఉండు మయేవేతే నిహతా పూర్వమేవా నిమిత్త మాత్రం భవసాచిన్ నువ్వు నిమిత్తమాత్రుడివికా వీళ్ళందరినీ నేనే చంపాను అన్నాడు యుద్ధం మొదలుగా లేదు అందరూ ఎదురుగా ఉన్నారు వీళ్ళందరినీ నేను చంపాను అంటాడు మయాహతాం త్వాంజహిమాయధిష్టాహ
(06:46) యుదస్వజేతశరణేసపత్రం ఇక్కడ ప్రధానమైనటువంటి గురువు యొక్క శక్తి గురు కృప ఎలా ఉంటుందో ఈ వాక్యంలో కనిపిస్తుంది భగవద్గీతలో మనకు దీంట్లో ఏమంటున్నాడు అంటే నువ్వు చంపేది ఏమిటి నేను చంపేశను అన్నాడు ఎదురుగా ఉన్నవాళ్ళు ఉండంగా అంటే మానవులకు సూక్ష్మ దేహం స్థూల దేహం రెండు ఉంటాయి పైకి కనిపించే స్థూల దేహం ఒకటి సటిల్ బాడీ లేక ఆస్ట్రల్ బాడీ అని అంటారు ఇంగ్లీష్లో ఆ సూక్ష్మ దేహాల అన్నింటిని ఖండించాను నేను నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా భీష్ముడు 10 రోజుల్లో కింద పడతాడు ద్రోణుడు ఆ తర్వాత ఐదు రోజుల్లో కిందపడి మరణిస్తాడు అని ఇట్లా ఇవన్నీ చెప్పాడు అప్పటికీ
(07:26) అర్జునుడికి కొంత ఓహో ఇదన్నమాట పరిస్థితి అయినా సరే ఇంకా సందేహిస్తున్నాడు కృష్ణుడు అంటే నమ్మకం భగవంతుడని విశ్వాసం చిన్నప్పటి నుంచి ఉన్నది అయినా సరే అప్పుడు కూడా ఇంకా ఉన్ముఖుడు కాని వ్యక్తికి ఆయన దివ్యమైనటువంటి లోచనాన్ని ప్రసాదించాడు అంటే ఇంతవరకు చెప్పినదంతా ప్రబోధం చెప్పినదంతా ఉద్బోధం కానీ కొంత మార్పు వస్తున్నది రావలసినంత రాలేదు రావలసినంత మార్పు జ్ఞానము శిష్యుడికి రానప్పుడు సద్గురువు దివ్యజ్ఞానం ద్వారా అతడి నేత్రములను వికసింపజేస్తాడు దివ్య నేత్రాన్ని వికసింపజేస్తాడు చేస్తే అప్పుడు కనిపించింది విశ్వ రూప సందర్శనం
(08:10) కృష్ణుడి యొక్క దివ్య రూపం విశ్వరూపం ఎలా ఉన్నదో వీళ్ళందరూ కూడా ఆయనలోకి వెళ్ళిపోతున్నారు అటువంటి స్థితిని చూసిన తర్వాత అప్పుడు ఎప్పుడైతే ఈ దివ్యానుభవం కలిగిందో అప్పుడు మార్పు వచ్చింది అర్జునుడిలో నువ్వు చెప్పినట్టు చేస్తాను అన్నాడు అంటే మనిషిలో మార్పు రావడానికి రకరకాల పరిణామ క్రమాలలో ప్రబోధన చేసి అప్పటికే కాకపోతే సిద్ధుడైనటువంటి గురువు ఆయన శిష్యుడికి తన దివ్య శక్తి ద్వారా దివ్య జ్ఞానాన్ని అందించి తరుడై అని అంటాం దాన్ని ఓపెన్ చేసి అతడికి దివ్య శక్తి దివ్య జ్ఞానాన్ని ఎప్పుడైతే ప్రసాదించాడో అప్పుడు అర్జునుడు మారాడు అంటే మానవులలో మార్పు రావాలి
(08:51) అనిఅంటే ఇన్ని దశలు ఉన్నాయి ఈ దశలు అన్నిటిలోనూ కూడా ఇవ్వగలిగినటువంటి శక్తి గలవాడు గనుక జగద్గురువు అయినటువంటి కృష్ణుడు ఆ రకంగా చేశాడు వైష్ణవ ఆచార్యులు రామానుజాచార్యుల వారి జీవితంలో కూడా ఇటువంటి కథే ఒకటి ఉన్నది. ధనుర్దాస్ అన్న ఒక శిష్యుడు ఉన్నాడు. అతడు తన భార్య అంటే ప్రేమ ఆమె నేత్రములు అంటే ప్రేమ ఆమె కళ్ళకు ఎండ సోకకుండా ఉండటం కోసం తాను ఆమె గొడుగు పట్టి నడిపిస్తూ ఉండేవాడు పెళ్ళానికి గొడుగు పట్టి నడుస్తున్నాడు వీడు మహావీరుడు వాడు వాడంటే భయం అందరికీ ఎవరేమ అనరు ఒకరోజు రామానుజాచార్యుల వారు దోవలో పోతూ అతన్ని చూశారు అతన్ని
(09:29) పిలవమన్నాడు శిష్యులతో వచ్చాడు గురువుగారు పెద్దవారు మహానుభావుడు పిలిచాడని వెళ్ళాడు. ఏమిటయ్యా నువ్వు ఇట్లా గొడుగుపడుతున్నావు అంటే నా భార్య లోచనములు అందమైనవి ప్రపంచంలో దాన్ని మించింది లేదు అందుకని నేను ఈ రకంగా పడుతున్నాను ఆమె సౌందర్య ఉపాసకుడిని నేను నేత్ర సౌందర్యాన్ని ఉపాసిస్తున్నాను. ఇంతకంటే అందమైన కన్నులు చూపిస్తే ఏం చేస్తావు వాటిని ఆరాధిస్తాను అయితే నాతో రా అన్నాడు.
(09:55) శ్రీరంగేశ్వరుడి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు ఒకసారి అట చూడు శ్రీరంగ నాయకుడిని చూడు అన్నాడు. ఆయన యొక్క దివ్య నేత్రములు సాక్షాత్కరించినవి ధనుర్దాసుకు రామానుజాచార్యుల వారి కరుణ వల్ల లోకాతీత సౌందర్య విభా ప్రభాసిితములైనటువంటి ఆ దివ్య నేనేత్రములను చూచిన తర్వాత అతడికి దివ్య ప్రబోధం కలిగింది ఆనాటి నుంచి అతడి జీవితం మారిపోయింది.
(10:20) అలా మహనీయులైనటువంటి వ్యక్తులు అవసరమైనప్పుడు తమ దివ్యశక్తితో శిష్యులకు ప్రబోధాన్ని కలిగిస్తూ ఉంటారు. జగద్గురువు శంకరాచార్యుల వారు ఆయన కృప అపారమైనది అసామాన్యమైనటువంటిది శిష్యులు చూస్తుంటారు శిష్యులను పరీక్ష చేస్తుంటారు. ఒకరోజు పాఠాలు చెబుతున్నాడు పాఠాలు చెబుతూ ఉంటే ఒక శిష్యుడు రాలే ఆలస్యం చేస్తున్నాడు అవతల ఏదో గుడ్డలు ఉతుకుతున్నాడు గురువుగారివి వాడిని పిలవండి అన్నారు ఆ ఎందుకు లేండి అన్నారు.
(10:47) లేదు లేదు పిలువు వాడు రావాలా అని పద్మవాని పిలిచాడు శిష్యుడిని రారా నాయనా అన్నాడు. వాడు గబగబ అవతల సరస్సుకు అవతలు ఉన్నవాడు నడుచుకుంటూ వచ్చాడు గురుభక్తి వల్ల గురు కృప వల్ల అతడు నడుస్తున్న చోటల్లా కూడా పద్మములు పుట్టినాయి ఆ పద్మముల మీద అడుగు పెట్టుకుంటూ వచ్చాడు గనుక అతన్ని పద్మపాదుడు అని అన్నారు. అలానే మరొక శిష్యుడు కూడా ఎక్కడో దూరంగా ఉన్నాడు నాయనా రా అన్నాడు అతడికి అప్పటికప్పుడు ఛందస్సు వచ్చింది కవిత్వం చెప్పాడు తోటక వృత్తాలలో చెప్పాడు వాడికి ఏం చదువు వస్తుంది లేండి గురువుగారు మాకు పాఠం చెప్పండి అని అంటే శిష్యులకు
(11:23) ధర్మ నిర్ణయం చెయ్యాలా సత్య ప్రబోధన చేయాలి అని ఆ పరమ గురువు ఆ సద్గురువు మహనీయుడు ఆయన తన శిష్యుడికి దివ్య కవిత్వాన్ని ప్రసాదించాడు వాడు తోటక వృత్తాలలో భవ శంకర దేశికమే శరణం అని చెబుతూ ఉంటే అందరూ ఆశ్చర్యపడ్డారు గురుకృపకు శంకరుల వారి జీవితంలో ఇటువంటివి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. మహలీయులైనటువంటి సిద్ధ గురువుల యొక్క కరుణ అటువంటిది అది ఈ దేశం అని కాదు ఆ దేశం అని కాదు ప్రపంచంలో ప్రతి చోట కూడా సిద్ధులైన గురువులు శిష్యులకు ధర్మ ప్రబోధం అవసరమైతే దివ్యశక్తిని వినియోగించి చేసి మానవ కళ్యాణానికి వాళ్ళను నియోగిస్తూ ఉంటారు అటువంటివి ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా
(12:08) జరుగుతూనే ఉంటాయి. అమెరికాలో జరిగిన ఒ చిన్న సంఘటన చెప్తాను గే బల్లార్డ్ అనేటువంటి వ్యక్తి మౌంట్ శాస్తా ప్రాంతంలో ఉన్న గ్రామానికి అధికారిగా వచ్చాడు ప్రభుత్వ ఉద్యోగతను అతడు స్పానిష్ జాతికి చెందినవాడు ఉద్యోగం చేస్తున్నాడు వచ్చాడు. అతడు ఒకరోజు ఆ పక్కన ఉన్న కొండ మీదకి వెళ్దాం సాయంకాలం విహారానికి వెళ్దాం హాయిగా ఉంటుంది అని బయలుదేరాడు.
(12:34) బయలుదేరినటువంటి వాడు కావలసినటువంటి ఏదో కొద్దిపాటి ఆహారము నీళ్ళు అవి మంచి నీళ్ళు తీసుకున్నాడు కాసేపుట్లో కిందకి వస్తాం కదా ఏం పర్వాలేదుని అనుకున్నాడు. పైకి వెళ్ళాడు నడిచాడు నడిచాడు పైకి వెళ్లి కాసేపు వెళ్ళిన తర్వాత అలిసిపోయినాడు మంచి నీళ్లుు తాగుదాం అని ఆ ఉన్న ఆ పాత్రలో ఉన్న నీళ్ళు ఒక గ్లాస్ లో పోసుకున్నాడు ఒక గ్లాసడు వచ్చినాయి అవి తాగబోతూ ఉంటే ఇంతలో ఉన్నట్లుండి అక్కడ ఒక మనిషి కనిపించాడు.
(12:59) అంతకుముందు ఎవరూ లేరు అక్కడ ఆశ్చర్యంతో చూస్తున్నాడు. చూస్తుంటే నాకు దప్పిగ్గా ఉంది నాకు నీ దగ్గర ఉన్న గ్లాసడ్డు నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఉన్నదబ్బే తన దగ్గర వేరే లేదు అయినా ఎలో పెద్దవాడు అడుగుతున్నాడు నాకంటే బాధ దప్పిక ఎక్కువగా ఉంది కాబు అయ్యా తీసుకోండి అని ఇచ్చాడు ఆ గ్లాస్ నీళ్ళు ఆయన తీసుకున్నాడు ఇతడి వైపు అలా చూశడు.
(13:24) గ్లాస్ అలా అది అవతలికి విసిరేసాడు. అయ్యా తాగమంటే ఇచ్చాను తాగుతాను అంటే అత పారేస్తారు ఏమిటి అన్నాడు లేదు నీ త్యాగానికి నేను మెచ్చుకున్నాను నీకు దప్పికగా ఉండి కూడా నాకు ఇచ్చావు నీకు తాగటానికి నేను ఇస్తాను అని గాలిలో నుంచి ఒక గ్లాసులో ఏదో ఒక దివ్య రసాన్ని సృష్టించి ఇచ్చాడు అది తీసుకున్నాడు అతను చాలా తృప్తి కలిగింది బలం వచ్చినట్టు అనిపించింది.
(13:51) అప్పుడు అన్నాడు అతడు నీలో ఉన్న సద్గుణాన్ని చూసి నేను మెచ్చుకున్నాను. [గొంతు సవరించుకోవడం] ఈ ప్రపంచంలో కొందరినైనా మార్చగలిగినటువంటి అవకాశం నీకు ఉన్నది నీకు ఉన్నటువంటి సద్గుణాల వల్ల మనుషుల్లో ఉండేటువంటి దుర్గుణాలను పారద్రోలు సుగుణ సంపన్నులను చేయి నీకు శక్తిని ఇస్తాను నేను అన్నాడు అతడు ఆయన పేరు సెంట్ జర్మేన్ ఆశ్చర్యపడ్డాడు ఆనందపడ్డాడు మీ ఆజ్ఞ తప్పకుండా చేస్తానండి అన్నాడు అన్నాడు ఆయన అదృశ్యం అయపోయినాడు ఇతడు నెమ్మదిగా కిందికి దిగి నడిచి వస్తూ ఉన్నాడు నడిచివస్తూ ఉంటే అలిసిపోతున్నాడు ఒకచోట కూర్చున్నాడు ఎదురుగా ఒక చిరుత పులి పరిగెత్తుకుంటూ వస్తున్నది మీదికి వస్తే
(14:33) చచ్చిపోతాం దానితో యుద్ధం చేయలేము గెలవలేము ఏం చేయాలా అయ్యో నా గురువుగారు ఒక సత్కార్యాన్ని అప్పగించారు ఈలోపే నేను మరణిస్తానా అనుకున్నాడు అనుకొని అంత మానీయుడు చెప్పిన తర్వాత నాకు మరణం ఎట్లా వస్తుంది రాదు అని నన్ను ప్రేమతో సృష్టిని చూడమన్నాడు మానవుడు లో ప్రేమను కలిగించమన్నాడు దీన్ని కూడా నేను ప్రేమతో చూస్తాను జీవులందరూ ఒకటే అని ఆ పులి వైపు అతడు ఎంతో ప్రేమతో చూశడు.
(15:03) చూస్తే ఆ పులి నెమ్మదిగా వచ్చింది అతడి పక్కన కూర్చున్నది కాసేపు ఉండి వెళ్ళిపోయింది. ఆశ్చర్యము ఆనందము సిద్ధ గురువుల యొక్క కృప ఇలా ఉంటుంది అని తెలుసుకున్నాడు. అతడు తన జీవితాన్ని ఆ రకంగా తర్వాత ఆ ప్రేమ ప్రబోధానికి మానవులలో సద్గుణాలను పెంపొందింప చేయడానికి తన వంతు కృషి తాను చేసి కర్తవ్య నిర్వహణ చేశాడు. ఇటువంటివి సిద్ధ గురువుల యొక్క అనుగ్రహం వల్ల ఏదైనా సాధ్యమే మేడం బ్లావెట్స్ కి శిష్యుడైనటువంటి లెడ్ మీటర్ కొన్ని సంఘటనలు చెబుతాడు డివైన్ మాస్టర్స్ ఎలా పని చేస్తారు ఎలా ఉంటారు వాళ్ళు అని చెబుతూ కొన్ని సంఘటనలు చెప్పాడు అతడు ఒ గ్రామానికి వెళ్ళాడు ఆ
(15:47) గ్రామంలో జరిగింది. ఓ పిల్లవాడు కొండ మీదకి వెళ్ళాడు సరదాగా వెళ్ళాడు వెళ్లి కొండ ఎక్కుతూ పడ్డాడు చిన్న పిల్లవాడు పదఏళ్లవాడు ఏమో పడిపోయినాడు పడిపోయేసరికి కాళ్ళకు వాటికి గాయాలు అయినాయి నెత్తురు కారుతున్నది స్పృహ తప్పిపోయేట్టుగా ఉన్నాడు ఉంటే పడిపోయినాడు కానీ ఇంతలో ఎవరో వచ్చారు అక్కడికి వచ్చి అతడి నెత్తురు కారటాన్ని ఆపారు ఎక్కడి నుంచో ఒక గుడ్డ తీసుకొచ్చి అతడికి కట్టు కట్టాడు అదృశ్యం అయిపోయినాడు.
(16:22) ఆ పిల్లవాడిని వెతుక్కుంటూ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అందరూ కూడా కొంతమంది జనం అక్కడికి వెతుక్కుంటూ వచ్చి చూశారు. ఆ కొండ మీద ఎవరు లేరని తెలుసు వాళ్ళకు కనుచూపు మీరు ఆ కొండ అంతా వాళ్ళకు బాగా తెలుసు కట్టఎవరు కట్టారు పిల్లవాడు పడ్డాడు బాగానే ఉంది బాగనే ఉందంటే పడ్డటం బాగుందని కాదు పడ్డాడు కానీ ఇంత గాయం అయింది కట్టఎవరు కట్టారు అంటే ఎవరో ఒక ఆయన వచ్చాడు గాలిలో నుంచి ఒక గుడ్డ తీసి కట్టాడు నాకు అని చెప్పారు ఆశ్చర్యపడ్డారు మహాపురుషులు కొండ మీద ఉన్నారు అని చెప్పి అట్లా లెడ్ మీటర్ డివైన్ మాస్టర్స్ ఏ రకంగా సామాన్యుల సహాయం చేస్తుంటారో ఆర్తులను ఆదుకుంటూ ఉంటారో
(17:02) కాపాడుతూ ఉంటారో ఇటువంటి విశేషాలు జరిగినటువంటి సంఘటనల ద్వారా మనకు తెలియజేశాడు లెడ్ బీటర్ కొన్ని ఉదాహరణలను అందించి అలానే మానవులలో ధర్మ ప్రవృత్తి అహింసా ప్రవృత్తి హింసను తొలగించి ఇవాళ యుద్ధాలు జరుగుతున్నాయి వేల లక్షల మందిని చంపారు అనేక యుద్ధాలు జరిగినాయి ప్రపంచంలో మరో యుద్ధం వస్తే ఏమైపోతుందో అని అందరూ భయపడుతున్నారు.
(17:31) ఆ స్థితిలో కొద్ది సంవత్సరాల కింద ఒక సంఘటన జరిగింది. అమెరికా విమానదనికి అధిపతి అడ్మిరల్ బర్డ్ అని ఉన్నాడు. ఆ అడ్మిరల్ బర్డ్ అతడు ఒకరోజు ఉత్తరధ్రువ ప్రాంతానికి తన విమానంలో వెళ్ళాడు. విమానంలో వెళ్లి ఒకచోట ఆగాడు అక్కడ ఇంజన్ ఆగిపోయింది చెడిపోయింది ఏం చేయాలో తెలియదు. ఇంకా అక్కడికి మార్గము లేదు ఎవరు రక్షించగలిగిన వాళ్ళు లేరు ఎవరు రాలేరు అక్కడికి ఇక మరణం తప్పదు అని అనుకుంటున్నాడు.
(18:03) ఇంతలో అక్కడ ఒక పెద్ద మంచు పెళ్లలో నుంచి పైకి లేచింది దాంట్లో నుంచి ఒక వ్యక్తి బయటికి వచ్చాడు. ఆ రా నాయనా నాతో రా అని పిలిచాడు అడ్మిరల్ బరుడును ఇతడు వెళ్ళాడు లోపల ఒక గుహ ఉన్నది ఆ గుహలోకి తీసుకొని వెళ్ళాడు గుహలోకి వెళితే అక్కడ అతడు నువ్వు ఆకలితో దప్పికతో ఉన్నావు నీకు ఇదిగో ఈ ఆహారం ఇస్తున్నాను అది ఒక గ్లాస్ లో ఒక ఆకు పొచ్చని ద్రవం ఇచ్చాడు అది తీసుకుంటే ఇతడికి చాలా బలం వచ్చింది శక్తి వచ్చింది.
(18:36) ఎవరు మీరు ఈ గుహ ఏమిటి ఈ ఉత్తర ధ్రృవ ప్రాంతంలో మంచు గప్ప్యం ఉన్న చోట మంచు కుండల మధ్య ఈ మంచు బెళ్ళలో నుంచి మీరు పైకివచ్చి నన్ను లోపలికి తీసుకెళ్ళారు ఇది ఎక్కడిది ఇది అంటే ఇది అగర్త ఇక్కడ చాలామంది ఉన్నాం మేము అని చెప్పి కొందరిని పరిచయం చేశాడు. వీళ్ళంతా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి జీవిస్తున్నటువంటి వాళ్ళు నిన్ను ప్రత్యేకంగా మేము ఎంపిక చేశాను నీలో ఉన్నటువంటి గుణగణాలను పరిశీలించి నీ మంచితనాన్ని చూసి నువ్వు యుద్ధం చేసినవాడివైనా వీరుడివైనా సరే నీలో ఉన్నటువంటి ఆ సద్గుణ సంపదను మేము చూసి నిన్ను పిలిచాము నీవు వెళ్లి మీ వాళ్ళకు చెప్పు ఈ యుద్ధాలు ఇవన్నీ చాలా ప్రమాదకరం
(19:23) మానవజాతి వినాశనానికి దారి తీస్తుంది మేము చూస్తున్నాం ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మీకు మంచితనాన్ని అందించడానికి సత్ప్రవర్తనను అందించడానికి మానవజాతిని ప్రళయం నుండి రక్షించడానికి నీవంటి వాళ్ళని మేము ఎంపిక చేస్తున్నాము అసామాన్యమైన మా శక్తులతో మేము చేస్తున్నాము అయినా మీరు సహకరించాలి లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అనిఅంటే అసలు ఈ లోకం ఏమిటి మీ చూపేది నన్ను చూసేది నాకు అర్థం కావడం లేదు అనిఅంటే ఇక్కడ కొన్ని వేల మంది ఉంటారు ఇటువంటి ప్రపంచంలో ఎన్నో కేంద్రాలు ఉన్నాయి మాకు ఒకదాని నుంచి ఒక దాంట్లోకి సంబంధం ఉంటుంది అని చెప్పి అతడు
(20:03) కల్కి పురుషుడి యొక్క అవతారం శంబ గ్రామంలో ఎలా జరగబోతూ ఉన్నదో దాన్ని గురించినటువంటి విశేషాలు కొన్ని చెప్పాడు అంటే నేను అక్కడికి రావచ్చునా నన్ను కూడా తీసుకెళ్ళండి వారిని చూస్తాను నేను ఆ మహాపురుషుడిని అనిఅంటే నీకు ఇప్పుడు అనుమతి లేదు ప్రస్తుతం నీకు ఇంతవరకు వచ్చింది నీవు చూసిన దాని వల్ల జరిగేటువంటిది తెలుసు తెలుసుకొని మీ వాళ్ళకి చెప్పు అంటే నా మాట వింటారా నేను ఒక సేనాపతిని మాత్రమేను అంటే కాదు నీ ప్రయత్నం నువ్వు చెయ్ మేము ఎంపిక చేసేవాళ్ళు మరి కొంతమంది కూడా ఉంటారు అని చెప్తే అతడు బయటికి వచ్చి తన సర్వ సైన్యాధిపతి తోటి చెప్పాడు జరిగింది.
(20:40) ఇదంతా అబద్ధం నాన్సెన్స్ నువ్వేదో భ్రాంతిలో ఉన్నావు ఉత్తరధ్రవ ప్రాంతంలో గుహలు ఉండటం ఏమిటి లోపల మనుషులు ఉండటం ఏమిటి అని నమ్మలేదు. సరే అయినా సరే అతడు దాన్ని బయటికి చెప్పడానికి అధికార వర్గం పర్మిషన్ ఇవ్వలేదు. అతడు రిటైర్ అయిన తర్వాత ఈ విషయాలన్నీ అగర్త అనేటువంటి గ్రంథం రాసి దాంట్లో ఈ విషయాలన్నీ కూడా అన్నో అతడు తెలియజేశడు అది ఇంటర్నెట్ లో ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
(21:08) ఇట్లా ప్రపంచంలో జరుగుతున్నటువంటి వాటికి సిద్ధ గురువులు మహనీయులైనటువంటి వ్యక్తులు ఏ రకంగా ప్రపంచాన్ని రణరంగం నుండి తప్పించడానికి మరణాన్న నుండి కాపాడటానికి శాంతిని స్థాపించడానికి ఏ రకంగా కృషి చేస్తున్నారో ప్రబోధిస్తున్నారో ఇటువంటివి చాలా అపూర్వమైన అద్భుతమైన ఉదాహరణలు మనకు నిజంగా ఇటీవలి కాలంలో జరిగినవి పూర్వయుగాలలో మహర్షులు చేశారు యుగ యుగాలలో ఎన్నో జరుగుతున్నాయి పరమేశ్వరుడు ఎన్నో సార్లు అవతరించాడు వస్తున్నాడు వశిష్ట విశ్వామిత్రాది మహర్షులు ఉన్నారు ఇవన్నీ కొన్ని వేల లక్షల సంవత్సరాల లాంటి గాధలు కానీ ఇవన్నీ మొన్న 20వ శతాబ్దంలో ఇటీవలి కాలంలో 21వ
(21:52) శతాబ్దంలో 19వ శతాబ్దంలో జరిగినటువంటి గాధలు ఇవన్నీ కూడాను కనుక సిద్ధ గురు కృప ఉండేటట్లయితే ఏ వ్యక్తులైనా సరే తాము మాన మానవ శ్రేయస్సు కోసం కృషి చేయవచ్చు ప్రతి వ్యక్తి కూడాను తాను తనను ఉద్ధరించుకోవాలి తనను ద్ధరించుకోవడంతో పాటుగా ఈ ప్రపంచాన్ని కూడా ఉద్ధరించి దైవ మార్గ ఉన్ముఖులను చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనే సత్యం తెలుసుకోవడం కోసం తెలియజేయడం కోసమే ఈ ఇటీవల జరిగినటువంటి ఈ సంఘటనలు ఉదాహరించాను.
(22:30) మరొక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. నేను అమెరికాలో సంచారం చేస్తున్నప్పుడు బోస్టన్ ప్రాంతంలో ఉండంగా ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. స్వామివారు మీరు కుర్తాళం పీఠాధిపతి కదా అని విన్నాను నెట్లో చూశను మీ ప్రోగ్రామ అందుకని వచ్చాను అవును చెప్పండి అన్నాను కుర్తాళం ఎక్కడ ఉన్నది అన్నాడు దేనికి మీకు అన్నాను నేను అప్పుడు అతడు ఒక సంఘటన చెప్పాడు. ఫ్రాన్స్ లో సోఫియా అని ఒక ఆమె ఉన్నదండి ఫ్రెంచ్ భాషలో గ్రంథం రాసింది నేను దాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేశాను.
(23:00) అయితే ఏమిటి అన్నాను అంటే దాంట్లో ఒక సంఘటన ఉన్నదండి ఆమె మంచి యోగ సాధకురాలు ధ్యానాభ్యాసం చేస్తున్నది ఆ ధ్యానాభ్యాసం చేస్తుంటే ఒకసారి ఆమెకు మనసులో ఒక మెసేజ్ వచ్చింది నువ్వు హిమాలయాలకు రావాలి సిద్ధాశ్రమం ఉన్నది అక్కడ అక్కడ ఆ సిద్ధాశ్రమానికి నువ్వు వచ్చేటట్లయితే నీ భవిష్యత్తు నీ ఆధ్యాత్మిక పునరుద్ధరణ ఇవన్నీ కూడా బాగా జరుగుతవి అని అన్నారు నేను వెతుక్కుంటూ హిమాలయాలకి వెళ్లి ఫ్రాన్స్ నుంచి వాళ్ళు చెప్పిన మార్గంలో వెళ్ళాను చాలా దూరం వెళ్ళాను హరిద్వార్ హృషికేష్ ప్రాంతంలో హిమాలయ పర్వతాలలో నాకు ఒక గైడ్ తీసుకొని వెళ్ళాను కొంత దూరం
(23:42) వెళ్ళిన తర్వాత ఇంకా గైడ్ ఎవరు ఉండటానికి వీలులేదు అతన్ని వెనక్కి పంపించు నువ్వు ఒక్కదానివే ముందుకు రా అని వినిపించింది. ముందుకు వెళ్ళాను అతన్ని వెనక్కి పంపించి ఎంత దూరం పోయినా వెనక్కు తిరిగి చూస్తే వచ్చిన దోవు కూడా కనపడటం లేదు మంచుతో కప్పబడి ఉన్నది ఎటు వెళ్తున్నానో తెలియదు గమ్యస్థానం చేరుకుంటానో తెలియదు నన్ను పిలిపించినటువంటి సిద్ధ గురువులు నాకు సహాయం చేయకపోతే నేను ఇక్కడే కుప్పగూలిపోతాను అన్నది.
(24:10) ఇంతలో ఎక్కడి నుంచో చిరుగంటలు వినిపించినయి ఒకవైపు చూస్తే ఆవులు దూడలు వాటి మెడలలో ఉండేటువంటి గొలుసులు చిరుగంటలు మోగుతూ వస్తున్నాయి. ఒక గోప బాలుడు వస్తున్నాడు అతడు మురళి వాయిస్తున్నాడు వాళ్ళు దగ్గరికి వచ్చారు నాయనా నేను సిద్ధాశ్రమానికి వెళ్ళాలి షాంగ్రీలా అని అంటారు టిబెటన్ భాషలో షాంగ్రీలాకి వెళ్ళాలి నేను అని నాకు దోవ తెలియడం లేదు అంటే నీకు సహాయం చేయడం కోసమే నేను వచ్చాను అని అన్నాడు.
(24:45) నా చెయ్యి పట్టుకో నేను తీసుకెళ్తాను అన్నాడు. అతడి చెయ్యి పట్టుకున్నది ఆవిడ కళ్ళు మూసుకో అన్నాడు ఆ ఆవులన్నీ నెమ్మదిగా వాటితో దోవన అయిపోతున్నాయి ఈమె కళ్ళు మూసుకున్నది నెమ్మదిగా నడుస్తున్నారు కాసేపటికి చూసేసరికి గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది నడుస్తున్నట్లు లేదు కొంత దూరం అయిన తర్వాత ఇంకా కళ్ళు తెరువు అన్నాడు కళ్ళు తెరిచింది ఎదురుగా ఒక గోపురం కనిపిస్తున్నది దేవాలయ గోపురం నీ గమ్యస్థానం అదే అక్కడికి వెళ్ళు నిన్ను కావలసినవా వాళ్ళు ఆదరిస్తారు నీకు తెలియజేయవలసినవి తెలియజేస్తారు అని ఆ బాలుడు వెళ్ళిపోయినాడు.
(25:23) ఆమె అక్కడికి వెళ్ళింది తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళారు అక్కడ ఒక దేవాలయంలో ఆరు అడుగుల ఎత్తు ఉన్నటువంటి స్పటిక మేరు చక్రం ఉన్నది మేరు ప్రస్తారం ఉన్నది శ్రీ చక్రం దాన్ని చూస్తూ ఉంటే కళ్ళు మూసుకుపోతున్నాయి దాంట్లో నుంచి ఏదో దివ్య శక్తి ప్రసరిస్తూ ఉన్నది ఆశ్చర్యపడింది కళ్ళు మూసుకున్నది ఆ శక్తి ప్రవాహాన్ని తట్టుకుంటూ దాన్ని స్వీకరిస్తూ ఉన్నది కాసేపు అయిన తర్వాత అమ్మా ఇంకా కళ్ళు తెరువు అన్నారు కళ్ళు తెరిచింది ఆమెను తీసుకెళ్ళారు ఒకచోట ఒక హాల్లో కొద్దిమంది ఉన్నారు అంతా ఓ 20 మంది ఆ ప్రాంతం జనమ ఉన్నారు. వేదిక మీద ఒక
(26:04) యువకుడు కూర్చొని ఉన్నాడు ఆ కూర్చున్నటువంటి యువకుడు యోగ ప్రబోధం చేస్తున్నాడు విన్నది ఆ తర్వాత తల్లి తీసుకొచ్చారు. ఆ వేదిక మీద ఉన్నటువంటి మహానుభావుడు ఎవరు యువకుడు లాగా ఉన్నాడు అనిఅంటే ఆయన్ని మేమంతా జనక మహారాజు అని పిలుస్తాము అని చెప్పారు ఈమెను తీసుకెళ్తూ ఉన్నటువంటి వ్యక్తి జనక మహారాజ ఆయన ఎవరు అంటే అదేదో పురాణాలలో పేరు అనుకోండి కానీ మేము ఆయన్ని ఇట్లా పిలుస్తాము ఎక్కడి వాడు ఆయన చాలా చిన్నవాడిలాగా ఉన్నాడే అంటే ఆయన 1899 లో దక్షిణ భారతంలోని కుర్తాళం దగ్గర ఒ చిన్న గ్రామంలో పుట్టాడు ఆయన ఆయన జాతకాన్ని చూసిన పురోహితుడు వీడు సన్యాసి
(26:45) అయితాడు అని అంటే వాళ్ళ తండ్రి జమీందారు సంపన్నుడు వద్దొద్దు మావాడు మా హస్తులు చూసుకుండేవాడు కావాలి అన్నారు. తీరా అతడు పెరిగి పెద్దవాడై అతడు ధర్మనిష్టులైనటువంటి వ్యక్తుల యొక్క ప్రబోధాన్ని పొంది హిమాలయాలకు వెళ్లి ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడు ఆయనకు ముసలితనం రాలేదు. ఆయన చిరంజీవి ఎంతకాలం ఉంటా అనుకుంటే అంతకాలం ఉంటాడు ఆయన అని ఆయన గురించి తెలియజేసింది.
(27:17) అతడు గుర్తాళం దగ్గరివాడు గుర్తాళం వస్తూ ఉండేవాడు అనిఅంటే గుర్తాళం ఎక్కడ అని తెలుసుకుందాం అని అడిగానండి అన్నాడు సరే ఆ విశేషాలు ఏవో చెప్పాను గుర్తాళానికి రమ్మని ఇన్వైట్ చేశాను. ఆ రకంగా సిద్ధులైనటువంటి మహాపురుషులు హిమాలయాలలో ఉన్నారు ప్రపంచంలో ఇంకా ఇటువంటి కేంద్రాలు 16 దాకా ఉన్నాయి అటువంటి సిద్ధ కేంద్రాల నుండి కొన్ని వందల వేల సంవత్సరాల భౌతిక శరీరాలతో జీవిస్తూ ఉన్నటువంటి మహాపురుషులు ఇప్పటికీ కూడా ఉన్నారు మేడం లావెడ్స్కి తన సీక్రెట్ డాక్ట్రిన్ అన్న గ్రంథంలో ఈ విషయాల గురించి చెప్తూ మోరియా అనే వ్యక్తిని గురించి చెప్పింది అంటే మరు మరువు మరువు
(27:57) అనిఅంటే ద్వాపర యుగాంతమునందు ఉన్నటువంటి వ్యక్తి ఆయన అటువంటి ఆ మహాపురుషుడు ఇప్పటికి కూడా జీవించి ఉన్నాడు అని ఆయన ఫోటో కూడా పబ్లిష్ చేసింది ఆవిడ ఈ విధంగా సిద్ధ గురువులు ప్రపంచంలో వాళ్ళు ధర్మ ప్రబోధన చేస్తుంటారు జ్ఞాన ప్రబోధన చేస్తుంటారు ధ్యాన మార్గంలో దీనికోసం కృషి చేసేటువంటి వాళ్ళకు సహాయాన్ని అందిస్తూ ఉంటారు ఆ ధ్యానం చేసేటువంటి వ్యక్తులకు ముందుకు వెళ్లి ఆ దివ్య చైతన్యాన్ని అందుకోవడానికి సహాయం చేస్తుంటారు.
(28:29) దానికి కావలసినటువంటి మార్గాన్ని నిర్దేశించే ఆ మహా గురువులను మనం ఉపాసించాలి భావించాలి వాళ్ళ కరుణ వల్ల మనం ఏదైనా సాధించగలుగుతాము. అందువల్ల సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి గురు పరంపరలో కొంతమంది వ్యక్తులు నాకు బాగా సన్నిహితులైనటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళ ద్వారా ఇటువంటి విశేషాలు కూడా కొన్ని వాళ్ళు ప్రత్యక్షంగా నాకు చూపించడం కూడా జరిగింది తెలియజేయడం జరిగింది.
(28:57) అందులో ఒక వ్యక్తి అయితే 600 సంవత్సరాల కింద మనఇద్దరం కలిసి చదువుకున్నాము అని నా క్లాస్మేట్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. అతడు సాధన వల్ల దివ్య శరీరాన్ని పొందాడు. సిద్ధ గురువుల వల్ల నిర్దేశించబడి జన్మలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క సహాయం వల్ల ఉద్బోధాన్ని పొందుతూ దివ్యజ్ఞానాన్ని పొందుతూ ముందుకు వెళ్ళటం జరుగుతుంది అందరూ కూడా ఆ రకంగా సిద్ధ గురువులను ఉపాసించి భవ్యమైన దివ్యమైన ధ్యానం చేసి ధ్యాన మార్గంలో ముందుకు వెళ్లి దివ్యజ్ఞానాన్ని అందుకొని గురు కృప వల్ల సమస్తమైనటువంటి ఆధ్యాత్మిక శక్తులను చైతన్యాన్ని సాధింతురుగాక
(29:36) శుభమస్తు నారాయణ నారాయణ
No comments:
Post a Comment