Sunday, July 19, 2026

పని చేస్తూ ప్రాణాలు కోల్పోయే 10 విచిత్రమైన జీవులు | Strange animals in the world | yali facts

పని చేస్తూ ప్రాణాలు కోల్పోయే 10 విచిత్రమైన జీవులు | Strange animals in the world | yali facts

Author Name:Yali Facts Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@YaliFactsTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=aM5KOwPqZo4



Transcript:
(00:00) మనుషుల ప్రేమ కథల్లో గొడవలు బ్రేకప్లు ఉంటాయి కానీ జంతు ప్రపంచంలో కొన్ని జీవుల లవ్ స్టోరీస్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాటికి శృంగారం అంటే కేవలం ఎంజాయ్మెంట్ కాదు చావుతో ఆట. తమ తర్వాత వచ్చే పిల్లల కోసం తమ ఫ్యామిలీని ముందుకు తీసుకువెళ్ళడం కోసం కొన్ని మగ జంతువులు నవ్వుతూ ప్రాణాలనే త్యాగం చేస్తాయి. నీకోసం ప్రాణాలైనా ఇస్తా అని సినిమాల్లో డైలాగులు వినే ఉంటాం.
(00:23) కానీ రియల్ లైఫ్ లో లవ్ కోసం శృంగారం చేస్తూనే ప్రాణాలు వదిలేసే కొన్ని వింత జంతువుల క్రేజీ స్టోరీస్ ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి.
(00:41) యాంటీ జినస్సా ఆస్ట్రేలియాలో ఉండే ఈ చిన్న యాంటీజినస్సా చూడ్డానికి ఎలుకలా కనిపించిన నిజానికి ఇది ఎలుక కాదు. ఇది కంగారు లాంటి జంతువుల ఫ్యామిలీకి చెందిన ఒక చిన్న మ్యామల్. కానీ దీని లవ్ స్టోరీ మాత్రం జంతు ప్రపంచంలోనే వేరే లెవెల్. ఇది జంతు ప్రపంచంలోనే ఒక రేంజ్ రాక్స్టార్ సంవత్సరంంతా చాలా సైలెంట్ గా అమాయకంగా కీటకాలను తింటూ బ్రతికేస్తుంది.
(01:04) కానీ వన్స్ ఆ లవ్ సీజన్ స్టార్ట్ అయిందంటే దీనికి పూనకం వచ్చేస్తుంది. మన ఊరి జాతరలో వచ్చే పూనకాలన్నీ వీడి ముందు వేస్ట రెండు వారాల పాటు గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ శృంగారంలో మునిగిపోతుంది. నాన్ స్టాప్ అంటే నిద్ర లేదు తిండి లేదు కనీసం మంచి నీళ్లు కూడా తాగడు. బాడీలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎంతలా పెరిగిపోతుందంటే దాని ఇమ్యూనిటీ సిస్టం కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది.
(01:27) ఎలాగ చావక తప్పదు కాస్త స్టైల్ గా లవ్ చేస్తూనే చచ్చిపోదాం అన్నట్లు ఉంటుంది. దీని ఆటిట్యూడ్. కట్ చేస్తే సీజన్ ఎండింగ్ కి ఒక మగ ఎలుక కూడా బ్రతకదు. శరీరంంతా అలిసిపోయి అవివాలన్నీ ఫెయిల్ అయిపోయి అక్షరాల కరిగిపోయి చనిపోతాయి. ఇదంతా కేవలం సంతానోత్పత్తి కోసమే. ఇక ఆడవి మాత్రం హాయిగా ప్రశాంతంగా ఉంటూ పిల్లల్ని కనేసి నెక్స్ట్ ఇయర్ వచ్చే కొత్త బ్యాచ్ మగ ఎలుకల కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి.
(01:51) ఇది కదా అసలైన లవ్ ఫెయిల్యూర్ స్టోరీ అంటే డ్రోన్ బి మగతేనటీగా పాపం తేనెపట్టులో మగతేనటీగా బ్రతుకు ఒక పెద్ద ట్రాజిడీ. అక్కడ క్వీన్ ఈగ రాజ్యం వెలుతుంటే వర్కర్ ఈగలు రాత్రింబవలు కష్టపడుతుంటాయి. కానీ మన మగ ఈగ మాత్రం లైఫ్ లో ఒకే ఒక గ్రేట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే క్వీన్ తో జతకట్టే అవకాశం. ఆ క్షణం రాగానే ప్రాణాలకు తెగించి ఆకాశంలో ఎగురుతున్న క్వీన్ వెనకాల పడుతుంది.
(02:16) కానీ అక్కడ కాంపిటీషన్ మామూలుగా ఉండదు. ఒక సినిమా హీరో ఆడిషన్ కి వచ్చిన జూనియర్ ఆర్టిస్టుల డజన్ల కొద్ది మగీగలు లైన్ లో ఉంటాయి. చివరికి ఎవరో ఒక లక్కీ ఫెలో అనుకున్నది సాధిస్తాడు. కానీ అక్కడే కథలో ట్విస్ట జతకడం పూర్తయ్యే సమయంలో మగతేనటీగా జననేంద్రియం దాని శరీరం నుంచి విడిపోయి క్వీన్ లోనే ఉండిపోతుంది. ఆ దెబ్బకి దాని పొట్ట భాగం తీవ్రంగా దెబ్బ తింటుంది.
(02:38) ఫలితంగా ఆ మగ కొద్ది క్షణాల్లోనే చనిపోతుంది. మరి షాకింగ్ విషయం ఏమిటంటే క్వీన్ ఈగ మాత్రం ఇక సరే నెక్స్ట్ అన్నట్లు తన పని తాను చేసుకుంటూ ఇంకో మగ ఈగ వైపు వెళ్ళిపోతుంది. పాపం మన మగ తేనటీ ఈగ మాత్రం జీవితంలో ఒక అవకాశానికే బ్రతికి అదే అవకాశంతో తన కథను ముగించేస్తుంది. లవ్ కోసం ఎంత దూరమైనా వెళ్తా అని చాలా మంది అంటారు. కానీ నిజంగా ప్రాణాల దాకా వెళ్ళేది మాత్రం ఈ మగతేనటీగే.
(03:02) ప్రేయింగ్ మాంటిస్ చూడడానికి రెండు చేతులు జోడించి చాలా భక్తిగా సైలెంట్ గా ఉండే ఈ ప్రేయింగ్ మాంటిస్ వెనుక ఒక పెద్ద క్రిమినల్ మైండ్ ఉంది. పేరు మాత్రం ప్రేయింగ్ మాంటిస్సా. కానీ కొన్నిసార్లు దీని లవ్ స్టోరీ చూస్తే హారర్ మూవీ కంటే కూడా తక్కువే అనిపిస్తుంది. లవ్ సీజన్ రాగానే మగ ప్రేయంగ్ మైంటీసా చాలా జాగ్రత్తగా భయపడుతూ భయపడుతూ ఆడదాని దగ్గరకు వెళ్తుంది.
(03:23) ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా తానే డిన్నర్ మెనుూలోకి వెళ్ళే ఛాన్స్ ఉందని దానికి బాగా తెలుసు. కొన్నిసార్లు మీటింగ్ జరుగుతున్నప్పుడే ఆడ ప్రేయింగ్ మాంటిస్ మగదాని తలను కొరికివేయడం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మనకైతే తల పోతే కథ అక్కడితో ముగిసిపోతుంది. కానీ మగ ప్రేయింగ్ మాంటిస్ బాడీ మాత్రం అలా కాదు. తల పోయినా సరే కొంతసేపు తన పని కొనసాగిస్తూనే ఉంటుంది.
(03:45) సైంటిస్ట్ల ప్రకారం మగదానిని తినడం వల్ల ఆడ ప్రేయింగ్ మాంటిస్ కి గుడ్లు తయారవ్వడానికి కావలసిన అదనపు పోషకాలు దొరుకుతాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. ఇది ప్రతిసారి ఇలా జరగదు. చాలా మగ ప్రేయింగ్ మాంటిస్లు మేటింగ్ అయిపోయిన వెంటనే అక్కడి నుంచి స్పీడ్ గా జంప్ కొట్టేసి ఎస్కేప్ అయిపోతాయి. మరికొన్ని మాత్రం దురదృష్ట వసాతు లవర్ నుంచి లంచ్ గా ప్రమోట్ అయిపోతాయి.
(04:05) బ్లాక్ విడో స్పైడర్ టాక్సిక్ రిలేషన్షిప్ అనే మాటకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ విడో సాలీడు. నల్లగా మెరుస్తూ పుట్ట మీద ఎర్రటి బొడ్డు పెట్టుకొని స్టైలిష్ గా కనిపిస్తుంది. కానీ దీని జోలికి వెళ్తే ప్రాణాలకే ప్రమాదం. మగసాలీడు దీని దగ్గరకు వెళ్ళేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఆడదా నీ గూటిని నెమ్మదిగా టచ్ చేస్తూ నేను నీ మొగుడిని అవ్వడానికి వచ్చాను నీకు స్నాక్స్ కాదు అని మెల్లగా సిగ్నల్ ఇస్తుంది.
(04:30) ఒకవేళ ఆడది ఓకే చెప్తేనే లోపలికి వెళ్తుంది. కానీ శృంగారం అయిపోగానే సీన్ వేరేలా ఉంటుంది. ఆడసాల్యుడు మూడ్ మారిపోయి మగదానిని ముక్కలు ముక్కలుగా తినేస్తుంది. ఒకవేళ మగది పారిపోవాలని చూస్తే మనుషులను సైతం చంపగలిగే తన డేంజరస్ విషయాన్ని దానిపై ప్రయోగిస్తుంది. విచిత్రం ఏమిటంటే కొన్ని మగసాలి ఇల్లు పారిపోకుండా సరే నన్ను తినేయ అన్నట్లు తలవంచుతాయి.
(04:51) ఎందుకంటే అలా చేయడం వల్ల ఎక్కువ పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుందట. తన వాసుల కోసం తన ప్రాణాలనే త్యాగం చేస్తుంది ఈ మగసాలీయుడు. గార్ట స్నాక్స్ మీ లవ్ లైఫ్ గందరగోలంగా ఉందా అయితే ఈ పాములను చూడండి. చలికాలం నిద్ర హైబర్నేషన్ అయిపోగానే ఇవి ఒకేసారి వేల సంఖ్యలో భూమిలోనుంచి బయటకు వస్తాయి. అప్పుడక్కడ జరిగే ఒక వింత చూస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే.
(05:13) ఇక్కడ ఒకే ఒక ఆడపాము కోసం వందలాది మగపాములు పోటీ పడతాయి. ఆ ఆడపామును దక్కించుకోవడానికి మగపాములన్నీ దాని చుట్టూ మెలకలు తిరుగుతూ ఒక పెద్ద బంతిలా తయారవుతాయి. దీన్నే సైంటిస్టులు మేటింగ్ బాల్ అంటారు. అడవి నేల అంతా వేలాది పాముల శరీరాలతో ముడిపడిపోయి ఒక పెద్ద రొమాంటిక్ జాతరలా మారిపోతుంది. కానీ ఇక్కడ మీకుొక డౌట్ రావచ్చు.
(05:35) ఆ వందలాది పాములతో ఆ ఆడపాము మేటింగ్ చేస్తుందా అని అస్సలు లేదు. ఇక్కడ అంతమంది పోటీ పడిన చివరకు గెలిచే విజేత ఒక్కడే. ఆ వందలాది మగ పాములలో ఏది బలంగా దూసుకుపోయి ఆడు దానితో కనెక్ట్ అవుతుందో ఆ ఒక్క దానితోనే ఆడపాము మేటింగ్ చేస్తుంది. పని కాగానే ఆ మగపాము ఒక రకమైన స్పెషల్ కెమికల్ వదిలేసి మిగతా వాటికి ఒరేయ్ మీరంతా లైట్ తీసుకోండి ఇక్కడ పని అయిపోయింది అని ఒక సిగ్నల్ ఇస్తుంది.
(05:56) దాంతో ఆ పాముల బంతి కాస్త విడిపోతుంది. కానీ ఇక్కడ ఇంకో మైండ్ బ్లోయింగ్ గా ట్విస్ట్ ఉంది. ఆ గ్రూప్ లో ఉన్న కొన్ని తెలివైన మగపాములు తాము కూడా ఒక ఆడపాములాగే వాసన వచ్చేట్లు కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. అంటే ఏకంగా ఆడ వేషం వేస్తాయన్నమాట. ఇక మిగతా మగపాములన్నీ అది నిజంగానే ఆడపాము అనుకొని దాని చుట్టూ చేరి వేడిని ఇస్తాయి.
(06:16) చలికాలం నిద్ర వల్ల చెల్లబడిన తన బాడీని వేడి చేసుకోవడానికి ఈ తెలివైన మగపాము మిగతా వాటిని అలా బురిడి కొట్టించేస్తుంది. దీన్నే సైన్స్ భాషలో ఫిమేల్ మిమిక్రీ అంటారు. స్కార్పియన్ తేలు. మగతేలు స్టోరీ ఒక రకమైన సస్పెన్స్ త్రిల్లర్. ఇక్కడ ఒక పెద్ద విచిత్రం ఏమిటంటే తేలుకు డైరెక్ట్ గా శృంగారం అనేది ఉండదు. వీటికి పురుషాంగం లాంటి అవయవాలు ఉండవు.
(06:38) మరి ఇవి ఎలా శృంగారంలో పాల్గొంటాయో తెలుసా? మొదట ఒక మగతేలు ఆడదాని కొమ్ములను గట్టిగా పట్టుకొని చాలా క్లాసిక్ గా రొమాంటిక్ గా డాన్స్ స్టార్ట్ చేస్తుంది. కానీ ఈ డాన్స్ వెనుక మగతేలకు ఒక పెద్ద టాస్క్ ఉంటుంది. డాన్స్ చేస్తూనే మగతేలు తన వీర్యంతో కూడిన ఒక స్పెషల్ ప్యాకెట్ ను నేలపై వదులుతుంది. ఆ తర్వాత ఆడతేను సరిగ్గా ఆ ప్యాకెట్ మీదుకు లాగాలి.
(07:00) ఆ స్టెప్ గనుక మిస్ అయిందా ఆ రొమాంటిక్ డాన్స్ కాస్త wబల్డబల్ఈ ఫైట్ లాగా అయిపోతుంది. ఇక ఆ ప్యాకెట్ ఆడదాని శరీరానికి టచ్ అవ్వగానే పని పూర్తవుతుంది. కానీ పని కాగానే ఆ తేలు మూడు ఒక్క సెకండ్ లో మారిపోతుంది. అప్పుడు మగతేలు భయపడకుండా చాలా కూల్ గా వెనక్కి తగ్గాలి. తేళ్ల ప్రపంచంలో మగది భయపడిందా అంతే సంగతులు. ఆడదానికి డిన్నర్ అయిపోవాల్సిందే.
(07:20) చాలా జాగ్రత్తగా మగవి ఆడదాని నుంచి తప్పించుకోవాలి. తప్పించుకున్నవి కొన్ని గాయాలతో బ్రతికిపోతాయి. దొరికినవి పార్ట్నర్ పొట్టలోకి వెళ్ళిపోతాయి. ఇక ఆక్టోపస్ ఆక్టోపస్ ప్రేమ కథ చూస్తే అది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని జాతుల్లో మెగా ఆక్టోపస్ కు జతకట్టడం అంటే ప్రాణాలతో చేసే సాహసమే.
(07:41) ఎందుకంటే కొన్ని ఆడ ఆక్టోపస్ లు ముఖ్యంగా పెద్ద జాతులు శృంగారం తర్వాత మగ ఆక్టోపస్ ను చంపి తినే సందర్భాలు కూడా ఉన్నాయి. మగ ఆక్టోపస్ కు ఒక ప్రత్యేకమైన ఒక చెయ్యి ఉంటుంది. దానిని హెక్టోకోటిలస్ అని పిలుస్తారు. ఈ చెయ్యి ద్వారా అది తన స్పర్మ్ ప్యాకెట్ ను ఆడ ఆక్టోపస్ శరీరంలోకి చేరుస్తుంది. కొన్ని జాతులలో ఈ ప్రత్యేక చెయ్యి విడిపోయి ఆడ ఆక్టోపస్ శరీరంలోనే మిగిలిపోతుంది.
(08:03) దీంతో ఆడ ఆక్టోపస్ ఆ స్పర్మ్ ను కొంత కాలం పాటు భద్రపరుచుకొని తనకు అనుకూలమైన సమయంలో గుడ్లను ఫలిదీకరణం చేసుకుంటుంది. శృంగారం తర్వాత మగ ఆక్టోపస్ జీవితం ఎక్కువ కాలం ఉండదు. చూశారు కదా ఈ జంతువుల లవ్ స్టోరీస్ వింటేనే చాలా షాకింగ్ గా ఉంది కదా ఒకవైపు ఆడదానికి ఆహారంగా మారిపోతూ మరోవైపు బాడీ పార్ట్స్ పాడైపోతున్న సరే తమ నెక్స్ట్ జనరేషన్ కోసం ఇవి చేసే త్యాగం మామూలు విషయం కాదు.
(08:27) సైన్స్ ప్రకారం చూస్తే తమ జాతి అంతరించిపోకుండా ఉండడానికి ప్రకృతి పెట్టిన రోల్ ఇది. ఆడజీవికి గుడ్లు పెట్టడానికి బలం కావాలి కాబట్టి ఈ మగజీవులు అలా తిండిగా మారిపోతాయి. కారణం ఏదైనా సరే ఈ స్టోరీస్ విన్నాక జంతువుల లవ్ స్టోరీస్ చాలా డేంజర్ అని అనుకోకుండా ఉండలేం. సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.
(08:47) మరి ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి.

No comments:

Post a Comment