Tuesday, July 21, 2026

🧠 Emotional Detox 😨 మనసులో పేరుకుపోయిన చెత్తను ఎలా తొలగించాలి? | Reset Your Mind Telugu

🧠 Emotional Detox 😨 మనసులో పేరుకుపోయిన చెత్తను ఎలా తొలగించాలి? | Reset Your Mind Telugu

Author Name:Mr AK Prime

Youtube Channel Url:https://www.youtube.com/@MrAKPrime

Youtube Video URL:https://www.youtube.com/watch?v=CSyII2TabDo



Transcript:
(00:02) మీ గది చెత్తతో నిండిపోతే మీరు శుభ్రం చేస్తారు. కానీ మీ మనసు చెత్తతో నిండిపోతే ఎప్పుడైనా శుభ్రం చేశారా మనలో చాలామంది అలసిపోయింది శరీరం కాదు మనసు బాధపడుతోంది జీవితం కాదు మనసు నిద్రపోవడం లేదు మెదడు కాదు మనసు ఈరోజు మీ మనసులో సంవత్సరాలుగా పేరుకుపోయినా కనిపించని చెత్తను ఒక్కొక్కటిగా బయటకు తీస్తాం. జీవితాన్ని మార్చే లోతైన ఆలోచనలు, చదువు, మనస్తత్వం, విజయానికి సంబంధించిన శాస్త్రీయ విషయాల కోసం ఇప్పుడే మిస్టర్ ఏకే ప్రైమ్ ను సబ్స్క్రైబ్ చేయండి.
(00:34) ఒక్కసారి మీ కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఆలోచించండి. మీ మనసులో ఇప్పుడు ఏముంది? ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీ బుర్రలో ఎన్ని ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి? ఒక మనిషికి రోజుకు దాదాపు 60,000 ఆలోచనలు వస్తాయని సైకాలజీ చెబుతోంది. అందులో 80% ఆలోచనలు నెగిటివ్ గానే ఉంటాయి. ఎప్పుడో జరిగిపోయిన నిన్నటి గురించిన బాధ. అసలు ఏమి జరుగుతుందో తెలియని రేపటి గురించిన భయం.
(00:59) ఈ రెండింటి మధ్యలో నలిగిపోతూ అసలైన ఈ రోజును మనం పూర్తిగా వదిలేస్తున్నాం. అసలు మనసులో చెత్త అంటే ఏమిటి? మనం రోడ్డు మీద చూసే చెత్తకు ఒక స్పష్టమైన ఆకారం ఉంటుంది. దానికి ఒక వాసన ఉంటుంది. దాన్ని మనం కళ్ళతో చూడగలం. కానీ మనసులో ఉండే చెత్తకు ఆకారం ఉండదు. వాసన ఉండదు అది కేవలం ఒక భారం కనిపించని ఒక పెద్ద బండరాయి లాంటి భారం. మీరు రోజు ఉదయం ఆ బండరాయిని మీ భుజాల మీద పెట్టుకొని జీవితం అనే సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నారు.
(01:26) అందుకే మీరు అంత త్వరగా అలసిపోతున్నారు. శరీరం కంటే ముందు మీ మనసు అలసిపోతుంది. ఈ మానసిక చెత్తలో మొదటి రకం పాత అవమానాలు పదేళ్ల క్రితం మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారు. మీ బంధువులో మీ స్నేహితులో లేక ముఖం తెలియని వ్యక్తో మిమ్మల్ని ఘోరంగా అవమానించారు అనుకుందాం. ఆ వ్యక్తి ఆ మాట అన్న సంగతి కూడా ఎప్పుడో మర్చిపోయి హాయిగా తన జీవితం తాను జీవిస్తున్నాడు.
(01:51) కానీ మీరు మాత్రం ఆ మాటను ఒక పదునైన కత్తిలా మార్చుకున్నారు. ఆ కత్తితో ప్రతిరోజు మిమ్మల్ని మీరే పొడుచుకుంటున్నారు. ఎప్పుడో పదేళ్ల క్రితం వాడు మిమ్మల్ని ఒకసారి అవమానించాడు. కానీ మీ మనసులో అదే విషయాన్ని పదే పదే తలుచుకుంటూ మిమ్మల్ని మీరు లక్ష సార్లు అవమానించుకున్నారు. ఇదే అతి పెద్ద మానసిక చెత్త. ఇక్కడ మీకుొక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను.
(02:12) ఎవరైనా మీకు ఒక గ్లాస్ లో విషం ఇస్తే దాన్ని తాగకుండా వదిలేసే హక్కు విసిరి కొట్టే హక్కు మీకు ఉంటుంది కదా మరి ఎవరైనా విషం లాంటి మాటలు అంటే దాన్ని మాత్రం మనసులోకి ఎందుకు తీసుకుంటున్నారు మీ అనుమతి లేకుండా మీ ఇంట్లోకి ఎవరిని రానివ్వరు మరి మీ అనుమతి లేకుండా మీ మనసులోకి ఈ అవమానాలను ఎందుకు రాణిస్తున్నారు రెండవ రకం చెత్త పాత వైఫల్యాలు ఒకసారి ఏదైనా వ్యాపారంలో నష్టపోయామనో లేదా ఒక పరీక్షలో ఫెయిల్ అయ్యామనో ఒక ప్రేమ కథలో ఓడిపోయామనో ఇక నా జీవితం ఇంతే అని చాలా మంది నిర్ణయించుకుంటారు.
(02:41) ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెబుతాను ఒక ఉద్యోగార్థి ఉంటాడు. ఎన్నో ఆశలతో ఇంటర్వ్యూలకు వెళ్తాడు. కానీ ప్రతి చోట రిజెక్ట్ అవుతాడు. ప్రతి రిజెక్షన్ వాడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. సమాజం అడిగే ప్రశ్నలకు భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక చీకటి గదిలో ఒంటరిగా కూర్చుంటాడు. నాకు ఏ అర్హత లేదా అని తనను తాను పదే పదే ప్రశ్నించుకుంటాడు. బహుశా మీలో కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న వాళ్ళు ఉండొచ్చు.
(03:05) కానీ మీరు గమనించని ఒక గొప్ప జీవిత సత్యం ఏమిటంటే ఒక సంఘటన మొత్తం జీవితాన్ని ఎప్పటికీ నిర్ణయించదు. ఒక పుస్తకంలో ఒక పేజీ చించిపోయినంత మాత్రాన ఆ పుస్తకం మొత్తం పనికి రాకుండా పోతుందా? కచ్చితంగా పోదు మరి మీ జీవితం అనే అత్యద్భుతమైన పుస్తకంలో ఒకటి రెండు చేదు సంఘటనలు జరిగితే మీ మొత్తం జీవితమే వృధా అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? వైఫల్యం అనేది మీరు దేనికో పనికిరారు అని చెప్పే ముగింపు కాదు.
(03:28) మీరు ఇంకో కొత్త దారిలో ప్రయాణించాలి అని చెప్పే ఒక సూచిక మాత్రమే. ఈ పాత వైఫల్యాలను తలుచుకుని కుమిలిపోవడం వల్ల మీ భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడుక్కోండి. ఈ పాత అవమానాలు ఈ వైఫల్యాలు నా మనసులో ఇంకా ఎంతకాలం ఉండాలి. ఈ ప్రశ్నకు సమాధానం మీకు మీరే ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మీ మనసులో పేరుకుపోయిన ఈ చెత్తను బయటకు విసిరేయాల్సింది మీరే మూడవ రకమైన చెత్త తప్పు చేసిన భావన. దీనినే గిల్ట్ అంటారు.
(03:55) గతంలో ఏదో తెలియక ఒక తప్పు చేశం. ఆ వయసుకు ఉన్న అవగాహన కొద్దీ అప్పటి పరిస్థితుల ప్రభావం వల్ల ఆ నిర్ణయం తీసుకున్నాం. దాని గురించి ఇప్పుడు ఎంత ఏడ్చినా ఆ గతం ఎప్పటికీ మారిపోదు. ఆ తప్పు నుండి ఒక మంచి పాఠం నేర్చుకుని ముందుకు వెళ్ళడమే తెలివైన పని. కానీ ఆ తప్పును పదే పదే తలుచుకుంటూ మిమ్మల్ని మీరు ఎందుకు శిక్షించుకుంటున్నారు? ఒక వృద్ధుడిని పలకరించి చూడండి.
(04:17) తన జీవితంలో సాధించిన గొప్ప విజయాల గురించి అతను ఎక్కువగా చెప్పడు. తాను చేసిన తప్పుల గురించి తాను కోల్పోయిన బంధాల గురించి సరైన సమయంలో చెప్పలేకపోయిన మాటల గురించి మాత్రమే జీవితాంతం బాధపడుతుంటాడు. ఆ వయసులో కూడా తన మనసును ఆ చెత్తతోనే నింపుకుంటాడు. మీరు కూడా మీ జీవిత చరమాంకంలో ఇలాగే బాధపడాలా ఒక్కసారి ఆలోచించండి. నాలుగవ రకం చెత్త ఇతరులతో పోల్చుకోవడం.
(04:40) ఇది ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి అంటుకున్న అతి పెద్ద మానసిక వ్యాధి. పక్కవాడికి కారు ఉందని పక్కంటి వాళ్ళ అబ్బాయికి పెద్ద ఉద్యోగం వచ్చిందని వాళ్ళు సోషల్ మీడియాలో చాలా సంతోషంగా కనిపిస్తున్నారని చూసి మీరు ఎందుకు లోపల కుమిలిపోతున్నారు? ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన నిజం చెబుతాను వినండి. సోషల్ మీడియాలో కనిపించేది ఎవరి నిజ జీవితం కాదు.
(05:00) అది కేవలం ఒక ఫిల్టర్ వేసిన పచ్చి అబద్ధం. ప్రతి మనిషికి తన జీవితంలో ఒక చీకటి కోణం ఉంటుంది. మీరు వారి వెలుతురును మాత్రమే చూసి మీ చీకటితో పోల్చుకుంటున్నారు. ఒక గృహిణి జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆమె ఉదయం 5దు గంటలకు లేచి ఇంట్లో అందరికీ ఇష్టమైనవి వన్నీ పెడుతుంది. కానీ ఆమెకు ఏమి ఇష్టమో ఎవర అడగరు. పక్కింటి వాళ్ళ చీరలతో వాళ్ళ నగలతో వాళ్ళ హోదాతో తనని తాను పోల్చుకుంటూ మనసులోనే ఎంతో ఆవేదన చెందుతుంది.
(05:23) ఆమెకు కావలసింది కేవలం ఒక చిన్న గుర్తింపు ఆప్యాయత. అవి లేనప్పుడు పోలికలు అనే చెత్తతో మనసును నింపుకుంటుంది. మీ ప్రయాణం మీది ఇతరుల ప్రయాణం వారిది. కాకి ఎప్పుడూ నెమలి కాలేదు. అలాగే నెమలి ఎప్పుడు కాకిలాగా ఆకాశంలో ఎగరలేదు. ఎవరి బలం వారిది ఎవరి ప్రయాణం వారిది ఐదవ రకం చెత్త అవసరం లేని భయాలు రేపు ఏమవుతుందో నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నా పిల్లల పరిస్థితి ఏమిటో అని అంతులేని ఆందోళన చెందుతుంటారు.
(05:51) కానీ మానసిక శాస్త్రం ఆధారంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు భయపడే వాటిలో 90% భయాలు నిజ జీవితంలో ఎప్పటికీ జరగవు. అవి కేవలం మీ మెదడు సృష్టించిన ఊహలు మాత్రమే. ఉదాహరణకు ఒక విద్యార్థిని తీసుకోండి. రోజుకు 10 గంటలు కష్టపడి చదువుతాడు. కానీ ఎప్పుడో చిన్నప్పుడు ఎవరో టీచర్ నువ్వు దేనికే పనికి రావు అని అన్న మాట వాడి మనసులో అలాగే ఉండిపోతుంది.
(06:13) వాడు ఎంత చదివినా తనకు ఆ మార్కులు వస్తాయా రావా అనే అంతులేని భయంతోనే ఉంటాడు. ఆ భయమే వాడిని విజయం సాధించకుండా వెనక్కి లాగుతుంది. ఎప్పుడైనా గమనించారా భవిష్యత్తు గురించి భయపడటం అంటే జరగని ప్రమాదానికి ముందే ఏడవడం లాంటిది. ఈ విషయాలు వింటున్నప్పుడు ఇది కచ్చితంగా నా గురించే చెబుతున్నారు కదా అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు.
(06:32) నిజమే మనందరి మానసిక ప్రయాణం దాదాపు ఒకేలా ఉంటుంది. ఎందుకంటే మనం మోస్తున్న చెత్త అలాంటిది. ఆరవ రకం చెత్త ఎవరైనా అన్న మాటను సంవత్సరాల పాటు మోసుకెళ్ళడం. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. దారిలో వెళ్తుంటే మీ బట్టల మీద ఒక బురద చుక్క పడింది అనుకోండి. మీరు ఏం చేస్తారు? వెంటనే ఇంటికి వెళ్లి ఆ బట్టలను ఉతుక్కుంటారు. ఆ బురదను అలానే ఉంచుకొని నెలల తరబడి తిరగరు కదా మరి ఎవరైనా అన్న చెడ్డ మాట మీ మనసు మీద పడినప్పుడు దాన్ని మాత్రం సంవత్సరాల తరబడి ఎందుకు ఉతుక్కోకుండా అలాగే వదిలేస్తున్నారు వాడు అలా అన్నాడు వీడు ఇలా అన్నాడు అని పదే పదే గుర్తు చేసుకుంటూ ఆ బురదను మీరే మీ
(07:07) చేతులతో మరింతగా పూసుకుంటున్నారు. దీని వల్ల నష్టపోయేది కేవలం మీరే ఏడవ రకం చెత్త క్షమించలేకపోవడం మనలో చాలా మంది చేసే అతి పెద్ద పొరపాటు ఇది క్షమించలేకపోవడం అనేది మీ చేతుల్లో ఉన్న ఒక ఎర్రటి నిప్పు రవ్వ లాంటిది. ఎదుటి వారి మీద కోపంతో ఆ నిప్పు రవ్వను మీ చేతిలో గట్టిగా పట్టుకుంటే ముందుగా కాలేది మీ చెయ్యే కానీ వాళ్ళది కాదు.
(07:30) ఒకరిని క్షమించడం అంటే వారు చేసింది ఒప్పని మీరు ఒప్పుకోవడం కాదు వారి వల్ల నా మనసు నీకపై చెడగొట్టుకోను అని మీ అంతట మీరు తీసుకునే ఒక గొప్ప నిర్ణయం. ఒక ఉద్యోగిని చూడండి. ఉదయం నుండి రాత్రి వరకు ఆఫీసలో కష్టపడతాడు. బాస్ పెట్టే టార్చర్ తోటి ఉద్యోగుల పాలిటిక్స్ అన్ని భరిస్తాడు. వాళ్ళను క్షమించలేక ఆ కోపాన్ని ఎవరి మీద చూపించలేక ఇంటికి వచ్చి భార్య మీదో పిల్లల మీద అరుస్తాడు.
(07:52) ఆఫీసలో జరిగిన ఒక చిన్న గొడవ అతని వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తుంది. క్షమాపణ అనేది ఎదుటివారికి ఇచ్చే బహుమతి కాదు మీకు మీరు ఇచ్చుకునే స్వేచ్ఛ. ఎనిమిదవ రకం చెత్త ఎప్పుడూ గతంలోనే జీవించడం. గతం అనేది ఒక పాఠశాల లాంటిది. అక్కడికి వెళ్లి పాఠాలు నేర్చుకోవాలి కానీ అక్కడే శాశ్వతంగా నివాసం ఉండకూడదు. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే జరగాల్సిన మంచి కూడా ఆగిపోతుంది.
(08:14) ఒక వాహనం నడిపేటప్పుడు ముందున్న పెద్ద అద్దంలో చూడాలి కానీ పక్కన ఉన్న చిన్న అద్దంలో చూస్తూ డ్రైవింగ్ చేస్తే ప్రమాదం కాయం మీ జీవితం కూడా అంతే. గతం అనేది ఆ చిన్న అద్దం లాంటిది. దాన్ని అప్పుడప్పుడు చూస్తూ జాగ్రత్త పడాలి. అంతేకానీ అక్కడే దృష్టి పెడితే ప్రస్తుత జీవితం ప్రమాదంలో పడుతుంది. తొమ్మిదవ రకం చెత్త ప్రతికూల స్వీయ సంభాషణ అంటే మీకు మీరే నెగిటివ్ గా మాట్లాడుకోవడం నేను దేనికి పనికి రాను నా బతుకు ఇంతే నా అదృష్టం బాలేదు అని పదే పదే మీ మెదడుకు మీరే చెబితే అది అదే నిజమని గట్టిగా నమ్ముతుంది.
(08:44) ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే అదే నిజమవుతుంది అంటారు కదా మీ మెదడు కూడా మీరు చెప్పే నెగిటివ్ మాటలను అలాగే నమ్ముతుంది. ఇక్కడ మీకు ఒక పెద్ద సందేహం రావచ్చు. అసలు మెదడు ఎందుకు ఎప్పుడు ఈ చెడు జ్ఞాపకాలని ఎక్కువగా పట్టుకుంటుంది మంచి విషయాలను ఎందుకు అంత త్వరగా మర్చిపోతుంది దీనికి న్యూరోసైన్స్ లో ఒక స్పష్టమైన సమాధానం ఉంది. దానినే నెగిటివిటీ బయాస్ అంటారు.
(09:04) చాలా సులభంగా అర్థమయ్యేలా చెబుతాను వినండి. మన మెదడు నెగిటివ్ విషయాలకు వెల్క్రో లాగా పాజిటివ్ విషయాలకు టెఫ్లాన్ లాగా పనిచేస్తుంది. వెల్క్రో అంటే రెండు బట్టలను గట్టిగా అతుక్కునేలా చేసేది. టెఫ్లాన్ అంటే దేనిని అంటుకొనివ్వనిది వేల సంవత్సరాల క్రితం మనిషి అడవుల్లో బతికేటప్పుడు ఒక అందమైన పువ్వును గుర్తుపెట్టుకోవడం కంటే ఒక క్రూరమైన పులి ఎక్కడుందో గుర్తుపెట్టుకోవడం ప్రాణరక్షణకు చాలా ముఖ్యం.
(09:28) పులి అంటే ఒక భయం ఆ భయమే మనిషిని అప్రమత్తం చేసి బతికించింది. కాబట్టి మన మెదడు ఎప్పుడూ ప్రమాదాలను నెగిటివ్ విషయాలను ముందుగా గుర్తిస్తుంది. దానిపైనే దృష్టి పెడుతుంది. కానీ ఇప్పుడు మనం అడవుల్లో లేము. మనకు పువ్వుల భయం లేదు. కానీ మన మెదడు మాత్రం ఇంకా ఆ పాత పద్ధతిలోనే పనిచేస్తుంది. ఆఫీస్ లో బాస్ తిడితే లేదా ఎవరైనా బంధువులు అవమానిస్తే మెదడు దాన్ని ఒక పులిదాడిలాగా భావించి ఆ జ్ఞాపకాన్ని చాలా బలంగా ముద్రించుకుంటుంది.
(09:52) ఇదే మన మానసిక ఒత్తిడికి మనసులో చెత్త పేరుకుపోవడానికి అసలు కారణం. మరి ఈ భావోద్వేగాలను ఇలాగే మనసులో దాచిపెడితే ఏమవుతుంది? ఒక చిన్న ప్రయోగం ద్వారా ఇది తెలుసుకుందాం. ఒక కాళీ గ్లాసును తీసుకోండి. అందులో సగం నీళ్లు పోయండి. ఆ నీళ్ళ గ్లాసును మీ చేతితో గాలిలో ఒక నిమిషం పాటు పట్టుకోండి. మీకేమీ పెద్దగా అనిపించదు.
(10:13) అదే గ్లాసును ఒక గంట పాటు అలాగే కింద పెట్టకుండా పట్టుకోండి. అప్పుడు మీ చెయ్యి నెమ్మదిగా నొప్పి పుడుతుంది. అదే గ్లాసును ఒక రోజంతా అలాగే పట్టుకుంటే ఏమవుతుంది? మీ చెయ్యి తిమ్మిరి పెక్కి నరాలు తెగిపోయేంత భయంకరమైన నొప్పి వస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే గ్లాసు బరువు ఏమీ పెరగలేదు. నీళ్ళ బరువు అసలే పెరగలేదు.
(10:33) కానీ మీరు దానిని ఎంత ఎక్కువ సేపు మోస్తే అంత ఎక్కువ నొప్పి వస్తుంది. మన భావోద్వేగాలు కూడా అచ్చం ఇలాంటివే కోపం బాధ ఏడుపు అవమానం వీటన్నిటిని మనసులో దాచుకొని బయటకు మాత్రం నవ్వుతూ నటిస్తే లోపల మనసు పూర్తిగా కుళ్లిపోతుంది. ఎందుకంటే వాటిని మీరు ఏళ్ల తరబడి మోస్తున్నారు కాబట్టి కొంతమంది చిన్న విషయానికే ఎందుకు విరిగిపోతారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక చిన్న గొడవ జరగగానే లేదా ట్రాఫిక్ లో ఎవరైనా హారం కొట్టగానే కొంతమంది విపరీతంగా అరుస్తారు కోపంతో ఊగిపోతారు.
(11:02) మీరు అనుకోవచ్చు ఇంత చిన్న విషయానికి ఎందుకు వీళ్ళు అంత కోపం తెచ్చుకుంటున్నారు అని కానీ తప్పు ఆ చిన్న విషయంలో లేదు. వాళ్ళ మనసు ఇప్పటికే ఎన్నో బాధలతో ఒత్తిడితో 99% నిండిపోయి ఉంది. ఈ చిన్న సంఘటన ఆఖరి చుక్కలా పడి ఆ కోపం మొత్తం బయటకు ఒక్కసారిగా పొంగిపోయింది. అందుకే ఎవరైనా అకారణంగా మీ మీద కోపపడితే వారిని చూసి తిరిగి కోపగించుకోకండి.
(11:21) బహుశా వారు లోపల ఏదో పెద్ద యుద్ధమే చేస్తున్నారు అని అర్థం చేసుకోండి. మరి ఎందుకు కొంతమంది ఎంత పెద్ద సమస్యల్లో కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే వారు ఎప్పటికప్పుడు తమ మనసును శుభ్రం చేసుకుంటారు. తమలో పేరుకు పోతున్న ఎమోషనల్ చెత్తను ఎప్పటికప్పుడు బయటకు పంపేస్తారు. వారు తమ భావాలనను చాలా స్వేచ్ఛగా వ్యక్తం చేస్తారు. ఏడవాలనిపిస్తే మనస్ఫూర్తిగా ఏడుస్తారు.
(11:43) కోపం వస్తే తప్పు ఏంటో ముఖం మీదే మాట్లాడుకుంటారు. మనసులో పెట్టుకుని లోపల కుమిలిపోరు. మరి ఈ మనసును శుభ్రం చేసుకునే మార్గం లేదా? ఖచ్చితంగా ఉంది. మనసును కేవలం మాటలతో కాకుండా సైకాలజీ మరియు న్యూరో సైన్స్ ప్రకారం శుభ్రం చేసే 10 అద్భుతమైన శాస్త్రీయ అలవాట్లు ఇక్కడ ఉన్నాయి. వీటిని రోజువారే జీవితంలో పాటిస్తే మీ మనసు కచ్చితంగా ఒక ప్రశాంతమైన సరస్సులా మారుతుంది.
(12:07) అందులో మొదటిది జర్నలింగ్ అంటే మీ మనసులో ఉన్న భావాలను ఒక కాగితం మీద రాయడం. కోపం, బాధ, ఏడుపు లేదా ఎవరి మీదైనా పగ ఏదైనా సరే ఒక పుస్తకంలో అక్షరాల రూపంలో రాయండి. రాసిన తర్వాత ఆ పేజీని చిన్న ముక్కలుగా చించి చెత్తబుట్టలో పడేయండి. ఇలా చేయడం వల్ల మీ మెదడులో ఉన్న భారం సగానికి సగం తగ్గిపోతుంది. ఇది సైంటిఫిక్ గా నిరూపించబడిన ఒక అద్భుతమైన పద్ధతి రెండవది క్షమించడం ఎవరైనా మీకు అన్యాయం చేస్తే వారిని మనస్ఫూర్తిగా క్షమించండి.
(12:35) వారు చేసింది తప్పు కాదు అని కాదు వారి తప్పును మీ మనసులో మోసే ఉద్దేశం మీకు లేదు అని అర్థం. క్షమాపణ అనేది మీ మానసిక స్వేచ్ఛకు మొదటి మెట్టు. మూడవది కృతజ్ఞత సాధన. ప్రతి రోజు రాత్రి ముగిసే సమయానికి ఆ రోజు జరిగిన కనీసం మూడు మంచి విషయాలను గుర్తు చేసుకోండి. తినడానికి అన్నం దొరికింది. ఉండటానికి ఒక ఇల్లు ఉంది. నా కుటుంబం ఆరోగ్యంగా ఉంది.
(12:58) ఇలా మీకు ఉన్నవాటికి ప్రతిరోజు కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకుంటే మీ జీవితంలో లేని వాటి గురించిన బాధాక క్రమంగా తగ్గిపోతుంది. నాలుగవది డిజిటల్ డిటాక్స్ రోజులో కనీసం రెండు గంటలు మీ మొబైల్ ఫోన్, సోషల్ మీడియా టీవీలకు దూరంగా ఉండండి. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కంటే మీ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫోన్ పక్కన పెట్టి మీతో మీరు సమయం గడపండి.
(13:20) ఐదవది నిశ్శబ్ద సమయం ఉదయం లేవగానే వెంటనే ఫోన్ పట్టుకోకుండా ఒక 10 నిమిషాలు ఏమీ చేయకుండా ఎవరితోనూ మాట్లాడకుండా ప్రశాంతంగా కూర్చోండి. ఆ నిశ్శబ్దం మీ మనసుకు ఒక అద్భుతమైన శక్తిని ఇస్తుంది. మీ రోజంతా ఎలా ఉండాలో ఆ 10 నిమిషాలు నిర్ణయిస్తాయి. ఆరవది లోతైన శ్వాస. మీకు తీవ్రమైన కోపం లేదా విపరీతమైన భయం వచ్చినప్పుడు మీ శ్వాస చాలా వేగంగా మారుతుంది.
(13:45) ఆ సమయంలో ఒక ఐదు సార్లు నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకోండి. ఈ లోతైన శ్వాస ద్వారా ఆక్సిజన్ మీ మెదడుకు చేరి భావోద్వేగాలను నియంత్రించే అమిడాల అనే భాగాన్ని వెంటనే శాంతపరుస్తుంది. ఇది మెదడు పనితీరును మార్చే ఒక చిన్న ట్రిక్. ఏడవది ప్రకృతిలో నడక పచ్చని చెట్ల మధ్య చల్లని గాలిలో ప్రతిరోజు కనీసం ఒక అరగంట పాటు నడవండి.
(14:07) ప్రకృతికి మనిషి మనసును బాగు చేసే అద్భుతమైన శక్తి ఉంది. అది మీ ఒత్తిడి హార్మోన్లను చాలా వరకు తగ్గిస్తుంది. ఎనిమిదవది సరైన నిద్ర. నిద్ర అనేది మెదడుకు ఒక వాషింగ్ మెషిన్ లాంటిది. మీరు నిద్రపోతున్నప్పుడు మీ మెదడులో ఉండే లింఫాటిక్ సిస్టం రోజువారీగా పేరుకుపోయిన చెత్తను టాక్సిన్లను శుభ్రం చేస్తుంది. రోజుకు కనీసంఏడు నుండి ఎనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం.
(14:32) తొమ్మిదవది శారీరక వ్యాయామం చెమట పట్టేలా వ్యాయామం చేసినప్పుడు మీ శరీరంలో ఎండాల్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి మీ బాధను తగ్గించి ఆనందాన్ని పెంచుతాయి. శారీరక శ్రమ లేకుండా మానసిక ప్రశాంతత దొరకదు.పదవది భావాలను అంగీకరించడం మీకు ఏడుపు వస్తే బిగ్గరగా ఏడ్చేయండి. నేను మగాడిని నేను ఏడవకూడదు లాంటి చెత్త రూల్స్ పక్కన పెట్టండి.
(14:55) ఏడుపు అనేది మనసుకు ఒక స్నానం లాంటిది. బాధ వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం ఏడవడం అనేది చాలా సహజమైన మానవ లక్షణం. దానిని అణచి పెట్టకండి. ఇప్పుడు మీకోసం ఒక 21 రోజుల ఎమోషనల్ డిటాక్స్ ఛాలెంజ్ ఇస్తున్నాను. మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఏదైనా ఒక కొత్త పనిని 21 రోజులు వరుసగా క్రమం తప్పకుండా చేస్తే అది మనకు ఒక అలవాటుగా మారుతుంది. మీ మనసును పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఈ ఛాలెంజ్ అద్భుతంగా పనిచేస్తుంది.
(15:20) ప్రతిరోజు కేవలం ఒక 10 నిమిషాలు మీకోసం కేటాయించండి. మీరు చేయాల్సింది చాలా చిన్న పనులు మాత్రమే మొదటి రోజు ఛాలెంజ్ ఒక కాగితం తీసుకొని మీ జీవితంలో మిమ్మల్ని అత్యంత ఎక్కువగా బాధ పెడుతున్న ఒక భయాన్ని రాయండి. ఆ భయం వెనుక ఉన్న అసలు కారణాన్ని రాయండి. దాన్ని అలా కాగితం మీద చూడగానే మీ భయం సగం తగ్గిపోతుంది.
(15:41) రెండవ రోజు గతంలో మిమ్మల్ని మోసం చేసిన లేదా అత్యంత ఘోరంగా అవమానించిన ఒక వ్యక్తిని ఈరోజు మనస్ఫూర్తిగా క్షమించండి. వారిని మీరు నేరుగా కలిసి చెప్పాల్సిన పని లేదు. మీ మనసులో మీరు వారిని క్షమిస్తే చాలు. మూడవ రోజు మీ ఫోన్లో అనవసరంగా మీ సమయాన్ని తినేసే మీకు ఇతరులతో పోల్చుకునేలా చేసి నెగిటివ్ ఆలోచనలు తెప్పించే ఒక సోషల్ మీడియా యాప్ ను ఒక రోజంతా అన్ ఇన్స్టాల్ చేసి చూడండి.
(16:04) నాలుగవ రోజు మీరు రోజు మాట్లాడే వ్యక్తుల్లో మీకు ఏదో ఒక సమయంలో ఎంతో సహాయం చేసిన ఒక వ్యక్తికి ఈరోజు ఫోన్ చేసి మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పండి. ఆ చిన్న కృతజ్ఞత వారిని మిమ్మల్ని కూడా సంతోష పెడుతుంది. ఐదవ రోజు ఉదయం లేదా సాయంత్రం మీ ఇంటిపై కప్పు మీదకు వెళ్లి ఒక 10 నిమిషాలు కేవలం ఆకాశాన్ని చూస్తూ ప్రశాంతంగా గడపండి. ఎలాంటి ఆలోచనలు వద్దు. ఒక శూన్యంలో ఉన్నట్లు ఊహించుకోండి.
(16:25) ఆరవ రోజు పాత డైరీలు పనికిరాని మెసేజ్లు మీకు పాత బాధలను గుర్తు చేసే ఫోటోలు మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి. ఆ ఫోటోలు చూసిన ప్రతిసారి మీ గుండె బరువెక్కుతుంది కదా ఆ చెత్తను మీ మనసులో మీ ఫోన్లో ఇక మోయకండి. ఏడవ రోజు మీలో మీకు నచ్చిన మూడు మంచి లక్షణాలను అద్దం ముందు నిలబడి మీ కళ్ళలోకి మీరు చూసుకుంటూ గట్టిగా చెప్పండి.
(16:47) ప్రపంచం మిమ్మల్ని మెచ్చుకోకపోయినా ముందు మిమ్మల్ని మీరు మెచ్చుకోవడం నేర్చుకోండి. ఎనిమిదవ రోజు మీకు ఇష్టమైన కానీ మీరు ఎప్పుడూ వదిలేసిన ఒక పనిని ఈ రోజు మళ్ళీ మొదలు పెట్టండి. పాట పాడటం, బొమ్మ గీయడం, మొక్కలు నాటడం ఏదైనా సరే అది మీ మనసుకు ఒక మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. తొమ్మిదవ రోజు ఎవరి గురించో కాదు ఈ రోజు మీకోసం మీరు ఒక మంచి బహుమతి ఇచ్చుకోండి.
(17:09) అది ఒక చిన్న స్వీట్ అయినా పర్వాలేదు. మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలు పెడితే ఇతరుల ప్రేమ కోసం ఎదురుచూడం ఆగిపోతుంది. 10వ రోజు ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పుడు దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం మానేస్తానని ఈ రోజు మీకు మీరు మాటిచ్చుకోండి. వాళ్ళ విమర్శ వాళ్ళ వ్యక్తిత్వానికి నిదర్శనం మీ భవిష్యత్తుకు కాదు. 11వ రోజు రాత్రి పడుకునే ముందు రేపటి రోజు ఎంత అద్భుతంగా ఉండబోతుందో ఊహించుకుంటూ ప్రశాంతంగా నిద్రపోండి.
(17:33) పడుకునే ముందు మీ చివరి ఆలోచన మరుసటి రోజు మీ మొదటి ఆలోచనను నిర్ణయిస్తుంది. 12వ రోజు మీరు ఇప్పటివరకు జీవితంలో సాధించిన విజయాల జాబితాను ఒక కాగితం మీద రాయండి. అది చిన్నప్పుడు సైకిల్ తొక్కడం నేర్చుకోవడం లాంటి చిన్న విజయం అయినా సరే దాన్ని రాయండి. మీరు ఎంత బలవంతులో ఆ కాగితం మీకు గుర్తు చేస్తుంది. 13వ రోజు ఈరోజు పడుకునే ముందు ఒక గంట పాటు ఫోన్ అస్సలు ముట్టుకోకండి.
(17:53) కేవలం మీకు స్ఫూర్తిని ఇచ్చే ఒక మంచి పుస్తకం చదవండి. 14 వ రోజు మీలో ఉన్న అతి పెద్ద లోపాన్ని అంగీకరించండి. ఈ సృష్టిలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు అన్న సత్యాన్ని మనస్ఫూర్తిగా నమ్మండి. మీ లోపాన్ని మీరే అంగీకరిస్తే దాన్ని చూపిస్తూ ఎవరు మిమ్మల్ని బాధ పెట్టలేరు. 15వ రోజు గతం గురించి ఆలోచించడం మానేసి కేవలం ఈ క్షణంలో ప్రస్తుతం మీరు చేస్తున్న పని మీద మాత్రమే పూర్తి ఏకాగ్రత పెట్టండి.
(18:14) దీనినే మైండ్ ఫుల్నెస్ అంటారు. 16వ రోజు ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవడం ఈ రోజుతో పూర్తిగా ఆపేయండి. మీ ప్రయాణం మీది, వారి ప్రయాణం వారిది అని గ్రహించండి. ఒక పూట భోజనం దొరకడమే అదృష్టంగా భావించే వాళ్ళు ఈ లోకంలో కోట్లలో ఉన్నారు అన్న విషయం మర్చిపోకండి. 17 వ రోజు ఎవరి మీదైనా పగ లేదా కోపం ఉంటే ఆ వ్యక్తి పేరు కాగితం మీద రాసి ఆ కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా చించి గాలిలో ఎగరవేయండి.
(18:38) ఆ గాలితో పాటు మీ కోపం కూడా కొట్టుకుపోవాలి. 18 వ రోజు ప్రకృతితో కనెక్ట్ అవ్వండి. కనీసం ఒక అరగంట పాటు చెప్పులు లేకుండా పచ్చగడ్డి మీద నడవండి. భూమికి మీ పాదాలు తగిలేలా నడవండి. భూమికి ఉండే అయస్కాంత శక్తి మీలోని నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. 19 వ రోజు మీ మీద మీరు చేసుకునే ప్రతికూల స్వీయ సంభాషణను వెంటనే ఆపేయండి. నా వల్ల కాదు అనే మాట తీసేసి నేను ఖచ్చితంగా సాధించగలను అని మీతో మీరు పాజిటివ్ గా మాట్లాడుకోండి.
(19:05) 20వ రోజు మీలో ఎప్పుడూ భయాన్ని నిరాశను నింపే ఒక నెగిటివ్ వ్యక్తికి ఈ రోజు నుండి శాశ్వతంగా దూరంగా ఉండాలని గట్టి నిర్ణయం తీసుకోండి. 21వ రోజు ఇప్పుడు మీరు ఒక కొత్త మనిషి. ఈ 21 రోజుల్లో మీరు వదిలేసిన ఆ మనసులోని చెత్త వల్ల మీ మనసు ఎంత తేలికగా ఉందో అనుభూతి చెందండి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే మీ మెదడులో కొత్త ఆలోచన మార్గాలు ఏర్పడతాయి.
(19:27) అప్పుడు నెగిటివ్ ఆలోచనల స్థానంలో పాజిటివ్ ఆలోచనలు శాశ్వతంగా స్థిరపడతాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. మనం మాట్లాడుకున్న ఈ విషయాలు మనసుకు ప్రశాంతతను ఇవ్వడానికి రోజువారి ఒత్తిడిని జయించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. కానీ మీ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అది నీ రోజువారి జీవితాన్ని నిద్రను పూర్తిగా నాశనం చేస్తుంటే నిపుణమైన డాక్టర్ ను కలవడం అత్యంత సహజమైన విషయం.
(19:48) శరీరానికి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లడంలో ఎలాంటి తప్పు లేదు కదా మనసుకు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లడంలో ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. వీడియో మొత్తం చూసిన తర్వాత మీలో ఒక కొత్త ఆశ చిగురించిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. భయాన్ని వదిలేసి ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఒక సంఘటన మీ భవిష్యత్తును ఎప్పటికీ ఆపలేదు.
(20:08) గతం అనేది ముగిసిపోయిన ఒక పాత అధ్యాయం ప్రస్తుతం అనేది మీరు రాస్తున్న ఒక కొత్త పేజీ అందులో ఎలాంటి చెత్తను నింపకండి కేవలం ఆనందాన్ని మాత్రమే నింపండి. మీ మనసు ఒక గది కాదు ఒక దేవాలయం అక్కడ చెత్త నిల్వ చేయడానికి కాదు ప్రశాంతతను నిల్వ చేయడానికి ఈ రోజు నుండి ప్రతిరోజు కొద్దిగా మనసును శుభ్రం చేయండి. ఒకరోజు మీ జీవితమే మారిపోయిందని మీరు గుర్తిస్తారు.
(20:30) ఈ రోజు నుంచి మీరు మీ మనసులో నుంచి ఏ ఒక్క చెత్తను బయటకు విసరబోతున్నారు. కామెంట్ లో ఒక్క మాట రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి లోతైన జీవిత పాఠాల కోసం మిస్టర్ ఏకే ప్రైమ్ కుటుంబంలో భాగంవ్వండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోలో కలుద్దాం నమస్కారం.

No comments:

Post a Comment