స్త్రీ ప్రేమలో మగాడి మాయ!⚠️ | Beware of this Dark Psychology Trap!
Author Name:Power Voice
Youtube Channel Url:https://www.youtube.com/@PowerVoiceTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=3pivNgy4_pc
Transcript:
(00:01) ఒక స్త్రీ మగాడి ప్రేమలో పడిందా లేక అతని ట్రాప్ లో చిక్కుకొని మోసపోతుందా కొంతమంది మగాళ్ళు స్త్రీల మనస్తత్వంతో ఆడుకోవడానికి వాళ్ళను తమ వైపు తిప్పుకోవడానికి ఎటువంటి అనుమానం రాని [సంగీతం] ఒక మైండ్ గేమ్ వాడతారు. దీనివల్ల చాలామంది అమాయకమైన స్త్రీలు తెలియకుండానే మెంటల్ గా బానిసలుగా మారిపోతున్నారు. అసలు ఈ ట్రిక్ ఏంటి? స్త్రీని ఎలా ట్రాప్ చేస్తారు ఈ ప్రమాదం నుండి స్త్రీ తనను తాను ఎలా కాపాడుకోవాలి ఈరోజు ఈ వీడియోలో చూద్దాం.
(00:40) ఈ మైండ్ గేమ్ ని సైకాలజీలో పుష్ అండ్ పుల్ మెథడ్ అంటారు. ఇది స్త్రీ ఎమోషన్ తో ఆడుకునే సైకలాజికల్ వెపన్ ఇందులో మొదటి స్టెప్ పుల్ అంటే మగాడు మొదట్లో ఆ స్త్రీకి విపరీతమైన అటెన్షన్ ఇస్తాడు.రో రోజులో 24 గంటలు అందుబాటులో ఉంటాడు. ఆమెను ఆకాశానికి ఎత్తేస్తాడు. దీనివల్ల స్త్రీ అతనికి మానసికంగా కనెక్ట్ అయిపోతుంది. సరిగ్గా ఆమె పూర్తిగా నమ్మిన తర్వాత అతను సెకండ్ స్టెప్ [సంగీతం] తీసుకుంటాడు.
(01:16) అదే పుష్ హటాత్తుగా మాట్లాడడం తగ్గిస్తాడు. బిజీగా ఉన్నట్టు నటిస్తూ కారణం లేకుండా దూరం పెడతాడు. ఈ సడన్ మార్పు స్త్రీని పూర్తిగా గందరగోళంలో పడేస్తుంది. సైంటిఫిక్ గా చెప్పాలంటే మొదట్లో దొరికిన అటెన్షన్ వల్ల ఆమె మెదడులో డొపమైన్ అనే హ్యాపీ కెమికల్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే అతను దూరం పెడతాడో ఆ కెమికల్ ఆగిపోతుంది. దాంతో ఆమెలో ఒక రకమైన యంజైటీ మొదలవుతుంది.
(01:51) నిన్న అంత బాగా మాట్లాడిన అతను ఈరోజు ఎందుకు ఇలా ఉన్నాడు? నావల్ల ఏమైనా తప్పు జరిగిందా అని ఆమె తనని తాను బ్లేమ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఈ గందరగోళంలోనే స్త్రీ తెలియకుండానే అతని గురించి [సంగీతం] 24 గంటలు ఆలోచించడం మొదలు పెడుతుంది. దాన్నే చాలామంది స్త్రీలు ప్రేమ లేదా క్రేజ్ అనుకొని మోసపోతారు. కానీ [సంగీతం] అది నిజానికి ఒక ఎమోషనల్ ట్రాప్ మగాడు దూరం పెట్టిన ఆ రోజుల్లో స్త్రీ అనుభవించే మానసిక నరకం అంతా ఇంతా కాదు.
(02:32) ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఫోన్ వైపు ఆశగా చూస్తుంది. అతను ఆన్లైన్ లోకి వస్తున్నాడా లేదా అని గంటల తరబడి వెయిట్ చేస్తుంది. చివరకు ఆమె పంపిన మెసేజ్లకు అతను కనీసం రిప్లై కూడా ఇవ్వకుండా వదిలేస్తాడు. ఆ ఒక్క క్షణంలో [సంగీతం] ఆమె గుండెల్లో ఏదో తెలియని భయం అలజడి మొదలవుతాయి. రాత్రిళ్ళు నిద్ర పట్టదు నేను చేసిన తప్పేంటి అని తనని తాను నిందించుకుంటూ ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక మగాడి మైండ్ గేమ్ స్త్రీ జీవితాన్ని ఇంతలా అతలా కుతలం చేస్తుంది.
(03:10) అసలు కొంతమంది మగాళ్ళు కావాలనే ఇలా ఎందుకు దూరం పెడతారు? స్త్రీని మానసికంగా వీక్ [సంగీతం] చేసి వాళ్ళ కంట్రోల్ లోకి తెచ్చుకోవడానికి ఆ మగాడి కోసం స్త్రీ తపనపడేలా చేసి ఆ రిలేషన్ లో కంప్లీట్ గా కంట్రోల్ సాధించడానికి స్త్రీకి తెలియకుండా అతను చేసే ఎమోషనల్ బ్లాక్ మెయిలే ఇది. మరి ఇటువంటి మైండ్ గేమ్స్ ఆడే మగవారి నుండి స్త్రీలు తమని తాము ఎలా కాపాడుకోవాలి? మొదటగా అటెన్షన్ ని నమ్మకండి ఎవరైనా పరిచయమైన కొత్తల్లోనే విపరీతమైన అటెన్షన్ ఇస్తూ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తుంటే కాస్త అలెర్ట్ అవ్వండి. గ్యాప్ వస్తే
(03:56) గమనించండి. అతను కావాలనే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి దూరం పెడుతున్నాడు అనిపిస్తే మీరు కూడా అతనికి [సంగీతం] అటెన్షన్ ఇవ్వడం ఆపేయండి. అతను మెసేజ్ చేయకపోతే మీరు కూడా చేయకండి [సంగీతం] మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకోండి
No comments:
Post a Comment