*దేనికోసం వెతుకుతున్నావు ఎవరికోసం వెతుకుతున్నావు ప్రేమ కోసమా కుటుంబ కోసమా స్నేహితుల కోసమా నిన్ను నిన్నుగా ప్రేమించి స్నేహం చేసే మనుషుల కోసమా..*
*ఆగు ఒక నిమిషం ఆలోచించు వీటన్నిటికన్నా ముఖ్యమైంది ఏదో నీ జీవితంలో మిస్ అయ్యావేమో మర్చిపోయావేమో ఒకసారి గుర్తు తెచ్చుకో ..*
*నువ్వు కోరుకున్న ఈ స్నేహం ఈ ప్రేమ ఈ కుటుంబము ఈ వ్యక్తులు ఈ సమాజం వీళ్ళందరూ ఎప్పుడూ నీతోనే ఉంటారా??*
*ఉంటారు ఉన్నారు అనుకుంటే అది నీ బ్రమా మాత్రమే..*
*విలువైన దాన్ని వదిలేసి రంగురాళ్ల కోసం వెతుకుతున్నావెందుకు??*
*ఇది చదువుతుంటే ఇక్కడ నువ్వే ఉన్నట్టుంది కదా నీ పాత్రే కనిపిస్తుంది కదా నువ్వు మర్చిపోయిన విషయాలను గుర్తు చేస్తున్నట్టుంది కదా నిజమే ఇది నీకోసమే..*
*ఒకసారి ఆలోచించు ఇక్కడ నీకేం కనిపిస్తుంది నువ్వేం చూస్తున్నావ్ ఏదో మిస్ అవుతున్నట్టు లేదు..*
*స్నేహితులు ఉన్నారు ప్రేమ ఉంది కుటుంబం ఉంది సమాజం ఉంది నువ్వు కోరుకున్న ప్రతి ఒక్కటి నీ జీవితంలో ఉంది అయినా ఏదో వెలితిగా ఉంది కదా ఏంటది చెప్పు..*
*నేను చెప్పనా చెప్పేస్తున్నా మరి అన్నిటికన్నా విలువైంది నీకు నువ్వు నిన్ను నువ్వు వదిలేసి ఎవరినో ప్రేమిస్తారు ఎవర్నో పోషిస్తూ ఎవరికోసం బ్రతుకుతూ నిన్ను నువ్వు పోగొట్టుకున్నావు కదా..*
*అన్నీ ఉన్నాయి నీ జీవితంలో లేనిది నీకు నువ్వు మాత్రమే నీ ఆలోచనలో నీ కష్టం లో నీ ప్రేమలో నీ సంతోషంలో నీ జీవితంలో నిజమే అనిపిస్తుంది కదా బాధగా అనిపిస్తుంది కదా..*
*మరి ఇప్పుడు ఎలా ఏం చేద్దాం నీలో ఉన్న నువ్వు కనిపించాలంటే చూడాల్సినది అద్దాన్ని కాదు*
*నీ మనసుని నీ మనసులోని నీ పాత్రని ఆ పాత్రలోని నిర్లక్ష్యాన్ని పాపం కదా నీకు నువ్వే న్యాయం చేసుకోలేని వాడివి ఇంకా పక్క వాళ్ళకే న్యాయం చేస్తావ్ వేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు అంత టాష్.*
*ఎవరైనా అవసరానికి వాడుకునే బంధువులే వింటే బాధగా ఉంది కదా బాధగా ఉన్నా ఇదే నిజం ..*
*నీకు నువ్వు ఉన్నావన్నదే నిజం నీలో ఉన్న నిన్ను మర్చిపోయావు అన్నదే నిజం నీతో నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి..*
*ఒకసారి నీతోనే మాట్లాడు నీ గురించి నువ్వు ఎంత పట్టించుకుంటున్నావో ఆలోచించు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో గుర్తు తెచ్చుకో ఆలోచించడం మొదలు పెట్టావు కదా..*
*అక్కడ ఏం కనిపించింది బాధ వేదన నిర్లక్ష్యం కదా సరే ఇప్పటి వరకు ఆలోచించలేదు ఇప్పుడైనా అర్థమైంది కదా నీకేం కావాలో నువ్వు ఎలా ఉంటే హ్యాపీగా ఉంటావో ..*
*ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో నీ శరీరాన్ని నీ మనసుని నీకేం కావాలో అప్పుడు అర్థమవుతుంది ...*
*నీకు కావాల్సింది నువ్వు మాత్రమే ఇవ్వగలుగుతావు ఇంకెవరు ఇవ్వలేరు మనస్పూర్తిగా ఈ స్వార్థము లేకుండా.*
No comments:
Post a Comment